జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 5 55

అంటీ కృష్ణ గాడు ఎక్కడ అని అడుగగా నన్ను బైక్ మీద బయట దిగబెట్టి అర్జంట్ పని ఉంది అని వెళ్ళాడు అని చెప్పగా ok అంటీ నేను కాల్ చేస్తాను అని చెప్పి తన ఇంటి కాంపౌండ్ లోకి వచ్చి కృష్ణ కు కాల్ చేసి ఎక్కడకు వెళ్ళావురా అని అడుగగా మన స్నేహితుడు శేఖర్ ఇంటి దగ్గరలో కొత్త ఇల్లు ఖాళీగా ఉందంటే మనకు సరిపోతుందో లేదో అని చూడటానికి వెళ్తున్నాను అని చెప్పగా లవ్ యు రా మామ అని చెప్పి అక్కడ వద్దు అసలు సిటీ లోపల వద్దు ఎవరో ఒకరు కలుస్తూ గుర్తు చేస్తూ ఉంటారు, కాబట్టి సిటీ బయట బీచ్ పక్కన చూద్దాము నువ్వు వెనక్కు వచ్చెయ్యి అని చెప్పగా సూపర్ రా మామ అక్కడ అయితే ప్రశాంతంగా ఉండవచ్చు రేపటి లోపు వెతుకుదాము అని చెప్పి 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెబుతాడు.

ఫోన్ కట్ చేస్తుండగా తన కన్నా తల్లి గుర్తుకు రాగా వెంటనే కాల్ చెయ్యగా నా కాల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చేతిలోనే పట్టుకొని వేచి చూస్తున్నట్లు ఒక్క రింగుకే ఎత్తి అమ్మకు ఎలా ఉంది అంతా ok కదా అని ఆత్రంగా అడుగగా ఇప్పుడు ok అని ఉదయం నుండి జరిగినదంతా చెప్పగా , అమ్మకు ఇక నువ్వు తప్ప ఇంకా ఎవ్వరు లేరు జాగ్రత్తగా చూసుకో అని చెప్పగా అమ్మ మీరు కూడా జాగ్రత్త అని వాత్సల్యంతో చెప్పగా , నువ్వు వెళ్లిన వెంటనే విక్రమ్ వచ్చి ఇద్దరు లేడీ constables ను ఇక్కడే వారి డ్యూటీ ని వేసి ఏ సమస్య వచ్చినా కాల్ చెయ్యమని చెప్పి వాళ్ళకు జాగ్రత్త అని చెప్పి వెళ్లారు, మేము ముగ్గురం ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాము నువ్వు నా గురించి ఏమాత్రం చింతించకుండా అమ్మను ప్రేమగా చూసుకో అని చెప్పగా మిస్ యూ అమ్మ అని ప్రేమగా ముద్దు పెట్టి ఉదయం కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు.

అదే సమయంలో బాత్రూం లో జానకి మొహం కడుక్కొంటు ఉండగా ఇందాక నువ్వు నీ కొడుకుతో సంతోషంగా ఉండటం చూసి చాలా చాలా ఆనందం వేసింది, నువ్వు బాధపడి నువ్వంటే ప్రాణంగా, నిన్ను కంటికి రెప్పలా చూసుకొనే నీ మహేష్ ను బాధ పడేలా చేయొద్దు అని మళ్ళీ చెప్పగా అర్థమైనట్లు సంతోషంగా తల ఊపుతుంది.టవల్ జానకి చేతికి అందిస్తూ పద ఇక తిందాము అని ముఖం తుడుచుకుంటూ హాల్ లోకి వస్తారు.

2 Comments

  1. Story is so fine. Please update and post till the end

Comments are closed.