రొమాంటిక్ చర్చ్నింగ్ 33 69

మా ఎదురుగా ఒక సింహాసనం ప్రత్యక్షమై,అందులో ఠీవిగా కూర్చొని ఆసీనులు కండి అంటూ ఆజ్ఞాపించింది.. మా ఇద్దరి వెనకాల సింహాసనాలు ప్రత్యక్షమైనందువల్ల అందులో కూర్చున్నాము..

ఎందులకి ఇటు వైపు వచ్చారు తమరు?అంటూ అనునయంగా ప్రశ్నించింది…

నిజం చెప్పాలో అబద్దం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్న నాకు షాక్ కలిగిస్తూ,”వరూధినీ మాతా మేము మీ దగ్గరున్న మహాదీపం కోసం వచ్చాము అంటూ కంఠంలో ఏ అభద్రత లేకుండా ఠీవిగా అంది జానకీ”…

ఆహా,మానవ మాత్రులైన మీకు ఆ “మహాదీపం” తో పని ఎందులకు?సవివరంగా చెప్పండి లేకుంటే ఇక్కడే బూడిద అవుతారు అంటూ గర్జించింది ఉరుముతూ..

జానకీ నా వైపు చూసి చెప్పమన్నట్లు సైగ చేసేసరికి,ధైర్యంగా ముందు జరిగినది అంతా చెప్పాను సవివరంగా..

నేను చెప్పిన ప్రతి విషయం శ్రద్ధగా విని,ఓహో అదా విషయం??ఆ గుహ రాక్షసుడు ఇందులకే ప్రయత్నం చేస్తున్నాడా??ఆ మాయావి సకల లోకాల్ని గడగడ లాడించిన వీరుడు,ఇప్పుడు ఇక్కడ తచ్చాడుతున్నాడు అని తెలిసి అర్థం కాలేదు అతడి ప్రవర్తన, ఇప్పుడు వివరంగా చెప్పావు మధనా,అటులైన నీ ప్రయత్నం సబబుగానే అనిపిస్తోంది…కానీ ఈ “మహాదీపం” నా దగ్గర రక్షణతోనే ఉన్నప్పుడు మీరు కాపాడవలసిన అవసరం ఏంటి అంటూ ప్రశ్నించింది…

నిజమే వరూధిని రాణీ,ఒక్కసారి ఆ మాయావులు వాళ్ళ శక్తులని పునరుద్ధరణ చేసుకుంటే ఈ విశ్వంలో ఏ శక్తీ వాళ్ళని ఆపలేదు,అందుకే నా ఈ ప్రయత్నం అన్నాను వినయంగా..

నీ మాట సబబుగా ఉంది మధనా,కానీ ఇంతటి శక్తి గల నా దగ్గరే వాళ్ళు తస్కరించినప్పుడు ఒక సామాన్య మానవుడి వైన నీ దగ్గర తస్కరించలేరన్న నమ్మకం ఎలా కలుగుతుంది నాకు??

అవి నాకు తెలియదు రాణీ,కానీ నాకు ఎప్పటికప్పుడు అందుతున్న సమాచారం ని బట్టి ఈ విశ్వ కల్యాణం అన్నది నా చేతుల్లోనే ఉంది అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది అన్నాను వినయంగా.

హ హ్హా అటులనా??భలే తమాషా మాటలు చెప్పావు మధనా,ఏదీ నువ్వు ఈ విశ్వ కల్యాణం ని చేసే వ్యక్తివా???అంటూ హేళనగా నవ్వుతూ ఏదీ నీ కుడి చేతిని నా వైపు చాపు అంటూ నా ముందు ప్రత్యక్షం అయ్యింది..

