జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 4 60

అది విన్న ఇందుకు కాళ్ళు చేతులు ఆడక మహేష్ కు విషయం ఎలా తెలపాలో తెలియక , ముందుగా గోవా airport కు కాల్ చేసి వెంటనే గోవా to వైజాగ్ కు ఏది అందుబాటులో ఉంది అని కనుక్కోగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ మరో రెండు గంటలలో హైద్రాబాద్ భయలుదేరుతుంది అని చెప్పగా వెంటనే కంప్యూటర్ on చేసి రెండు టికెట్స్ బుక్ చెయ్యడానికి చూడగా ఒకే ఒక టికెట్ available లో ఉండగా మహేష్ అనే పేరు మీద గోవా to హైద్రాబాద్ మరియు హైదరాబాద్ to వైజాగ్ టికెట్ లు బుక్ చేసి , సోఫా దగ్గరికి వెళ్లి వెంటనే లేపి చెప్పకుండా సోఫా లో అతడి తల పక్కన కూర్చొని అతడి తల ఎత్తి ఆమె తొడలపై పెట్టుకొని తల నిమురుతూ బేబీ బయటకు వెళదాము త్వరగా రెడి అవ్వు అని చెప్పగా మత్తు కళ్ళతో లేచి బాత్రూం కు వెళ్లి ఫ్రెష్ అవ్వగా అంతలోపాల ఇందు కూడా ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని ఉన్న ఒకే ఒక జతను మడతలు లేకుండా చేస్తుండగా బయటకు వచ్చిన మహేష్ బట్టలు వేసుకోగా ఆమె బయటకు వెళ్ళడానికి చూపిస్తున్న ఆత్రానికి ఆశ్చర్య పడగా వెంటనే తాళం వేసి హోటల్ వైపు చాలా వేగంగా వెళుతుంది.

ఒక 10 నిమిషాలలో హోటల్ చేరుకొని బేబీ నువ్వెళ్ళి బట్టలు త్వరగా మార్చుకొని హోటల్ ఖాళీ చేసి మొత్తం తీసుకు వచ్చేయి నేను బిల్ పే చేస్తాను అని చెప్పి వడివడిగా కౌంటర్ వైపు వెళుతుంది.

5 నిమిషాలలో కారు దగ్గరికి చేరుకోగా , dabolim ఎయిర్పోర్ట్ కు ఎంత వీలైతే అంత వేగంగా వెళుతుండగా అమ్మ ఎందుకు అంత వేగం అని అడుగగా బేబీ ఒక విషయం చెబుతాను టెన్షన్ పడకు అని చెబుతుండగా మహేష్ ఏమి జరిగిందో ఏమో అని తన తల్లి వైపే తీక్షనంగా చూస్తుండగా కారును పక్కకు ఆపి అమ్మకు ఉదయం తలకు చిన్న దెబ్బ తగిలిందంట ఇప్పుడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వచ్చారంట అని మీ ఫ్రెండ్ అనుకుంటా కృష్ణ ఇంతకు మునుపు కాల్ చేసాడు అని చెప్పగా , మహేష్ ఏడుపు ముఖం పెడుతూ శరీరం ఒక్కసారిగా చెల్లబడి చెమటలు పట్టి కళ్ళల్లో కన్నీరు కారుస్తూ షర్ట్ మొత్తం తడిచిపోగా ఫోన్ కోసం జేబులు వెతుకుతుండగా ఆమె హాండ్ బ్యాగ్ లోనుండి అతడి ఫోన్ తీసి ఇవ్వగా ఇంటికి కాల్ చెయ్యగా ఎవ్వరు కాల్ ఎత్తకపోవడంతో మరింత టెన్షన్ పడుతుండగా అతడి ముఖం పై చెమటను చేతితో తుడుస్తూ అమ్మకు ఏమి జరగదు అని ధైర్యం చెబుతూ వేగంగా కారును పోనిస్తుంది.

1 Comment

Comments are closed.