జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 5 55

కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టగా రెండు చేతులను తన తల్లి చుట్టూ వేసి ఇంకా గట్టిగా తన లోకి హత్తుకుంటూ రెండు చేతులతో ఆమె వీపుపై సున్నితంగా రాస్తూ ఆమె బాధ అంతా కన్నీళ్ల ద్వారా బయటకు వెల్లేంతవరకు ఏడవనివ్వగా నా వెచ్చటి కౌగిలిలో కొన్ని నిమిషాల తరువాత ఏడ్చి ఏడ్చి నెమ్మదించగా, తన తల్లి రెండు భుజాలపై రెండు చేతులను వేసి కొద్దిగా వెనక్కు జరిపి రెండు చేతులను ఆమె రెండు చెంపలపై వేసి బొటను వేలితో కారిన కన్నీళ్లను తుడుస్తూ చెంపలపై వేసిన చేతులతో ఆమె తలను కొద్దిగా పైకి ఎత్తి తన తల్లి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఇవే నీ చివరి కన్నీళ్లు జరిగినదంతా మరిచిపో నువ్వు భాధపడితే నా హృదయం తట్టుకోలేదు.

ఇప్పటి నుండి నాకు నువ్వు నీకు నేను , నిన్ను నా దేవతలా చూసుకుంటాను అని భావోద్వేగంతో చెబుతూ ముందుకు వొంగి తన తల్లి నుదుటిపై ప్రేమగా ముద్దులు పెడతాడు. చెంపలపై కన్నీళ్లు కారడం వలన తన తల్లి ముఖం అంతా తడిగా ఉండటం వలన ఆమె వెనుక చెయ్యి ఉంచి బెడ్ పైనుండి లేచి రెండు దిండ్లను ఆమె వెనుక ఉంచి ఆమెను వెనుకకు వాల్చి కూర్చోబెట్టి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి అమ్మ ఒక్క నిమిషంలో వచ్చేస్తాను అని చెప్పి నా రూమ్ లోకి వెళ్లి కప్ బోర్డ్ లోని డ్రై గా ఉన్న చిన్న టవల్ అందుకొని బాత్రూం లోకి వెళ్లి గీజర్ on చేసి వేడి నీళ్లతో నాన నిచ్చి గీజెర్ ఆఫ్ చేసి తన తల్లి బెడ్ రూమ్ కు తిరిగి వచ్చి ఆమె పక్కన బెడ్ పై కూర్చొంటూ టవల్ ను వదులుగా చేతిలో పరిచి సున్నితంగా ఆమె కన్నీరును తుడిచి మొత్తం ముఖం తుడుస్తాడు.

దానితో ఆమె మనస్సు సంతోషంతో ఉప్పొంగుతూ రెండు చేతులతో అతడి ముఖాన్ని అందుకొని తన కొడుకు నుదిటిపై ప్రేమగా ఉత్సాహంగా కొన్ని క్షణాలపాటు ముద్దుపెడుతుంది. అలా ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు సంతోషంగా హత్తుకోగా ఉండగా కృష్ణ తల్లి వసుంధర తలుపులన్ని తీసి ఉండటంతో సరాసరి బెడ్ రూమ్ లోకి రాగా తల్లికోదుకులు ఇద్దరు ఆనందంగా కౌగిలించుకొని ఉండటం చూసి సంతోషిస్తూ చప్పుడు చెయ్యకుండా హాల్ లోకి వెళ్లి సోఫా లో కూర్చుంటుంది.

కొంత సమయం తరువాత మహేష్ తన తల్లి నుదుటిపై ముద్దు పెట్టి అమ్మ నువ్వు మందులు వేసుకోవాలి కదా బయటకు వెళ్లి భోజనం తీసుకు వస్తాను అని పైకి లేచి అంటుండగా మహేష్ మాటలు విన్న వసుంధర రూమ్ లోకి వస్తూ మీ నేను ఉండగా బయటి భోజనమా అని లోపలికి రాగా అంటీ క్షమించండి అని చెప్పగా ,అది అలా దారిలోకి రా మహేష్ అని జానకిని నెమ్మదిగా నేలపై నిలబెట్టి ఫ్రెష్ అవ్వడానికి నెమ్మదిగా నడిపించుకుంటు బాత్రూం కి తీసుకొని వెళ్తుంది.

2 Comments

  1. Story is so fine. Please update and post till the end

Comments are closed.