జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 5 68

కొంత సమయం తరువాత అమ్మ లోపలికి వెళ్దామ అని అడుగగా తన కొడుకు కౌగిలిలో నుండి విడిపోవడం ఇష్టం లేక ఇంకా గట్టిగా కౌగిలించుకోగా ఆమె వీపుపై చేతులు వేసి నిమురుతూ తలపై ప్రేమగా ముద్దులు పెడుతూ ఒక చేతిని అలాగే ఉంచి మరొక చేతిని కిందకు జరుపుతూ మోకాళ్ళ వరకు పోనిచ్చి అమాంతం ఎత్తుకొనగా ఆమె చేతులను తన కొడుకు మీద చుట్టూ వేవేసి పట్టుకోగా నడుచుకుంటూ లోపలికి వెళతాడు.

తలుపు పక్కనే ఉన్న అన్ని స్విచ్ లు వెయ్యగా లోపల మొత్తం తెలుపు మరియు పింక్ కలర్ గోడలు మరియు కిటికీ curtains లైట్స్ వెలుగులతో ఇంకా ప్రకాశిస్తున్నాయి. అమ్మ 9 గంటలలోపు పాలు పొంగించాలి కావున త్వరగా ఫ్రెష్ అవ్వాలి అని చెప్పి బెడ్ రూమ్ చూపిస్తాడు. అంతలోపు మహేష్ బయటకు వెళ్లి కారులో ఉన్నవన్నీ లోపలికి తెచ్చి టవల్ బయటకు తీసి బెడ్ పై ఉంచుతాడు. నగలన్ని ఒక్కొక్కటిగా మొత్తం బెడ్ పై బాక్సస్ తెరిచి మొత్తం పెడతాడు. తన తల్లి బాత్రూం లోనుండి బయటకు రాగా ఒక టవల్ ఇచ్చి బెడ్ పక్కనే మోకాళ్లపై కూర్చొంటాడు.

జానకి తుడుచుకుంటూ రూమ్ అంతా మెరుస్తుండగా బెడ్ పై చూడగా నోరు తెరిచి వాటినే చూస్తూ మళ్ళీ షాక్ కొట్టిన దానిలా ముఖం మీద నుండి నీరు కారుతుండగా కదలకుండా నిలబడిపోతుంది. అమ్మ అమ్మ అమ్మ అని మూడు సార్లు పిలిచినా పలకక పోయేసరికి మహేష్ లేచి ఆమెను వెనక నుండి కౌగిలించుకొని చెవులపై ముద్దులు పెడుతూ అమ్మ అమ్మ అని చిన్నగా ప్రేమగా పిలువగా వెంటనే వెనక్కు తిరిగి మళ్ళీ ఆనంద భాస్ఫాలు జలపాతం లా కారుస్తూ తన షర్ట్ నంతా తడిపెయ్యగా ఆమె తలను రెండు చేతులతో పైకి ఎత్తి రెండు బొటను వేళ్ళతో కారుతున్న నీటిని తుడుస్తూ త్వరగా నీకిష్టమైనవి వేసుకొని మని ఆమె భుజాలను పట్టుకొని వెనక్కు తిప్పి ముందుకు తోసి ఒక టవల్ అందుకొని బాత్రూం లోకి వెళతాడు .

5 నిమిషాలలో బయటకు వచ్చి తన తల్లిని చూడగా పెదవులపై చిన్నగా నవ్వగా చెవులకు ,ముక్కుకు మరియు గాజులు మాత్రమే వేసుకొని ఇప్పటికి ఇవి చాలు అని మొత్తం మూసివేసి పక్కనే ఉన్న కప్ బోర్డ్ లో పెట్టేస్తారు.8:30 అవుతుండగా జానకి పాల ప్యాకెట్స్ అందుకొని తన కొడుకు పక్కకు వెళ్లగా ఇద్దరు చేతులు పట్టుకొని వంట గదిలోకి వెళ్లి పాలు పొంగిస్తారు.

2 Comments

  1. 👌👌👌👌

  2. Story is so fine. Please update and post till the end

Comments are closed.