హ హ్హా ఏమీలేదులే జానకీ,అంతా సృష్టి రహస్యం,ఎలా జరగాలి అని రాసి ఉంటే అలా జరిగిపోతుంది..
నిజమే,కానీ నాకు ఒక చిన్న టెన్షన్ పుట్టుకొస్తోంది,దానికోసమే ఇలా బయటికి వెళ్దాం అన్నాను అంది మొహంలో కాసింత ఆందోళన నింపుకొని.
ఏమైంది జానకీ అన్నాను ఆతృతగా..
ఏమీలేదు సంజయ్,ఆ వరూధిని నా గురించి మాట్లాడుతూ నేను అత్యంత ముఖ్యమైన దాన్ని అని చెప్పేసరికి ఎందుకో కాసింత భయంగా ఉంది..
అయ్యో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు జానకీ,ఆ తాలూకు విషయం నేను చెప్తాను టెన్షన్ పడకు అంటూ మొదలెట్టాను..
“ఆ గుహుడు సకల లోకాలకు రాజు అవ్వాలంటే 14 లోకాల్ని జయించాలి..వాడి శక్తి పునరుద్ధరణ అయితే 13 లోకాలు అవలీలగా వాడి వశం అవుతాయి ఒక్క నాగ లోకం తప్ప…”.
నాగలోకమా??అదెందుకు వశం అవ్వదు వాడికి???
దానికో ప్రకృతి నియమం ఉంది జానకీ…”జనమేజయుడు జరిపిన సర్పయాగంలో భూలోకం లో ఉన్న సర్పాలు అన్నీ ఆ యాగపు గుండంలో పడి ఆత్మార్పణ చేసుకున్నాయి ఒక్క ఆ లోకపు రాజు అయిన “వాసుకి” తప్ప..నిజానికి ఆ నాగరాజు కూడా మరణించినా ఆ పరమేశ్వరుడు ఇచ్చిన వరం వలన ఇప్పటికీ ఆ వాసుకి జీవిస్తూ ఈ నాగజాతిని కాపాడుతూ వస్తోంది తన జాతి వాళ్ళని తప్పులు చేయకుండా అదుపు చేస్తూ”..
ఇందులో కొత్తగా ఏముంది సంజయ్??ఆ వాసుకి ని జయిస్తే చాలు గా నాగలోకం వాడి వశం అవ్వడానికి??
నిజమే,కానీ ఇందులో ఒక మతలబు ఉంది జానకీ,ఆ నాగలోకానికి ఉన్న నియమం ప్రకారం “ఒక్క వాసుకిని జయిస్తే చాలదు,ప్రతి 100 సంవత్సరాలకు భూమిపైన ఆవిర్భవించే ఆ నాగలోక కన్యని కూడా జయించాలి అప్పుడే ఎవరికైనా ఆ లోకం వశం అయ్యేది”..
అవునా??అయితే ఆ భూమి పైన ఉన్న నాగకన్య ని ఎలా కనుక్కుంటారు వాళ్ళు???
అది పెద్ద విషయం కాదు జానకీ,నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వే ఆ నాగలోకపు కన్య వి,నిజానికి నీ చదువుకు అడ్డంకి డబ్బు కాదు అది ఆ మాయావులు ఆడిన మాయానాటకం..నిన్ను ఒక పథకం ప్రకారం మీ ఊరికి రప్పించారు..
నేనా ఆ నాగకన్య ని?అయినా వారికి నన్ను మా ఊరికి రప్పించాల్సిన అవసరం ఏంటి?(తన కళ్ళలో ఆశ్చర్యం అధికం అయింది)..
నువ్వే ఆ నాగకన్య వి జానకీ నిస్సందేహంగా, నాగులకి “స్దాన బలం” అన్న నియమం ఉంటుంది..ఆ స్థానబలం అనగా తాను ఆవిర్భవించిన ప్రదేశం…ఆ ఆవిర్భవించిన ప్రదేశం లోనే ఆ నాగుని వశం చేసుకోవాలి,అందుకే ఆ మాయావులు ఆ పెద్దిరెడ్డి రూపంలో తిష్ట వేసి నిన్ను వశపరుచుకోవడానికి ప్రయత్నం చేసారు, అదృష్టవశాత్తూ ఆ పథకం ని విరిగిపోయేలా చేసాము .
