నేను చెప్తాను బావా అంటూ సింధూ అందుకుంది.
“వరూధిని ఒక మహా మంత్రగత్తె,ఆమె శక్తులు దేవతలకు ఏ మాత్రమూ తీసిపోనివి…దేవరాజు ఇంద్రుడి ప్రవర్తన నచ్చక అతడి పైకి యుద్ధం ప్రకటించి వేల సంవత్సరాల క్రితం అతడిని పరిపూర్ణంగా జయించి ఈ విశ్వ జననం,అంతం కి సంబంధించిన “మహాదీపం” ని తన స్వంతం చేసుకుంది…ఆ మహాదీపం కోసం ఎందరో మంత్రగాళ్ళు ప్రయత్నించారు ఆమె నుండి తస్కరించాలని.కానీ ఎవ్వరూ ఆమెని జయించలేక కామ్ అయిపోయారు ఆఖరికి ఇంద్రుడు కూడా ఎన్నో సార్లు దండెత్తినా అంటూ ఆపింది”.
అంత శక్తి గల ఆమెతో మనం ఆటలు ఆడటం సమంజసమేనా సింధూ ??
ఆటలు కాదు,మనం ఒక దివ్య సంకల్పం పెట్టుకొని ప్రయత్నిస్తున్నాము బావా,తప్పక మనకు విజయం లభిస్తుంది అన్న నమ్మకం ఉంది.
అదేంటే సాక్షాత్తు ఇంద్రుడే జయించలేకపోయాడు అంటున్నావు,మరి సామాన్యులమైన మన వల్ల అవుతుందా???
సంకల్పం శుద్దిగా ఉన్నప్పుడు విజయం రాక మానదు బావా,ఆమె నుండి ఆ మహాదీపం ని పొందాలని ప్రయత్నం చేసిన వాళ్ళందరూ ఏదో ఒక దుర్బుద్ధి తోనే ప్రయత్నించారు,కానీ మనం ఒక మహత్తర యజ్ఞం కోసం పరితపిస్తున్నాము అందుకే విజయం లభిస్తుంది అన్న నమ్మకం ఉంది.
అదేంటే దేవరాజు అయిన ఇంద్రుడికి కూడా దుర్బుద్ధి ఉంది అంటావా???
దుర్బుద్ధి అని కాదు బావా,ఆ దేవరాజు ఎక్కడ తన అధికారం పోతుందో అన్న తాపత్రయం తో చేసాడు,అందులోనూ స్వార్థం ఉంది గా.
హ్మ్మ్మ్ సరే,కానీ ఆ వరూధిని గురించి ఏమైనా తెలుసా నీకు???
తెలియకపోవడం ఏంటి బావా,ఆమె ఒక మహా గుణవతి, ఎంతో ఉదార స్వభావం కలిగిన మంత్రగత్తె..ఆమెకి ఉన్న శక్తులతో ఎప్పుడో ఈ విశ్వాన్ని జయించగల ధీమంతురాలు..కానీ ఎప్పుడూ తన శక్తులని దుర్వినియోగం చేయలేదు…ఈ విశ్వంలో ప్రాణులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి ఈ బాధల్ని రూపుమాపి ఎల్లప్పుడూ సుఖాలతో కూడిన కొత్త లోకాన్ని సృష్టించడానికి అహర్నిశలు శ్రమిస్తోంది…
అంత మంచి మనిషి అయినప్పుడు ఆమెకి మనం పరిస్థితి అంతా చెప్తే అర్థం చేసుకుంటుంది గా సింధూ???
నిజమే,కానీ ఆమె నియమాలు సంతృప్తి పరిస్తేనే ఆమెకి నమ్మకం కలుగుతుంది లేకుంటే మనల్ని ఆమె శత్రువులుగా చూసి మన భరతం పడుతుంది…
ఒసేయ్ అంత మహా శక్తివంతురాలైన ఆమెతో మనకు ఎందుకే?అయినా మనకు ఆ “మహాదీపం” తో పనేంటి ఇప్పుడు???
ఆ మహాదీపం తో నే ఈ విశ్వ కల్యాణం ముడిపడి ఉంది బావా,ఆ మాయావులు ఇద్దరూ శక్తి పుంజుకుంటే ఆ “మహాదీపం” ని చేజిక్కించుకొని ఈ విశ్వాన్ని అతలాకుతలం చేస్తారు అందుకే దాన్ని కాపాడుకోవాలి లేకుంటే చాలా కష్టం.
