జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 5 55

ఆ నలుగురిని ఆక ఆటో ఎక్కించి తమను ఫాలో అవ్వమని చెప్పి ముందుగా వంట సామాగ్రిని తరువాత ఫర్నిచర్ మరియు బెడ్స్, సోఫా , ఛైర్స్ మరియు curtains మరియు ఎలక్ట్రానిక్ షో రూమ్ కు వెళ్లి టీవీ ,ఫ్రిడ్జ్ ,వాషింగ్ మెషీన్ ఇలా ఒక దాని తరువాత ఒకటి కొని ట్రక్ లలో వేసి ఇంటి అడ్రస్ కు పంపిస్తుండగా చివరి ట్రక్ లో కృష్ణను కూడా పంపుతూ నువ్వు అక్కడ పనులు చూసుకో ఇక మిగతా పనులు నేను చూసుకుంటాను అని చెబుతాడు. మెస్త్రి మొత్తం శుభ్ర పరిచి ఎక్కడెక్కడ ఏవేవి ఉంచాలో కృష్ణ ను అడుగుతూ పని వాళ్లకు త్వరత్వరగా చెబుతూ దగ్గరుండి వొంటి గంట కల్లా మొత్తం చేయిస్తాడు.

అదే సమయంలో మహేష్ వైజాగ్ లొనే ఫేమస్ decoration suppliers దగ్గరికి వెళ్లి కొత్త ఇంటిలో చేరుకోబోతున్నందుకు ఇంటిని మొత్తం అలంకరించి ఫైర్ crackers ను రిమోట్ ద్వారా పేలేలా సాయంత్రం లోపల సెట్ చెయ్యాలని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి అడ్రస్ చెబుతాడు , బయటకు రాగా పక్కనే నగల షో రూమ్ కనిపించగా లోపలికి వెళ్ళి డిస్ప్లే లో చూస్తూ తనకు నచ్చినవి తన ఫోన్ లో ఫోటోలు తీసుకుని , తరువాత టాటా షో రూమ్ కు వెళ్లి టాటా నెక్సన్ కారును కొని డెలివరీ అడ్రస్ ఫోన్ చేసి చెబుతానని చెప్పి , manager ను కలిసి తనకు ఒక పేపర్ పై బొమ్మ వేసి ఇలాంటి వెహికల్ కావాలని అడుగగా ఇలాంటివి మామూలుగా కొత్తవి దొరకవు కానీ ఒక అడ్రస్ ఇస్తాను అతడు పాత వాహనాలను మనకు నచ్చిన రీతిలో తయారు చేస్తారు అని చెప్పి అడ్రస్ ఇవ్వగా ,thanks చెప్పి అక్కడకు వెళతాడు.

చీఫ్ ను కలిసి బొమ్మ చూపించగా లోపలికి తీసుకొని వెళ్లి అన్ని వాహనాలను చూపించగా తనకు నచ్చిన ఒక వాహనాన్ని చూపిస్తాడు , ఎప్పటి లోపు కావాలి అని అడుగగా రేపు ఇదే సమయానికి అని చెప్పగా ఖర్చు ఎక్కువ అవుతుంది అనగా 50000 చేతిలో అడ్వాన్స్ పెట్టి డెడ్ లైన్ చెప్పి, లేడీస్ కార్నర్ కు చేరుకొని తన తల్లి వయసున్న ఒక స్త్రీ దగ్గరికి వెళ్లి hi మేడం అని సున్నితంగా పాలకరించగా ఆమె సిగ్గుపడి మీకు ఏ విధంగా సహాయపడగలను అని సినిమా డయలాగ్ ఒకటి నాపై విసరగా మీ లాంటి వయసున్న వారికి ఏవేవి అవసరం అవుతాయో అన్ని ఒక 5 జతలు ప్యాక్ చెయ్యమని చెప్పగా ఒక అర గంటలో బాక్స్ లో పెట్టగా డబ్బు పే చేసి బైకు మీద పెట్టుకొని కొత్త ఇంటి దగ్గరకు వెళతాడు.

బయట కాంపౌండ్ మొత్తం శుభ్రం చేయబడి , స్విమ్మింగ్ పూల్ లో నీరు విడిచి లోపలికి వెళ్ళి చూడగా అన్ని వస్తువులు తెలుపు మరియు పింక్ రంగువి మాత్రమే వుండి మొత్తం తను అనుకున్న దానికంటే బాగా చేసినందుకు సంతోషపడుతూ వాళ్ళు అడిగిన మొత్తం డబ్బును సంతోషంగా ఇచ్చి పంపుతాడు.

2 Comments

  1. Story is so fine. Please update and post till the end

Comments are closed.