జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 5 55

పంతులును లోపల వరకు వదిలి కొత్త ఇంట్లోకి చేరుకుంటున్నాము మంచి ముహూర్తం అని అడుగగా ఇప్పుడు 7-9 గంటల మధ్య దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పగా 2000 పంతులుకి ఇవ్వగా గుడి లోపలికి వెళ్ళి దేవుడి నీళ్లు తెచ్చి ఇచ్చి ఇంటి లోపల గోడలపై చిలకరించు అని ఆశీర్వదించి పంపుతాడు. సంతోషంగా నవ్వుకుంటూ బయటకు వస్తాడు. చివరగా దారిలో ఉన్న హోటల్ కు వెళ్లి రెండు వెజ్ మీల్స్ మరియు లీటర్ పాలు తీసుకొని కొత్త ఇంటి వైపు భయలుదేరుతారు.

సిటీ దాటి బయటకు రాగా కన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాము అని అడుగగా నవ్వే సమాధానంగా ఒక 5 నిమిషాలు నెమ్మదిగా ప్రయాణించగా అప్పటి వరకు లేని వీధి దీపాలు వెలుగుతున్న మట్టి రోడ్ రాగా ఆ దారిలో వెళ్లి చుట్టూ అక్కడక్కడ చుట్టూ ఇళ్ల దీపాలు వెలుగుతూ ఉండగా చిమ్మ చీకటిగా ఉండే కాంపౌండ్ ముందు ఆపి కారు హెడ్ లైట్స్ ఆపి వేసి మహేష్ కారు దిగి ఒక్క నిమిషం అమ్మ అని మొబైల్ లో టార్చ్ వేసుకొని గేట్ తాళాలు మరియు లోపలికి వెళ్ళి ఇంటి తాళాలు తీసి తలుపులు పూర్తిగా తెరిచి కారు దగ్గరకు వచ్చి ఎక్కి లోపలికి వెళ్ళి గేట్ లోపల పార్క్ చేసి గేట్ కు తాళం వేసి కారు డోర్ దగ్గరకు రాగా జానకికి అంతా చీకటిగా వుండి ఏమి కనిపించక పోవడంతో అయోమయంలో ఉండగా, 7 గంటలు అవ్వగా దిగమన్నట్లు డోర్ తెరుస్తూ తన తల్లి కారులో నుండి దిగుతుండగా రిమోట్ చేతిలోకి తీసుకొని మొదట లైట్స్ బటన్ నొక్కగా ఒక్కసారిగా సీరియల్ లైట్స్ వెలుగి వెంట వెంటనే అన్ని లైట్స్ వెలుగగా కింద చిన్న చిన్న లైట్స్ welcome అని వెలుగుతూ ఉండగా కింద బటన్ నొక్కగా సుయ్ సుయ్ మంటూ పైకి వెళ్తూ ఫైర్ క్రాకెర్స్ పేలుతుండగా అదంతా క్షణిక పాటులో జరుగగా జానకి అవాక్కయ్యి ఆశ్చర్యంతో చూస్తూ షాక్ కొట్టినట్టు నిలబడిపోతుంది.

అమ్మ అని ఆమె భుజంపై చెయ్యి వేసి దగ్గరకు వెళ్లగా ఈ లోకంలోకి వచ్చిన జానకి తన కొడుకుని ఆశ్చర్యంతో చూడగా ఇది నీ కోసమే అమ్మ ఈ సాయంత్రం నుండి మనం నివశించబోయే గృహం అని చెప్పగా తన కొడుకు తన సంతోషం కోసం పడుతున్న తాపాత్రయానికి పులకించి పోతూ అత్యంత సంతోషంతో ఆనంద భాస్ఫాలు కారుస్తూ ఏమి మాట్లాడాలో తెలియక తన కొడుకుని గట్టిగా హతుక్కుపోతుంది.

2 Comments

  1. Story is so fine. Please update and post till the end

Comments are closed.