అందులో ఏముందిలే బాబూ,ఆలస్యం చేయకుండా నీవు జానకీ తో పాటూ మీ ఊరిని చేరుకోవడం ఉత్తమం, ఎందుకంటే ఈ ఊరు ఆ మాయావులకి అత్యంత అనువయిన ప్రదేశం అంటూ హెచ్చరించాడు..
నిజమే గోపాల్ గారు మీరన్నది,ఇంకనూ వాళ్ళకి శక్తులు సిద్దించలేదు,ఒకవేళ ఈరోజు జానకీ తో ఆ జ్యోతిరాదిత్యుడు మధనం చేసి ఉంటే వాళ్ళ శక్తులు వృద్ధి అయ్యేవి,దేవుడి దయ వల్ల అలా జరగలేదు సంతోషం,మీరు ఒక్కసారి ఆ పెద్దిరెడ్డి ని కలిసి జరిగిన విషయం చెప్పండి అతడు మంచివాడుగా మారడానికి సహాయపడిన వారు అవుతారు అంటూ సెలవు తీసుకొని బయలుదేరాను…
జానకి నాతో పాటూ నడుస్తూ,సంజయ్ గారు ఆ పెద్దిరెడ్డి ఒక మాయావి అని చెప్పారు కదా,మళ్లీ నాన్న ని వెళ్లమంటున్నారు ఏంటి అంటూ తన అమాయకపు చూపులతో ప్రశ్నించింది..
అలా కాదు జానకీ,పెద్దిరెడ్డి మామూలు మనిషే,కానీ అతడి జన్మ నక్షత్రం మరియు ఆ మాయావి జన్మ నక్షత్రం ఒకటే కావడం మూలాన అతడి శరీరంలోకి ఆ మాయావి ప్రవేశించి పెద్దిరెడ్డి ని అదుపు చేసాడు అంతే,ఇప్పుడు ఆ మాయావి అతడి శరీరం నుండి వెళ్ళిపోయాడు కాబట్టి ఇక పెద్దిరెడ్డి ముందులాగే అందరి ముందు ఉంటాడు అని చెప్పాను…
జానకీ ఏదో అర్థం అయినట్లు,అయితే నక్షత్రం ఒకటే కాబట్టి మళ్లీ పెద్దిరెడ్డి శరీరం లోకి ఆ మాయావి రావొచ్చు గా అంటూ ప్రశ్నించింది..
నిజమే,కానీ ఒక్కసారి ఆ శరీరంలోని ఆత్మ బయటికి వచ్చేస్తే తర్వాత ఆ శరీరంని ఆవహించే అవకాశం కోల్పోతుంది కావునా పెద్దిరెడ్డి వంట్లోకి ఆ మాయావి ఇక రాలేడు, ఇంకొక కొత్త శరీరంని వెతుక్కోవాలి అందుకు చాలా సమయం పడుతుంది అని చెప్పాను..
హ్మ్మ్మ్ ఇప్పుడు అర్థం అయ్యింది,మరి ఆ చంటీ,నాయకి ల విషయం ఏంటి??
అక్కడికే వెళ్తున్నాము ఇప్పుడు,అంతా నీకు అర్థం అవుతుంది అంటూ కాసేపు నడక తర్వాత చంటీ ఇంట్లోకి ప్రవేశించి చంటీ అంటూ గట్టిగా అరిచాను…
అన్నయ్యా అంటూ ఆప్యాయంగా వచ్చి నన్ను కౌగిలించుకొని,అంతా సవ్యంగానే జరిగింది కదా అంటూ ప్రశ్నించాడు..
అంతా సవ్యంగానే జరిగింది చంటీ,నా పనికి నువ్వు,నాయకి ఇద్దరూ చేసిన సహాయానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను అంటూ జేబులో నుంచి ఒక మణిహారం ఇచ్చాను…
అన్నయ్యా మీరిచ్చిన బహుమానం ని జీవితాంతం భద్రపరుచుకుంటాను,నాయకి అత్త ని పిలుస్తాను అంటూ బయటికి వెళ్ళాడు..
