రొమాంటిక్ చర్చ్నింగ్ 33 69

అంతా సిద్ధమే అంటూ సింధూ హుషారుగా చెప్పింది..

కాస్తా ఆశ్చర్యం లో ఉన్న నన్ను చూసి,ఏంటి సంజయ్ మా గురించి తెలియదు అని బెంగపెట్టుకున్నావా అంది రాధికా..

అదేమీలేదులే రాధీ అన్నాను నిర్లిప్తంగా…

సువర్ణ నా దగ్గరకొచ్చి,సంజయ్ ఇదంతా నీ కార్యం కోసం మేము దాయాల్సి వచ్చింది మనసులో ఏమీ పెట్టుకోకుండా బయల్దేరుదాం అంది.

అబ్బే అలాంటిదేమీ లేదులే సువర్ణ,మీ ఇరువురి గురించి తెలియదు కాబట్టి తక్కువ అంచనా వేసాను ఇక తెలుసుగా అని నవ్వుతూ పదండి అన్నాను వాళ్ళిద్దరికి జానకిని పరిచయం చేసి..

సింధూ ముందు వెళ్తూ కోటలోకి ప్రవేశించి నేను,ఉమా అంతకుముందు ప్రవేశించిన గదిలోకి తీసుకెళ్లి ,బావా నీ ఖడ్గం ఇక్కడే దొరికింది ఇలా ఒక్కసారి వచ్చి ఆ సర్కిల్ లో గాటు పెట్టు అంది.

కనిపిస్తున్న వృత్తాకార సర్కిల్ మధ్యలో గాటు పెట్టాను..ఆశ్చర్యంగా ఆ సర్కిల్ మధ్యలో ఒక పెద్ద మెట్ల దారి కనిపించింది లోపలికి….

అందరమూ ఆశ్చర్యంతో ఆ మెట్ల దారి గుండా ప్రయాణించి చివరి వరకూ చేరుకున్నాము,ఆ దారి అంతం అయ్యి ఒక దట్టమైన అడవి ప్రాంతంలోకి దారి చూపించి మూసుకుపోయింది…సింధూ ఆ దారి మొదలయ్యిన చోటులో ఒక పెద్ద బండరాయి ని పెట్టి పదండి అంటూ ముందుకు కదిలింది..

ఒక గంట కాలినడక తర్వాత ఒక సరస్సు కనిపించింది,ఆ సరసుకి అటు వైపున మా అందరి కళ్ళు బైర్లు కమ్మేలా ఒక మహా భవనం పట్టపగలు అద్భుత కాంతితో విరజిల్లుతోంది…

బావా పదండి అంటూ సరస్సు ని దాటి ఆ భవనం ముందు నిల్చున్నాము…సరిగ్గా మిట్ట మధ్యాహ్నం కి మరి కొంత సమయమే ఉన్నట్లు అనిపిస్తోంది సూర్యుడి స్థానం బట్టి చూస్తే..

సింధూ ఉత్సాహంగా నాని,సువర్ణ,రాధిక లని సిద్ధం కమ్మని చెప్పి బావా మేము ఆ నలుగురితో పోట్లాడే సమయంలో నువ్వూ,జానకీ లోపలికి ప్రవేశించండి తర్వాత మేము మిమ్మల్ని చేరుకుంటాము అంటూ ఒక పది నిమిషాలు ఆగి సూర్యుడి స్థానం ని అంచనా వేసి ముందుకు కదిలింది ఆ భవంతి సరిహద్దు గీత ని దాటి.

నేనూ,జానకీ లు జాగ్రత్తగా పరిసరాలని గమనిస్తూ వాళ్ళ చర్యలు గమనిస్తూ ఉన్నాము..ఒక పది నిమిషాల తర్వాత భీకర శబ్దాలతో ఏనుగుల్లాంటి ఆకారాలతో నలుగురు మనుషులు వాళ్ళని సమీపించి వాళ్ళ పైకి ఉరికారు…నలుగురూ తమ తమ నిగూఢమైన శక్తులని ప్రయోగిస్తూ ఆ యోధులని నిలువరిస్తూ ఉంటే నేను జానకీ ని పట్టుకొని ధైర్యంగా లోపలికి ప్రవేశించాను జానకీ భయపడకు అంటూ..

ఎదురుగా ఒక మహా సర్పపు తలుపు కనిపించేసరికి,జానకీ ఆ మధ్యలో నీ చేయిని పెట్టు అనేసరికి ఉత్సాహంగా చేయిని పెట్టిన మరుక్షణం ఆ నాగబంధం తెరుచుకొని మాకు దారి ని ఇచ్చింది…

లోపలికి వడివడిగా నడుస్తూ,జానకీ ఎలాంటి పరిస్థితి లో అయినా సంయమనం పాటించు అంటూ ఒక పెద్ద హాల్ లో కి ప్రవేశించి చుట్టూ చూసాను..ఒక మాయా మహల్ లా అత్యంత సుందరంగా ఆ భవంతి మిరుమిట్లు గొలుపుతోంది..

ఒక్క పది నిమిషాలు ఎలాంటి అలికిడీ వినిపించలేదు ఆ భవంతి లో నుండి,పది నిమిషాల తర్వాత నాగుల బుసలు శబ్దాలు హోరెత్తుతూ మమ్మల్ని సమీపిస్తున్నట్లు అనిపించింది…భయపడుతున్న జానకీ కి ఏమీకాదు అని ధైర్యం చెప్తూ ఆ శబ్దాలని అతి కష్టం మీద ఓర్చుకుంటూ నిలబడ్డాను కళ్ళు మూసుకొని..

శబ్దాలు ఆగిపోయాక కళ్ళు తెరిస్తే నా ముందు ఒక మహా నాగు పడగ విప్పి బుసలు కొడుతోంది,అతి భయంతో మొండి ధైర్యంతో అలాగే నిలుచున్నాను ఏ మాయలూ ప్రయోగించరాదు అన్న నియమంతో…

పక్కన జానకీ ముందున్న మహా నాగు ఆమెకి లొంగిపోయి ఆమెకి అడ్డు లేకుండా ముందుకు వెళ్ళిపోయింది,ఒక్క రెండు నిమిషాల తర్వాత నాకు కూడా ఆ మహానాగు అడ్డు తొలగిపోయి ముందుకు వెళ్ళిపోయింది…

అప్పుడు కనిపించింది దేవదూత లాగా ఆ “వరూధిని” మా ముక్కులకి సుగంధపు వాసన మత్తెక్కిస్తూ …వాహ్హ్ ఆమె అందం మాటల్లో చెప్పడానికి మాటలు మాత్రం ఉండవు… సకల లోకాల్లో ఏ సౌందర్య రాశి కూడా ఆమె అందానికి సరితూగదు నిస్సందేహంగా…

తెల్లని చీరలో దేవదూతలా నన్ను దాటి జానకీ ని సమీపించి తీక్షణంగా చూసి,అతి మధురంగా పలికింది “భేష్ నాగ జాతి కన్యా” నీ శరీరం మొత్తమూ నాగులతో అలంకరించి ఉంది అందులకే నీకు ఈ మాయా భవంతిలోకి దారి కలిగింది అంటూ సర్రున నా ముందు నిల్చుంది…

ఆమె చూపు నన్ను నిలువునా దహించివేస్తోంది ఏదో ఫీల్ ని తెప్పిస్తూ, నా మొహంలోకి అందమైన తన కళ్ళతో తీక్షణంగా చూసి,”మధనుడికి స్వాగతం” అంటూ ముగ్దమనోహరంగా నవ్వింది…