అంత ముఖ్యమైన మహాదీపం గురించి తెలిసిన వాళ్ళు అయితే ఆ మాయావులు కామ్ గా ఉంటారు అంటావా??
మన కన్నా ముందు వాళ్ళు ఆ “మహాదీపం” ని పొందడానికి ట్రై చేసి విఫలం అయ్యారు వాళ్ళ శక్తులు సరిపోక,వాళ్ళు తిరిగి పునరుద్ధరణ అవ్వకముందే మనం మేల్కొని దాన్ని చేజిక్కించుకొని కాపాడుకోవాలి…
నిజమే మామా ఆ బ్రాహ్మణ పండితుడు చెప్పినట్లు,ఆ మాయావులకి ప్రతికూల సమయం ఉన్నప్పుడు మనకు అనుకూల సమయం నడుస్తుంది అన్న మాట నిజమే అనిపిస్తోంది, ఇదే సరైన అవకాశం మనం సిన్సియర్ గా ప్రయత్నిస్తే తప్పక విజయం లభిస్తుంది అన్నాడు నాని గాడు.
అలాగే రా ఆ “మహాదీపం” ఆ మాయావులు చేజిక్కించుకోకుండా మనమే ముందు దాన్ని కాపాడుకోవాలి,ఇంతకీ ఏమైనా ప్లాన్ ఉందా ఆమెని వశపరుచుకోవడానికి అన్నాను.
ఉంది బావా,ఒక పక్కా స్కెచ్ ప్రకారం ప్రయత్నిస్తే మనకు తప్పక విజయం కలుగుతుంది అంటూ సింధూ తన ప్రణాళిక ని చెప్పింది.
1.ఆమె నివాసం చుట్టూ నలుగురు మహా శక్తివంతులు ఉంటారు.. వాళ్ళని జయించాలంటే ఒక్క మిట్ట మధ్యాహ్నం వేళ మాత్రమే అనువైన సమయం.
2.ఆమె నివాసం చుట్టూ ఉన్న నలుగురిని జయించిన పిమ్మట లోపలికి ఎంటర్ అవ్వాలంటే మనకు నాగ బంధం గురించి తెలిసి ఉండాలి,ఆ నాగబంధం గురించి బెంగ మనకు లేదు ఎందుకంటే జానకీ కి ఆ నాగులు ఆటోమేటిక్ గా దారి ఇస్తాయి..
3.ఆమె ఎదుట నిలబడాలి అంటే మనం సామాన్య మానవుల్లాగే ఉండాలి,ఎలాంటి మాయలు ప్రయోగించకూడదు.ఇది చాలా ముఖ్యం…నువ్వు, జానకీ ఇద్దరూ లోపలికి వెళ్ళి ఆమెని వశపరుచుకోవడానికి ప్రయత్నించండి ..
ఇక బయట ఉన్న నలుగురు శక్తివంతులు ని మేము చూసుకుంటాము..వాళ్ళని జయించాక మేము లోపలికి వస్తాము ఎలాగూ నాగబంధం తెరుచుకుంటుంది కాబట్టి అంటూ సింధూ ప్రణాళిక ని చెప్పింది.
ఒసేయ్ నలుగురు శక్తివంతమైన వాళ్ళు అంటున్నావు మరి మీ ఇద్దరే ఎలా జయిస్తారే వాళ్ళని అన్నాను..
హబ్బా ప్రతి దానికీ నీకు తొందరే బావా,ఇంత తెలిసిన నేను ఆ జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా సిద్ధం అవుతాను అనుకున్నావ్??కాసేపట్లో రాధికా,సువర్ణ లు వస్తారు ఆగు అప్పుడు అర్థం అవుతుంది అంది..
నేను ఆశ్చర్యం గా వాళ్ళిద్దరికి ఏమి తెలుసే అన్నాను…
ఆహా నీకు తెలియనివి చాలానే ఉన్నాయి లే త్వరలో అన్నీ తెలుస్తాయి,ఏమీ తెలియకుండానే రాధిక,సువర్ణ(కొత్త క్యారెక్టర్) లు మంజరిని నీతో మధనం చేసేలా చేసారు అనుకుంటున్నావా బావా??వాళ్ళు కూడా అన్నీ తెలిసిన వాళ్లే అదిగో వస్తున్నారు అంటూ సింధూ చేయి చూపించింది అటు వైపు.
రాధికా,సువర్ణ లు ఇద్దరూ మమ్మల్ని చేరుకొని,అంతా సిద్ధమేనా అన్నారు…