జానకీ చంటీ ని నిశితంగా పరిశీలించడం మొదలెట్టింది ఇంట్లోకి ఎంటర్ అయ్యినప్పుడు నుండీ,నాకోసం డైలీ వచ్చేవాడు ఇప్పుడు కనీసం చూడనేలేదు అని ఆశ్చర్యం తో చూస్తోంది బయటికి వెళ్తున్న చంటీ ని గమనిస్తూ.
తన పరిస్థితి ని ఆకళింపు చేసుకొని,జానకీ చంటీ ఎప్పుడూ నిన్ను ఆ దృష్టితో చూడలేదు అంటూ ఆమె ఆలోచనలకు బ్రేక్ వేసాను.
నా మాటకు తడబడినా తేరుకొని ,అదేంటీ సంజయ్ గారు చంటీ ఎప్పుడూ నన్నే చూస్తూ నాకోసం తిరిగేవాడుగా అంది ఆశ్చర్యంగా…
నిజమే అది చంటీ కాదు,చంటీ రూపంలో ఉన్న “రాజసింహుడు”,ఆ మహారాజే నిన్ను తన వైపుకి తిప్పుకుని నీకు జరిగే అపాయం గురించి చెప్పాలని అలా చేసాడు అన్నాను తన అనుమానం ని నివృత్తి చేస్తూ.
ఓహో అవునా ఇప్పుడు అర్థం అయ్యింది లే సంజయ్ గారు అంటూ చిన్నగా నవ్వి మరి నాయకి గారు కూడా సేమ్ చంటీ లాగే నా అంటూ ప్రశ్నించింది..
అవును జానకీ ,ఉమా మహేశ్వరి రూపంలో ఉన్న నాయకి ని రాజసింహుడు రూపంలో ఉన్న చంటీ మోహించాడు అంతే తప్ప చంటీ,నాయకి లకి ఎలాంటి సంబంధం లేదు.
అలాగే సంజయ్ గారు అంటూ హమ్మయ్యా అనుకుంటూ గుండెల పైన చేయి వేసుకుంది.
ఏంటి జానకీ,చంటీ పైన అభిమానమా?లేకా వేరే ఏమైనా ఉందా అంటూ నవ్వాను..
అలాంటివేమీ లేవు సంజయ్ గారు,నన్ను తదేకంగా పరిశీలిస్తుంటే చెడ్డవాడు అనుకొని తిట్టుకునేదాన్ని ఇప్పుడు నిజం తెలిసాక ఊపిరి పీల్చుకున్నాను చంటీ కి ఏమీ తెలియదని అంటూ నవ్వింది.
హ హ్హా నిజమే మరి,రాజసింహుడు మాయకే లొంగని నువ్వు చంటీ ని ఎలా ఇష్టపడతావ్ అని ఆలోచించలేకపోయాను అని అన్న వెంటనే నాయకి ఆప్యాయంగా నా దగ్గరికి వచ్చి,మధనా అంతా అదుపులోనే ఉంది గా అంటూ కౌగిలించుకుంది ప్రేమగా.
నాయకి గారూ,అంతా అదుపులోనే ఉంది.. మీ ఇద్దరి సహాయం మూలానే మనకి మేలు జరిగింది అంటూ నాయకి కి ఒక మణిహారం ఇచ్చి జాగ్రత్తలు చెప్పి బయలుదేరాను…
బయలుదేరుతున్న మమ్మల్ని ఆపి,జానకీ దగ్గరికి వెళ్లి కుంకుమతో బొట్టు పెట్టి,జానకీ ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు ధైర్యం కోల్పోకు తల్లీ,నీకు మేమందరమూ ఉన్నామని మరచిపోకు అంటూ ముద్దు పెట్టి మాకు వీడ్కోలు పలికింది..
