కింగ్ 650

కొత్త రాజు గారు ఎవరు అని దేశం మొత్తం చర్చ జరుగుతోంది .
ఎందుకు అంటే ఉన్న రాజు గారు పైలోకానికి వెళ్లారు ,,,
రాజకీయ ప్రముఖులు అందరు కలిసి సమావేశం జరిపారు ..
“రాజ కుటుంబం లో చాలామంది ఉన్నారు ,,ఎవరు తరువాత “అడిగాడు ఉత్తర ప్రాంతపు సేనాధి పతి…
“రాజ మాత ఆలోచన ఏమిటి “అడిగాడు ప్రధాని ..
అందరు రాజమాత వైపు చూసారు ..ఆమె ఆలోచిస్తూ “నికోలస్ “అన్నది ..
అందరు కొద్దిసేపు అలోచించి ఆమోదం తెలిపారు ..
####
నికోలస్ కి రాజకీయాలు కొంత తెలుసు ,,,సమావేశ మందిరానికి పిలిస్తే వెళ్ళాడు ..
“ఏమిటి అందరు ఇక్కడే ఉన్నారు ,విషయం ఏమిటి “అన్నాడు ..
“రాజమాత మిమ్మల్ని రాజు గ ప్రకటించారు “అన్నాడు ఉత్తర ప్రాంతపు సేనాధి పతి ..
నికోలస్ అలోచించి “నాకు ఇష్టం లేదు ,,నేను రాజకియ్యాలో ఉంటాను కానీ రాజుగా కాదు “అన్నాడు .
అందరు వింతగా చూసారు ,,”అదేమిటి ,అధికారం వద్దు అంటున్నారు “అన్నాడు ప్రధాని ..
“నేను ఇప్పటిదాకా సుఖం గ ఉన్నాను ,,,అధికారం నా ప్రశాంతతని నాశనం చేస్తుంది “అన్నాడు నికోలస్ ..
“కానీ దేశానికీ ప్రభుత్వం కావాలి ,,దాన్ని నడపడానికి రాజు కావాలి ,ఆ రాజు మీరే కావాలి ,,,మీరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి “అన్నాడు ప్రధాని ..
“పెళ్లి సరే ,అధికారం వద్దు ‘అన్నాడు నికోలస్ ..
కానీ అందరు బలవంతం చేయడం తో ఇష్టం లేకుండానే ఒప్పుకున్నాడు …
#####
అప్పటికే కాగితం యొక్క ఉపయోగం పెరగడం తో ఈ విషయం వార్త పత్రికల్లో వచ్చింది ..
శ్రామిక వాదం తో సిద్ధాంతాలు పెరుగుతున్న సమయం కావడం వల్ల వాళ్ళు వ్యతిరేకిస్తూ వ్యాసాలు రాసారు ..
####
కానీ రాజకీయ పెద్దలు ,,దేశం లో ఉన్న కులీనులు అంటే డబ్బు ఉన్న పెట్టుబడి దారులు ,,,రాజు గ నికోలస్ కి అధికారం అప్పగించారు …

నికోలస్ క్రమ క్రమం గ ప్రభుత్వాన్ని అర్థం చేసుకున్నాడు రెండు నెలల్లో ..

అధికారులతో సమావేశం పెట్టి “ప్రజల ఆలోచనలు ,,కోరికలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ,,,అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నా విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ..”అన్నాడు కింగ్ .
అదే విధంగా తూర్పు ,పశ్చిమ ,ఉత్తర్ ,దక్షిణ ప్రాంతాల సేనాధి పతుల్నిపిలిచి సరిహద్దుల రక్షణ సమీక్షిన్చాడు ..
కొద్దీ రోజులకి అతనికి పెళ్లి ఏర్పాట్లు మొదలు అయ్యాయి …
“దేశం లో ధనవంతుల పిల్లలు సిద్ధం గ ఉన్నారు “అన్నాడు ప్రధాని ..
“ఎవరైనా రాకుమార్తెను చూద్దాం ‘అంది రాజ మాత …
+#####
అన్ని దేశాల రాకుమార్తెల వివరాలు సేకరించారు ,,రాచకుటుంబీకులు …
కొద్దీ రోజుల కు రాజ మాత,,ఇతర బంధువులు చెప్పారు నికోలస్ కి “జర్మన్ రాకుమార్తె జలజ్ ,,చాల అందగతే …నీకు సరిపోతుంది ”
నికోలస్ కూడా అంగీకారం చెప్పాడు …
######
రాజు గారికి పెళ్లి అని వార్తాపత్రికలు ప్రకటించాయి ….
అన్ని దేశాల రాజు లకి వార్త చేరింది …
దేశం లో ఉన్న శ్రామిక సిద్ధాంతులు వ్యతిరేకిస్తూ వ్యాసాలు రాసారు …
అవి కింగ్ చదివాడు ,,”అదేమిటి నేను ఎవర్ని పెళ్లి చేసుకోవాలో ,,నాకు శ్రామికులు చెప్తారా ,,,వాళ్ళు ఎవర్ని చేసుకోవాలో నేను చెప్తాను అంటే ఎలా ఉంటుంది ..
పెళ్లి ఎవరిష్టం వారిది “అన్నాడు మంత్రు లతో ..
వాళ్ళు మల్లి వార్తాపత్రికల్లో ఖండిస్తూ సమాధానా లు ఇవ్వలేదు ….
#####
అన్ని దేశాల రాయబారులు ,,,రాజధానికి చేరుకున్నారు …
జలజ్ తరుఫున జర్మన్ రాజ వంశం మొత్తం వచ్చారు …
నికోలస్ కి ,,,జలజ్ కి చర్చి లో పెళ్లి జరిగింది ,,ఆమె అందం చూసి అందరు ఈర్ష్య పడ్డారు ..
జలజ్ సిగ్గు తో నికోలస్ ను చూసింది ….
సాధారణ ప్రజల కోసం కోసం ముందే ఏర్పాట్లు చేసారు …
ఊహించిన దానికన్నా ఎక్కువగా ప్రజలు రావడం తో ,,,తోపులాట జరగడం మొదలు అయ్యింది …
రాజు ,రాణి ఇద్దరు వేదిక వద్ద కు వచ్చి పెళ్ళికి వచ్చిన ప్రజలకి అభివాదం చేసారు ..
జలజ ఆ ప్రజలను చూస్తూ “మీరంటే ప్రజలకు అభిమానం “అంది నికోలస్ తో .
“మా వంశం అంటే అభిమానం ఉంది ,,ఇకనుండి నువ్వు రాణివి”అన్నాడు నికోలస్ .
####