ఆప్యాయంగా వాళ్ళని లేపి,మీరు నాకు దొరికిన వజ్రాల్లాంటి వాళ్ళు,మీతోనే ఈ జీవితం అంకితం అంటూ వాళ్ళని ఓదార్చి ,పండితా పిలిచినందుకు గల కారణం సెలవివ్వండి అన్నాను.
ఏమీలేదు మధనా అంటూ,తన జేబులో నుంచి ఒక హారం ని తీసి మా ముందే మంత్రించి,ఇదిగో ఈ హారం ని ఆ మహాజాతకురాలైన జానకీ మెడలో వేయి అంటూ ఆజ్ఞాపించి,తర్వాత చేయవలసిన ఘట్టం ని నానీ తెలియజేస్తారు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు…
నేను సివంగి,సువర్ణ లని నాతో పాటూ వచ్చేయండి అని ఇంటికి బయలుదేరాను, ఇంట్లోకి ఎంటర్ అయ్యి జానకీ ని సమీపించి జానకీ మెడలో ఆ హారాన్ని వేసి అందరి వైపు తృప్తిగా చూసాను…
పంకజం,అర్చన,జానకీ,సివంగి,సువర్ణ వీళ్ళందరినీ చూస్తుంటే మనసుకి చాలా సంతోషం వేసింది..తృప్తిగా వాళ్ళని చూస్తూ ఉండగా,అమ్మ పక్కన కూర్చొని ఒక్క పవిత్ర ని తీసుకొస్తే నీ కార్యం సగం సంపూర్తి అవుతుంది బిడ్డా అంటూ ప్రేమగా నా నుదుట ముద్దుపెట్టింది..
ఆ పని ఎంతసేపు చేస్తాడులే అత్తా సంజయ్ గాడు,వాడున్నదే విశ్వకల్యాణం కోసం అంటూ అర్చన వదిన మా అమ్మకి ధైర్యం చెప్పింది…
మీ అభిమానులు తర్వాత చూపిద్దురులే గానీ మాకు పని ఉంది బయటికి వెళ్ళాలి అంటూ నాని గాడు అనేసరికి,సువర్ణ కల్పించుకొని జానకీ నువ్వు కూడా సంజయ్ తో పాటూ వెళ్ళు అని ఆజ్ఞాపించింది.
అలాగే అండీ అంటూ జానకి మాతో పాటు వచ్చింది,ఇంట్లో నుంచి బయటపడిన వెంటనే,నానీ గాడు ఒరేయ్ నీ ఖడ్గం ఉందా నీతో పాటూ అని అడిగాడు..
లేదు రా ఇంట్లోనే ఉంది అన్నాను..
సరే బయటికొచ్చాక మళ్లీ వెనుదిరగడం మంచిది కాదు అంటూ పంకజం గారూ అంటూ కేకేసాడు ఇంటి బయట నుండి…
ఒక్క ఐదు క్షణాల తర్వాత సివంగి బయటికొచ్చి,ఏంటి నాని అంటూ అడిగింది…
సంజయ్ ఖడ్గం ని తెచ్చివ్వు వీరనారీ అని అనగా,సివంగి నవ్వుతూ లోనకెళ్లి ఆ ఖడ్గం తీసుకొచ్చి తన రక్తంతో బొట్టు పెట్టి,విజయులై తిరిగి రండి అంటూ ఆశీర్వదించింది నాలో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ…
బయలుదేరిన మేము మెల్లగా ఊరి పొలిమేర దాటినా వెంటనే ,బావా అంటూ సింధూ వచ్చి కౌగిలించుకొని, ఎలా ఉన్నావ్ రా అంటూ కుశల ప్రశ్నలు వేసింది…
బానే ఉన్నానే, నువ్వెలా ఉన్నావ్?అస్సలు కనిపించకుండా పోయావ్ ఏమైంది అన్నాను…
చెప్పాను గా రా కొన్ని రోజులు నీకు కనిపించను అని,ఇదిగో ఇప్పుడు పరిస్థితులు అన్నీ కుదుటబడ్డాయి గా అందుకే ఈ ఎంట్రీ అంటూ నవ్వుతూ నా బుగ్గ పైన ముద్దు పెట్టింది..
పక్కనే ఉన్న జానకీ కి ఆశ్చర్యంగా అనిపించి నవ్వుతూ తల అటువైపు తిప్పుకుంది,అది గమనించిన సింధూ ,ఒసేయ్ చెల్లీ ఎలా ఉన్నావే అంటూ జానకీ ని ప్రేమగా తల నిమిరింది.
జానకీ కి ఆశ్చర్యం అవధులు దాటింది సింధూ మాటకి,ఏమీ అర్థం కానట్లు పిచ్చి చూపులు చూడటం మొదలెట్టింది..
తన పరిస్థితి అర్థం చేసుకున్న నానీ గాడు కల్పించుకొని, జానకీ నువ్వు ఆశ్చర్యపోకు,మా సింధూ అంతేలే ఈజీగా వరసలు కలిపేస్తుంది అంటూ తేలికపరిచాడు.
జానకీ నవ్వుతూ,నేను బాగున్నాను అక్కా నువ్వెలా ఉన్నావ్ అంటూ ఈజీగానే కలిసిపోయింది…
నడుస్తూ ఊరి బయట గల పాత సాధ్వి ల కోట బయట కూర్చున్నాము అందరమూ.
నాకు మాత్రం ఆశ్చర్యం ఎక్కువై,ఒరేయ్ నానీ ఎక్కడికి రా మన పయనం అన్నాను..
“వరూధిని” ఆవాహణ కోసం రా అంటూ సింపుల్ గా చెప్పాడు.
“వరూధినా” ?ఎవరు రా తను??
ఈ సృష్టికి ప్రతిసృష్టి చేయాలని నిరంతరం శ్రమిస్తున్న మహా మంత్రగత్తె రా ఆమె…
అవునా??ఆమె తో ఏంటి మనకు పని??ఆమెని ఆవాహణం చేసుకోవాల్సిన అవసరం ఏంటి మనకు???
ఖచ్చితంగా అవసరం రా సంజయ్,ఆమె ని ఆవాహణం లేదా ప్రసన్నం చేసుకోకపోతే ఈ విశ్వశాంతి అన్నది కలే అయిపోతుంది కనుక తప్పదు అన్నాడు.
అర్థం కాలేదు రా నానీ అన్నాను ఆశ్చర్యంతో ..