జానకీ చేయి పట్టుకో అని ఆజ్ఞాపించి నా బంగారు ఖడ్గం సహాయంతో ఒక్క క్షణంలో మా ఇంట్లోకి ప్రవేశించాను.. జానకీ ఆశ్చర్యపోయి,ఇలాంటి మాయలు ఈ కాలంలో కూడా ఉన్నాయా అంటూ అడిగింది..
మాయలూ, మంత్రాలూ ట్రాష్ అని కొట్టిపడేసే జనాలు కోకొల్లలు,ఇప్పుడు అర్థం అయ్యిందిగా మాయలు కూడా ఉన్నాయని అంటూ ఇంట్లోకి ప్రవేశిస్తుంటే ఆగు అంటూ అర్చన వదిన ఆపి మా ఇద్దరికీ దిష్టి తీసి ఇంట్లోకి రమ్మంది..
అప్పటికే అక్కడికి పంకజం అత్త కూడా చేరుకొని ఉండటంతో మా అమ్మతో సహా అందరూ జానకీ ని కుశల ప్రశ్నలు వేసి లోపలికి తీసుకెళ్లారు…
ఫ్రెష్ గా స్నానం చేసి తినేసిన వెంటనే నానీ గాడు ఒరేయ్ సంజయ్ అంటూ ఇంట్లోకి ప్రవేశించాడు.
హా చెప్పు రా కొత్త పెళ్ళి కొడకా,ఏంటి విషయం అన్నాను..
ఇప్పుడు అవన్నీ ఎందుకులే గానీ,ఇంతకీ తను ఎక్కడ రా అంటూ లోపలికి వెళ్లొచ్చి జానకీ ని చూసి వచ్చి,నిజమే మామా ఆ అమ్మాయి మొహంలోనే తెలుస్తోంది తన జాతకం అంతా,ఆలస్యం చేయకుండా తెములు ఇక ఆ బ్రాహ్మణుడు పిలుస్తున్నారు అంటూ నన్ను పిలుచుకొని రాజమందిరం లోకి తీసుకెళ్లాడు..
మేము వెళ్ళేసరికి సివంగి,సువర్ణ లు కూడా బ్రాహ్మణుడు తో పాటూ కూర్చొని ఉన్నారు వాళ్లకేసి వెళ్తున్న నన్ను ప్రేమగా చూస్తూ…
వెళ్లిన వెంటనే బ్రాహ్మణుడికి ప్రణామం చేసి కూర్చున్నాను….
ఏమయ్యా మధనా,ఇంతకీ రాజసింహా,ఉమా లు ఇద్దరూ సంతోషంగానే వెళ్ళారా లేకా ఏమైనా వెలితితో వెళ్ళారా అంటూ ప్రశ్నించాడు.
లేదు పండితా, ఇద్దరూ చాలా సంతోషంతో నిర్యాణం ని పొందారు అన్నాను వినయంగా.
నిజమే ఆ మహానుభావుల కృషి,మధనం వల్ల ఇదిగో నీ సువర్ణ,సివంగి లు పరిపూర్ణ మానవ రూపుని సంతరించుకుని నీ రాక కోసం వేచిచూస్తున్నారు అంటూ నవ్వుతూ చెప్పాడు.
ఎందుకో సువర్ణ, సివంగి లని చూస్తుంటే మనసు చాలా సంతోషానికి గురవ్వుతూ అంతులేని ఆనందం ని ఇస్తోంది,నాలో కలిగే ఆ మధుర భావనలను అణుచుకోలేక పైకి లేచి వాళ్లకేసి వెళ్లి ఇద్దరినీ ప్రేమగా కౌగిలించుకొని నుదుట ముద్దుపెట్టాను..
ఇద్దరూ కళ్లనీళ్లతో మధనా,నీలో జీవితాంతం ఐక్యం అయ్యేందుకు మార్గం సుగమమైంది, మా జన్మలని ధన్యం చేసావు నీ మధనం వల్ల అంటూ ఇద్దరూ వంగి నా పాదాలకి నమస్కరించారు..