జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 5 55

మీకు ఇంకా వీలైతే ఇప్పుడు ఉండే ఇంటిని వదిలి కొన్ని రోజులు వేరే ఇంటిలో ఉండటం ఇంకా ముఖ్యం , కొన్ని రోజులు ఊరికి దూరంగా ఏదైనా చల్లటి ప్రదేశాలకు తీసుకొని వెళ్ళండి అని మొత్తం అర్థమయ్యేటట్లు వివరించి ఇంకో గంటలో స్పృహ లోకి వస్తుంది మళ్ళీ వచ్చి చూస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంజుక్షన్ మరియు గ్లూకోస్ శరీరం లోకి వెళ్లడం వల్ల కొద్దిగా శక్తి రాగా డాక్టర్ చెప్పినదంత కొద్ది కొద్దిగా వినబడసాగింది.

కృష్ణ తల్లి బెడ్ పక్కనే కూర్చోని జాగ్రత్తగా చేసుకుంటుండగా గ్లూకోస్ మొత్తం లోపలికి వెళ్లిన కొద్ది సమయం తరువాత మహేష్ తల్లి కదిలి కళ్ళు తెరువగా వెంటనే డాక్టర్ ని పిలుచుకొని రాగా ఆమెను పరిశీలించి అంతా బాగానే ఉంది మీరు ఇక వెల్లలనుకుంటే ఇంటికి తీసుకొని వెళ్లొచ్చు అని చెప్పగా , ఆమెకు థాంక్స్ చెప్పగా నవ్వుతూ బయటకు వెళుతుంది. కృష్ణను పిలిచి బిల్ కట్టెయ్యమని చెప్పగా కౌంటర్ కు వెళ్లి మొత్తం కట్టడానికి వెళ్లగా డాక్టర్ చెప్పినదంత చెప్పి ఈ వారం రోజులు నువ్వు పడిన బాధను చూసాను కాబట్టి చెబుతున్నాను ఇక నీ భర్తను మరిచిపోయి మహేష్ నే నీ సర్వస్వం అనుకోని సంతోషంగా ఉండు.

ఇది నేను ఒక స్నేహితురాలిగా కాకుండా నీ మంచి కోరే శ్రేయోభిలాషిగా చెబుతున్నాను. నువ్వు ఎంత నీ భర్తను మార్చడానికి ప్రయత్నించావో నాకు తెలుసు అయిన మారలేదంటే అది నీ తప్పు కానీ కాదు, నీ భర్త తోనే జీవితం అయిపోయింది అని అనుకోకు నీ మీద నీ కొడుకుకు ఎంత ప్రేమ ఉందొ నీక్కూడా తెలుసు , నిన్ను పువ్వుల్లో పెట్టుకొని నీకు ఏ కష్టం రాకుండా పూజిస్తాడు అన్న నమ్మకం నాకు ఉంది.

కాబట్టి ఇక నిర్ణయించుకోవాల్సింది నువ్వే అని చెబుతుండగా తలుపు తెరుచుకొని వదిన ఎలా ఉంది ఇప్పుడు అని బాధ పడుతూ బెడ్ దగ్గరికి వచ్చిన మహేష్ చిన్న అత్తయ్య బెడ్ పై కూర్చొంటు తన అన్నయ్యను తిడుతూ ,ఇక్కడ ఇంత జరుగుతుంటే ఆ మహేష్ గాడు ఎంజాయ్ చెయ్యడానికి టూర్ వెళ్లాడా అని చాలా కోపంగా తిడుతుండగా అప్పుడే లోపలికి వచ్చిన కృష్ణ మరియు పిల్లలు అందరూ వింటారు.

2 Comments

  1. Story is so fine. Please update and post till the end

Comments are closed.