రొమాంటిక్ చర్చ్నింగ్ 33 69

నేను వెంటనే పక్కనే నా బట్టలు వేసుకొని సింధూ ఇచ్చిన బంగారు ఖడ్గం సహాయంతో ఒక్క ఉదుటున వాళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యాను…

నన్ను చూసిన మరుక్షణం జ్యోతిరాదిత్యుడు తన నిజ రూపుని సంతరించుకుని,గుహా అంటూ ఆ రాక్షసున్నీ పిలిచాడు…వెంటనే అక్కడున్న అందరూ భీతిళ్లేలా ప్రత్యక్షం అయ్యాడు ఆ అరివీర భయంకర గుహుడు…

ఒరేయ్ భలే దొరికారురా కుర్రాకుంకల్లారా అంటూ మా ఇద్దరి పైకి ఉరికారు ఆవేశంగా…..

“రాజసింహా” సమయం ఆసన్నమైంది విజృంభించు అంటూ చంటీ గాడిని అదిలించాను,అన్న మరుక్షణమే చంటీ లా ఉన్న రాజసింహుడు ఒక్కసారిగా ఇద్దరికి అడ్డు పడి ఒక్క వేటుతో ఇద్దరినీ గాల్లో ఎగిరేలా తన్నాడు…..

అల్లంత దూరాన ఎగిరిపడిన ఇద్దరూ,ఆశ్చర్యం గా రాజసింహుడిని చూస్తూ,ఒరేయ్ మాయావి నువ్వూ ఇంకా ఉన్నావా???ఈ సంజయ్ గాడు ఈ మూడేళ్లు నిశ్శబ్దంగా ఉన్నాడని అనుకుంటే ఇంత పని చేసాడా అంటూ మళ్లీ రాజసింహుడు పైకి ఉరికారు…

మళ్లీ అదే సీన్ పునరావృతం అయ్యింది ఇద్దరూ నేలకొరిగి విలవిలలాడుతూ,ఇద్దరి గొంతుల పైన ఒక్కో కాలు వేసి,హ హ్హా ఈ మూడేళ్లు సంజయ్ మధనుడు చాలా చేసాడు రా మీ ఆటలు కట్టించడానికి,ఈరోజు మీ భరతం పట్టి ఈ విశ్వశాంతికి అంకురార్పణ చేస్తాను అంటూ తన వీర ఖడ్గం తీసి వేటు వేయడానికి సిద్ధం అయ్యిన మరుక్షణమే ఇద్దరు మాయావులు అదృశ్యం అయిపోయారు భయపడి….

మధనా, భేష్ నీ అప్రమత్తత కి,రెప్పపాటులో అప్రమత్తం అయ్యి పెద్ద వినాశనం ని ఆపావు అంటూ నన్ను కౌగిలించుకోగా,నేను బాధతో రాజసింహా ఈరోజుతో నీ ఆయుష్షు తీరిపోతుంది ఇక నా పయనం ఎటు అంటూ బాధపడ్డాను..

బాధ వలదు మధనా,నా ఆయుష్షు అయిపోయేలోపు ఈ మాయావులని చూస్తాను అని అనుకోలేదు,కనీసం వాళ్ళ వెన్నులో భయం పుట్టించి సంతోషంగా వెళ్తున్నాను,ఇక ఈ బాధ్యత మొత్తం నీదే అంటూ” నాయకి” అని పిలిచాడు….నాయకి రూపంలో ఉన్న “ఉమామహేశ్వరి” మా ముందర ప్రత్యక్షం అయ్యి,మధనా మీ మేలు మరువలేనిది,మా జన్మ కి సంతోషం కలిగించడానికి నువ్వు చేసిన సహాయం మేమెప్పుడూ మరువము, ఇదిగో నా సర్వశక్తులు నిగూఢమైన ఈ ఖడ్గం ని నీకు బహుకరిస్తున్నాను విజయవంతంగా ఈ కార్యాన్ని పూర్తి చేయి అంటూ ఖడ్గం ని నాకు బహూకరించింది….

రాజసింహుడు నా దగ్గరికి వచ్చి,మిత్రమా మేము ఇప్పుడు అత్యంత సంతోషంగా మా తనువుని చాలిస్తున్నాము నువ్వెటువంటి బాధా పెట్టుకోకుండా ఈ కార్యాన్ని పూర్తి చేయి,నా తరపున నీకు బహుమానం గా నా వీర ఖడ్గం ఇదిగో అంటూ ఉమా ఖడ్గాన్ని తీసుకొని తన ఖడ్గంతో కలిపేసి ఒకే ఖడ్గంగా చేసి నాకు ఇచ్చాడు…..

మధనా ఈ జానకీ నీ కార్యంలో తురుపు ముక్క అని మరువకు, ఈమెని నీతో పాటు తీసుకెళ్లి జాగ్రత్తగా కాపాడు ఆ మాయావులు బారి నుండి,ఒక్కసారి ఈ పిల్ల వారికి దొరికితే వాళ్లదే విజయం,వాళ్ళ శక్తులు పునరావృతం అయితే చాలా కష్టం అంటూ హెచ్చరించాడు..

