జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 5 55

మధ్యలో రెండంస్థుల బిల్డింగ్ చుట్టూ పెద్ద పెద్ద చెట్లు బిల్డింగ్ ముందు ఒక పక్క అంతా శుభ్రన్గా గడ్డి మరియు పూల మొక్కలు మరొక వైపు స్విమ్మింగ్ పూల్ , కాంపౌండ్ బయట కొద్ది దూరంలో సముద్రం ను బయట నుండే చూడగానే ఇద్దరు సంతోషంగా నచ్చింది అని చెబుతారు.

బ్రోకర్ ఎవరికో ఫోన్ చెయ్యగా 15 నిమిషాల తరువాత ఒక వ్యక్తి బైకు మీద వచ్చి ఇంటి తాళాలు ఇచ్చి వెళ్ళిపోగా బ్రోకర్ బయట గేట్ తెరువగా ముగ్గురు లోపలికి వెళ్ళి కాంపౌండ్ లోపల మొత్తం చూసి బ్యూటిఫుల్ అని అంటుండగా ఇంటి తాళాలు తెరువగా బెడ్ రూమ్స్ , వంట రూమ్ మరియు బాత్రూమ్స్ ఎక్కడివక్కడే ఉండటం తో పాటు జిమ్ కూడా ఉండటంతో లోపల కూడా బాగా నచ్చడంతో కృష్ణను అడుగగా సూపర్ అని చెప్పగా రెండు నెలల అడ్వాన్స్ అతడు అడిగిన దానికంటే ఎక్కువే ఇవ్వగా ,ఈ ఇంటి ఓనర్స్ ఎంతో ఇష్టపడి కట్టించుకున్నారు కానీ మీరే మొదటగా ఉండబోతోంది అని ఆనందంగా చెబుతూ తాళాలు ఇచ్చి వెళ్ళిపోతాడు.

సమయం 7 గంటలు అవుతుండగా అరే మామా మధ్యాహ్నం లోపల ఇంటికి కావాల్సిన మొత్తం సామానులు కొని సర్దెయ్యాలి రా అని చెప్పగా అయితే పదా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చెయ్యకూడదు అని ఇంటికి తాళాలు వేసి సిటీ లోకి వచ్చి breakfast చేసి, ముందుగా ఒక ఇల్లు కట్టే మెస్త్రిని కలిసి ఏమేమి చెయ్యాలో చెప్పి ఎంతమంది పనివాళ్లనైన పెట్టుకొని సాయంత్ర లోపు ముగించాలని అడ్రస్ చెప్పి తాళాలు ఇవ్వగా కొంతమందిని పిలిచి ఆ అడ్రస్ కు వెళ్లి ఇంటి బయట మరియు లోపల శుభ్రం చెయ్యమనగా పెద్దఆటో లో వారి వారి పనిముట్లు తీసుకొని వెళతారు.

అతడిని వెంట పెట్టుకొని ఏమేమి కావాలో ఇప్పించి మీరు ఒక నలుగురిని మా దగ్గర ఉంచి మీరు అక్కడికి వెళ్లి పని చేయించండి అని అవసరమైతే ఈ డబ్బును వాడండి అని కొంత డబ్బును ఇవ్వగా అతనీతో సహా మిగిలిన వారు వెళ్ళిపోతారు.

2 Comments

  1. Story is so fine. Please update and post till the end

Comments are closed.