జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 5 55

నాకు ఊహ తెలిసినప్పటినుంది అమ్మ నాన్నలు వాదులాడుకోవటం ఎప్పుడు చూడలేదు. కానీ నాన్న ఎందుకు ఇలా చేశారో అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ తన సీట్ లో వెళ్లి కూర్చున్న కొద్దిసేపటికి హైద్రాబాద్ చేరుకోగా ఎయిర్ ఇండియా ఆఫీస్ లో enquiry చెయ్యగా మరో అర్ధ గంటలో వైజాగ్ వెళ్ళడానికి ఫ్లైట్ రెడి అని చెప్పగా కొద్దిసేపు వెయిటింగ్ రూమ్ లో కూర్చొంటు పదే పదే అదే ఆలోచిస్తాడు.

అంతలోపు ఇంటికి కాల్ చెయ్యగా తన చిన్నత్త ఫోన్ ఎత్తగా అమ్మకు ఎలా ఉంది అని ఎవరు ఫోన్ ఎత్తారో కూడా అడగకుండా తన తల్లి గురించి అడిగే సరికి మహేష్ వాయిస్ పసిగట్టి అంటీ అంటీ మీకే ఫోన్ అని కోపంగా మాట్లాడుతూ ఇవ్వగా, అంటీ నేను మహేష్ మాట్లాడుతున్నాను అమ్మకు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగగా , కృష్ణ ఇప్పుడే ఫోన్ చేసి నువ్వు భయలుదేరావని చెప్పాడు, అమ్మకు ఇప్పుడు బాగానే ఉంది.

మందులు వేసుకుని పడుకొని ఉంది , లేవగానే కాల్ చేయిస్తాను అని చెప్పగా సరే అంటీ అని చెబుతూ, డాక్టర్లు ఏమి చెప్పారు అని అడుగుతుండగా ఫ్లైట్ రెడి గా ఉంది అని స్పీకర్లో చెబుతుండగా వెళ్లి ఫ్లైట్ లో కూర్చుంటాడు.

ఆమె చెప్పే లోపల కాల్ కట్ అవ్వడంతో డాక్టర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోగా , లేడీ డాక్టర్ మహేష్ తల్లిని పరిశీలిస్తుండగా స్పృహలో లేకున్నా కూడా మహేష్ మహేష్ అని చిన్నగా కలవరిస్తుండగా తలకు తగిలిన చిన్న దెబ్బను శుభ్రన్గా తుడిచి మందు రాసి కట్టు కట్టగా , నీరసంగా ఉన్నందువల్ల ఒక ఇంజుక్షన్ వేసి గ్లూకోస్ ఎక్కిస్తుంది.

2 Comments

  1. Story is so fine. Please update and post till the end

Comments are closed.