.
హ్మ్మ్మ్ అర్థం అయింది సంజయ్,కానీ నన్ను వశపరుచుకోవడానికి వాళ్ళకి గల మార్గాలు ఏంటి???
ఏమీలేదు జానకీ,నీ కన్యత్వం ని దోచుకుంటే చాలు వాళ్ళ వశం అయిపోతావు,తర్వాత ఒక చిన్న పూజా కార్యక్రమం తర్వాత నాగలోకం వాళ్ళ వశం అయిపోతుంది.
హ్మ్మ్మ్ ఇంత పెద్ద ప్రాసెస్ అన్నమాట,అందుకే ఆ పెద్దిరెడ్డి రూపంలో ఉన్న ఆ మాయావి నన్ను పాడుచేయడానికి ట్రై చేసాడు అని నిట్టూర్చి,ఇప్పుడు నేను ఆ స్థానం లో లేను గా సంజయ్ అలాంటప్పుడు వాళ్ళకి నన్ను వశపరుచుకోవడానికి గల అవకాశం లేదు,అలాంటప్పుడు ఆ వరూధిని జాగ్రత్తగా ఎందుకు ఉండమని చెప్పింది??
అందులో ఒక మార్గం ఉంది జానకీ,స్థానం లో లేని నాగు ని తన పూర్వ స్థానంలోకి రప్పించడానికి ఈ “సర్పయాగం” చేస్తారు,అదేవాళ్ళకి గల ఒకేఒక మార్గం..
అయినా ఆ సర్పయాగం చేస్తే నేను ఆ గుండంలో పడిపోయి ఆత్మార్పణ చేసుకుంటాను గా,అలాంటప్పుడు వాళ్ల ప్రయత్నం వృధా నే గా సంజయ్?
పొరపాటు జానకీ,నువ్వు సకల నాగజాతిని కాపాడే ఒక ముఖ్య ప్రాణి వి,నీకు ఒక మహాశక్తి ఉంది నీకు తెలియకుండానే..నువ్వు యజ్ఞ గుండంలోకి వెళ్లకుండా అదుపు చేసుకునే శక్తి నీ దగ్గర ఉంటుంది.ఆ ఉపాయం తెలుసుకునే ఆ మాయావులు నిన్ను వశపరుచుకోవడానికి ట్రై చేస్తున్నారు..
హ హ్హా సంజయ్,ఒకవేళ వాళ్ళకి నేను వశం అయ్యే సూచనలు కనిపిస్తే నా అంతట నేను ఆ గుండం లో పడి ఆత్మార్పణ చేసుకుంటానే తప్ప వాళ్ళకి లొంగేది లేదు..
అలా చేస్తే ఏ ఇబ్బందీలేకుండా వాళ్ళు నాగలోకాన్ని జయిస్తారు జానకీ,అది పొరపాటు..ఎందుకంటే సమస్త నాగజాతి నీ ఆయువు పైనే ఆధారపడి ఉంది అన్న విషయం మరువకు…నిన్ను కాపాడుకునే బాధ్యత మా పైన ఉంది…వాడు విశ్వ విజేత అవ్వాలంటే నిన్ను జయించాలి,ఆ పనిని ఆపితే చాలు వాడి కార్యానికి అడ్డు తగిలినట్లే…
హ్మ్మ్మ్మ్ ఒకవేళ వాడు నన్ను జయిస్తే పరిస్థితి ఏంటి సంజయ్??
ఏముంది వాడికి సంపూర్ణ శక్తులు లభిస్తాయి జానకీ,అప్పుడు వాడిని ఎదుర్కోవడం అసాధ్యం..అయిననూ ఒక చిన్న మార్గం ఉంది అని ఒక బ్రాహ్మణుడు చెప్పాడు దాన్ని ఆచరించాలి అంతే..
హ్మ్మ్మ్ మొత్తానికి నా కన్యత్వం అయితే ఒక విశ్వకల్యాణం లేదా ఒక విశ్వ వినాశనం తో ముడిపడి ఉందా??
అవును జానకీ నిస్సందేహంగా..
అలాంటప్పుడు నేను ఈ కన్యత్వం ని కోల్పోతే ఏ సమస్యా ఉండదు గా సంజయ్??