నా చేయిని చాపాక, తీక్షణంగా నా చేతిని ఒక ఐదు నిమిషాలు గమనించి ఆఖర్లో తన చేతితో నా చేతిని కలిపి కళ్ళు మూసుకుంది ఒక్క నిమిషం పాటూ…

కళ్ళు తెరిచి ప్రశాంత వదనంతో నన్ను చూస్తూ,మధనా,మీరు చెప్పినది అక్షరాలా నిజం,ఈ విశ్వ కల్యాణం నీ చేతుల్లోనే ముడిపడి ఉంది..నీవు చేస్తున్న ప్రయత్నం మహా యజ్ఞము..ఇన్నాళ్లూ ఇది ఏమీ తెలియని నేను ఆ దేవరాజు ఇంద్రుడని ముప్పతిప్పలు పెట్టాను.ఇప్పుడు అవగతం అయ్యింది మధనా,కానీ నేను ఆ దేవేంద్రుడు కి ఈ మహాదీపం ఇచ్చిననూ ఒక తప్పిదమే అవుతుంది,ఎందుకనగా ఆ గుహుడు సునాయాసంగా ఆ దేవేంద్రుడు ని మట్టి కరిపించి హస్తగతం చేసుకుంటాడు,ఎటు చూసినా ఈ మహాదీపం నీ దగ్గర ఉండటం ఉత్తమం అంటూ నిట్టూర్చింది.

ఆమె చేతి స్పర్శ నాలో నవ నాడులని పులకింతకి గురి చేసింది,ఆ మధురాతి మధురమైన స్పర్శ నాకు శరీరంలో ఏదో కొత్త శక్తిని పుట్టించిన భావన కలిగింది..ఉన్న ఫలాన నాలో ఏదో దివ్యమైన శక్తి ప్రవేశించిన భావన స్పష్టంగా తెలుస్తోంది…
.
ఆమె మాటలకి ముగ్దుడనై మహాప్రసాదం రాణీ అంటూ చేతులెత్తి నమస్కరించాను…

మనోహరంగా నవ్వుతూ నా చేతులని దింపి,కాస్తా గట్టిగా “ఆ నలుగురు వ్యక్తుల్ని లోపలికి పంపండి ద్వారపాలకులారా” అంటూ ఆదేశించింది…

కాసేపటికి నాని,సువర్ణ,రాధిక,సింధూ లోపలికి వచ్చి వినయంగా నమస్కరించారు వరూధిని కి..

సంతోషంగా నవ్వుతూ,అయితే ఈ మహత్తర యజ్ఞం లో మధనుడికి సహాయపడే కన్యలు చాలా మందే ఉన్నారు అంటూ నన్ను చిలిపిగా చూసింది.

ఆమె మాటలకి అందరిలోనూ నవ్వులు విరబూసాయి కాసేపు..

కాసేపటి తర్వాత ఆమె ఠీవిగా పైకి లేచి,శూన్యం లోకి చూస్తూ,మధనా నా ఈ మహా శక్తులు అన్నియూ నీకు ధారాదత్తం చేసాను ఈరోజు,ఇన్నాళ్లూ ఏరోజూ నా ఈ శక్తులతో ఏ వినాశనమూ చేయలేదు,నువ్వు కూడా ఈ శక్తులని మంచి కోసం వినియోగిస్తావు అన్న నమ్మకం నాకు కలుగుతోంది…ఇన్నాళ్లూ నేను బాధలు లేని కొత్త లోకాన్ని సృష్టించాలని తపించిపోయాను,ఈరోజుటితో నా ప్రయత్నం సఫలం అయ్యింది,ఈ విశ్వ కల్యాణం తర్వాత ఈ సృష్టి మొత్తం సుఖసంతోషాలతో విరజిల్లుతుంది అన్న భావన నన్ను అమితానందానికి గురి చేస్తోంది,విజయుడవై నువ్వు చరిత్రలో నిలుస్తావు అంటూ నన్ను ఆశీర్వదించింది..

నాకు అప్పుడు అర్థం అయ్యింది నాలో ప్రవేశించిన కొత్త శక్తి వరూధిని దే అని,అత్యంత సంతోషంతో ఆమె పాదాలకి నమస్కరించాను..నన్ను ఆప్యాయంగా పైకి లేపి, మధనా,ఇప్పుడు అవగతం అయ్యింది గా నీలో కలిగిన కొత్త శక్తి ఏంటో అని అంటూ నవ్వుతూ నన్ను చూసింది.

అవును మహారాణీ అందులకు మీకు శతకోటి ధన్యవాదాలు అన్నాను సవినయంగా..