అలాగే సింహా,నా వంట్లో ప్రాణం ఉన్నంతవరకూ ఆ పనిని జరగనివ్వను అంటూ బాధతో అన్నాను.

బాధపడకు మిత్రమా అంటూ నా కన్నీళ్లు తుడుస్తూ,ఇంతకీ సువర్ణ,సివంగి ల విషయం మరిచిపోలేదు కదా అంటూ గుర్తు చేసి ఇద్దరూ గాల్లో కలిసిపోయారు సంతోషంగా….

నేను బాధాతప్త హృదయంతో జానకీ ని చూసి,జానకీ నాతో పాటూ వస్తావా అని అడగగా మా నాన్న ని కూడా తీసుకెళ్తారా అంటూ అమాయకంగా అడిగింది…

అలాగే జానకీ అంటూ సంతోషంగా బయలుదేరాము జానకీ,నేను..నడుస్తున్న నాకు నా కళ్ళ ముందర ఈ మూడేళ్లు జరిగిన దృశ్యాలు,ఎందుకు నేను సామాన్యుడిగా ఉండాల్సి వచ్చింది అన్న జ్ఞాపకాలు కదలాడుతుండగా….

అలాగే జానకీ అంటూ సంతోషంగా బయలుదేరాము జానకీ,నేను..నడుస్తున్న నాకు నా కళ్ళ ముందర ఈ మూడేళ్లు జరిగిన దృశ్యాలు,ఎందుకు నేను సామాన్యుడిగా ఉండాల్సి వచ్చింది అన్న జ్ఞాపకాలు కదలాడుతుండగా….

జానకీ ఇంటికి చేరుకొని జరిగిన విషయం అంతా చెప్పాను వాళ్ళ నాన్న గోపాల్ కి,గోపాల్ ఆశ్చర్యపోతూ బాబూ నువ్వు వెంకటరెడ్డి కొడుకువా అన్నాడు నాలో ఆశ్చర్యం ని కలిగిస్తూ..

అవును అండి, మీకెలా తెలుసు మా నాన్న గురించి?అన్నాను ఆశ్చర్యంతో…

నాకు మీ చరిత్ర అంతా తెలుసు బాబూ,మీ వంశ పెద్దలు మహానుభావులు,మీ నాన్నతో నాకు ముఖపరిచయం ఉంది, నువ్వు చేస్తున్న మధనం గురించి అంతా తెలిసిన వాడిని,కానీ ఆ మాయావులు ఈ రూపంలో దెబ్బ కొడతారని నేను అనుకోలేదు,,నా కూతురు జాతకం చిన్నప్పుడే పరిశీలించిన పిమ్మట నేను ఊరికి దూరంగా ఎక్కడో పట్నం లో పెట్టి చదివించాను,ఇన్నాళ్ళకి నేను అనుకున్న మీ సాంగత్యం లభించింది, నా కూతురుని పువ్వుల్లో పెట్టి మీకు అప్పగిస్తున్నాను సంతోషంగా,నా బిడ్డ జాగ్రత్త బాబూ అంటూ జానకీ ని నాకు అప్పగించాడు గోపాల్ ఆనంద బాష్పాలతో..

జానకీ జాతకం తెలిసిన నాకు గోపాల్ చెప్పిన విషయాలు అంత ఆశ్చర్యంగా అనిపించలేదు,మొత్తానికి జానకీ ని జాగ్రత్తగా కాపాడిన గోపాల్ తెలివికి మురిసిపోయి ధన్యవాదాలు మీరు చేసిన ఈ సహాయానికి అంటూ చేతులెత్తి నమస్కరించాను…
బాబూ గొప్పవాళ్ళు మీరు మాకు నమస్కరించకూడదు అని సున్నితంగా వారించి,మీ మామ ప్రసాద్ ఎక్కడ వున్నాడు అని అడిగాడు…

మామ గురించి అంతా చెప్పిన తర్వాత,సరే బాబూ నేనూ మీ మామతో జత అయ్యి నీ మధనం తాలూకు పనుల్లో సహాయపడతాను అన్నాడు నాలో ఆశ్చర్యం మళ్లీ కలిగిస్తూ..

మీరు ఇంతకీ ఎవరు అండి అని నేను సూటిగా ప్రశ్నించాను గోపాల్ మొహంలోకి తీక్షణంగా చూస్తూ.

అనుమానం ఏమీ పెట్టుకోకు బాబూ,ఒకప్పుడు మధనం కి వెళ్లిన వాళ్ళల్లో నేనూ ఒకడిని…నన్ను చంపాలని వాళ్ళు చేసిన ప్రయత్నం లో ప్రాణం పైన తీపితో మధనం ని పూర్తి చేయకుండా గమ్ముగా ఉండిపోయిన నిస్సహాయుడను అంటూ నా అనుమానం ని నివృత్తి చేసాడు..

చాలా సంతోషం గోపాల్ గారు ,మీ పరిచయం వల్ల జానకీ ని ఇంకా ఒక మధనుడు ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది .