టైం మెషిన్ – Part 3 103

అదే సమయంలో ఇక్కడ మల్హోత్రా గదిలో..
హాథీ వాళ్ళకి గంగాదాస్ కంపెనీలో అమ్మాయిల్ని అప్పగించాక పూజా అనే హైటెక్ కాల్ గర్ల్ ని బుక్ చేసి మల్హోత్రా రూమ్ కి పంపించాడు.

పూజా మల్హోత్రా రూమ్ డోర్ కొట్టి “మే ఐ కమిన్?” అంది.
“యెస్ కమిన్” అన్నాడు మల్హోత్రా.
వెంటనే ఒక కాంతులు వెదజల్లుతున్న మెరుపు జీన్స్, టీ షర్ట్ తో మల్హోత్రా గదిలో అడుగుపెట్టింది.
కాల్ గర్ల్ అన్న మాటే కానీ ఏడు మల్లెలెత్తు సుకుమారిలా ఉంది.
వస్తూనే హ్యాండ్ బ్యాగ్ పక్కన పెట్టేసి వెళ్లి మల్హోత్రా బెడ్ మీద కూర్చుంది.

ఆమె కళ్ళల్లో ఏదో తెలియని ఆకర్షణ. ఆమె నుంచి వస్తున్న సెంటు గుభాళింపులు మల్హోత్రా ముక్కు పుటల్ని తాకుతూ మనసులో తెలియని అలజడి కలిగిస్తున్నాయి.
మల్హోత్రా ఏమీ మాట్లాడకుండా ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. కస్టమర్ కి నచ్చినట్టు ఉండటం ఆమె విధి కాబట్టి ఆమె కూడా ఏమీ మాట్లాడకుండా మల్హోత్రాని చూస్తూ కూర్చుంది.
“పేరేంటి?” అన్నాడు మెల్లిగా మల్హోత్రా.
“పూజా” అంది ముక్తసరిగా.

“నాకు ఈ వయసులో శృంగారం చేసే కోరిక లేదు. కానీ జీవితం చివరి దశకు చేరుకున్నట్టు అనిపిస్తుంది. ఇక నాకు నచ్చింది చెయ్యడానికి మిగిలింది కొన్ని రోజులే. కాబట్టి నీకు అభ్యంతరం లేకపోతే ఈ రోజుకి నాతో..” అంటూ ఆగిపోయాడు మల్హోత్రా.
“నిజం చెప్పమంటారా సర్. నాకు ఇష్టం లేకుండానే నన్ను ఎత్తుకొచ్చి ఈ వృత్తిలో దింపారు. తర్వాత ఎంతో మంది భయపడుతున్న నాపై వికృతంగా విరుచుకుపడి మానసికంగా చంపేశారు. అదృష్టవశాత్తు బడా బాబులకు నేను నచ్చి ఇలా హైటెక్ కాల్ గర్ల్ అవ్వడం మూలంగా మనసు చచ్చిపోయినా మిగిలిన శరీరానికి అన్ని రకాల హంగులూ అందుతున్నాయి. కానీ నాకు ఎవరి మీద కంప్లైంట్స్ లేవు. ఎందుకంటే చాలా మంది కంటే నేను కొంచెం మంచి జీవితమే గడుపుతున్నాను. కాబట్టి ఈ శరీరానికి ఇష్టం, కష్టం ఏమీ లేవు. మిమ్మల్ని నా శక్తి మేర సంతృప్తి పరచడం నా ధర్మం. దానిని నేను నిర్వర్తిస్తాను” అంది నిర్లిప్తత నిండిన ముఖంతో.

“అవును. అయినా నువ్వు నన్ను కోరుకోవడానికి నాలో యవ్వనం, శక్తి, సౌందర్యం ఏమున్నాయని? సరే ఈ రాత్రికి నా స్నేహితురాలిగా ఉండగలవా?” అని అడిగాడు అభ్యర్ధనగా పూజ వైపు చూస్తూ.
“మీ ఇష్టం సర్”
“కానీ ఒక్క షరతు. నువ్వు ఈ రోజుకి నాతో శరీరంతో కాకుండా మనసుతో కూడా ఉండాలి. నాకు నా జ్ఞాపకాలు, బాధలు, కష్టాలు వినడానికి ఒక మనిషి కావాలనిపిస్తుంది. అది నువ్వు అయితే బాగుండును అనిపిస్తుంది. నీ గురించి విన్నాక నీ మీద నాకున్న భావానికి పేరు పెట్టాలి అనుకోవట్లేదు. ఈ ఒక్క రాత్రికి మాత్రం నా స్నేహితురాలిగా ఉండు చాలు మనఃస్ఫూర్తిగా” అన్నాడు ఆర్ధ్రత నిండిన గొంతుతో.

ఎక్కడో కొనఊపిరితో ఉన్న తన మనస్సుకు మల్హోత్రా ఆక్సిజన్ అందించినట్టు అనిపించింది పూజకు.
“సరే” అంది నిర్ణయాల సంఘర్షణతో నలుగుతూ.
ఇద్దరూ అలా తమ జ్ఞాపకాలు మెల్లిగా పంచుకోవడం మొదలుపెట్టారు.
మొదలు మొహమాటంగా మొదలైనా అంతలోనే అన్ని కబుర్లు చెప్పుకునే చిన్న పిల్లల్లా మారిపోయారు.

#########

అదే సమయంలో ఇక్కడ ఫ్లయిట్ లో.. హార్ధిక్…
.ఏంటి సూత్తన్నారు?
అన్నీ ఈ అప్డేట్ లోనే సెప్పేత్తారు మరి?
ఎళ్ళండెళ్ళండి..
మళ్ళీ ఇంకో అప్పుడేటుకి రండి..

ఓయ్ ఎళ్ళమన్నాను కదా అని ఎళ్ళిపోవడం కాదు..
కుదిరితే ఒక కామెంట్ పెట్టి పోండి.
సరదా కోసం..
ఎవరినీ హర్ట్ చెయ్యడానికి కాదు.

స్టేసీ మందు తీసుకొచ్చి చాలాసేపయ్యింది.

హార్ధిక్, టూటూ ఎదురెదురుగా కూర్చుని పెగ్గు మీద పెగ్గు లోపలికి పోనిస్తున్నారు.
స్టేసీ వాళ్లకు అవ్వగానే ఇంకొక పెగ్ సర్వ్ చేస్తుంది. నాటు తాగుడు తప్ప ఇలా డిగ్నిఫైడ్ గా తాగడం టూటూకి అలవాటు లేకపోయినా మెల్లిగా అలాగే తాగుతున్నాడు మొహమాటంగా.
ఇంతలో హార్ధిక్ ” టూటూ” అనగానే “దొరా..” అన్నాడు చురుకుగా తాగడం ఆపి.
“మందు నచ్చిందా?” అన్నాడు టూటూ కళ్ళలోకి చూస్తూ.

“చాలా మత్తుగా ఉంది దొరా. బుర్ర గిర్రుమని తిరుగుతుంది” అన్నాడు మత్తుగా జోగుతూ.
“ఎక్కువ తాగకు. మనం ఇంకొక 4గంటల్లో దిగిపోవాలి. వెళ్ళి పడుకో” అన్నాడు అదేశిస్తున్నట్టు.
స్టేసీ వైపు చూసి ” స్టేసీ.. ఇతన్ని రూమ్ కి తీసుకెళ్లు. ” అన్నాడు.
స్టేసీ “ఓకే సర్” అని చెప్పి తన చెయ్యి అందించింది టూటూ కి లేవమన్నట్టు.
అప్పుడే పడుకోవాలి అని లేకపోయినా స్టేసీని తీసుకెళ్ళమనడం వల్ల బుద్ధిగా లేచి నుంచుని ఆమెను అనుసరించాడు టూటూ.

ఆమె వెనుకే వెళ్తున్న టూటూని పిలిచి “ఈ రోజుకి ఇంక పడుకో. మనం వెనక్కి వెళ్ళేటప్పుడు కూడా అదే అమ్మాయి ఉంటుంది” అన్నాడు మెల్లగా.
టూటూ ఒక పది సెకండ్లపాటు అలా నిర్ఘాంతపోయి చూసాడు “ఎలా తెలిసిందబ్బా?” అనుకుంటూ.
“ఏం ఆలోచించకుండా వెళ్ళి పడుకో” అన్నాడు హార్ధిక్ అతని మనసులో ఆలోచనలు చదివినట్టు.
హార్ధిక్ కూడా లాస్ట్ పెగ్ ఫినిష్ చేసి కాసేపు నిద్రపోయాడు.
ఫ్లయిట్ ల్యాండ్ అవ్వబోతుందని పైలట్ ఇచ్చిన అలర్ట్ తో లేచి టూటూ ని కూడా లేపాడు.

ఆస్ట్రేలియాలో దిగే సరికి ఉదయం 8.30 అయ్యింది. ఫ్లైట్ దిగగానే ఫోన్ ఆన్ చేసాడు హార్ధిక్. 24 మిస్డ్ కాల్ అలర్ట్స్ ఉన్నాయి.
అన్నీ మల్హోత్రా దగ్గరనుంచే. వెంటనే మల్హోత్రాకి కాల్ చేసాడు హార్ధిక్.
ఇక్కడ రాత్రి 3 అయ్యింది. ఇంకా మల్హోత్రా , పూజా ఊసులు చెప్పుకుంటూనే ఉన్నారు. వరదల సమయంలో దిగువ ఆనకట్టకు నీళ్ళు వదిలినట్టు వాళ్ళ మాటల ప్రవాహం సాగుతూనే ఉంది.
ఇంతలో ఫోన్ రింగయితే “వన్ మినిట్” అంటూ గదిలోంచి బయటకు వచ్చి ఫోన్ అటెంప్ట్ చేసాడు మల్హోత్రా.
“చెప్పండి మల్హోత్రా.. ఎందుకు అన్ని సార్లు ఫోన్ చేశారు?” అన్నాడు హార్ధిక్.

అవతల ఫోన్ లో మల్హోత్రా చెప్పిన విషయం విని ఒక్కక్షణం స్థాణువు అయిపోయినా మళ్ళీ తేరుకుని ” సరే నేను చూసుకుంటాను. వచ్చాక మాట్లాడతాను” అని ఫోన్ కట్ చేసేసాడు.
లోపలికి వస్తున్న మల్హోత్రాని చూసి “ఏమైంది?” అన్నట్టు ఒక చూపు విసిరింది పూజా.
“ఏమి లేదు ” అన్నట్టు తల అడ్డంగా ఊపి “పడుకో.. నాకు బాగా నిద్ర వస్తుంది. నీకు ఉదయం అర్ధమవుతుంది.” అంటూ మంచం మీద కూర్చున్న పూజాని చేత్తో వెనక్కి నెట్టి గుండెల మీద చెయ్యి వేసి నిద్రలోకి జారిపోయాడు మల్హోత్రా.

పూజాకి ఎక్కడో భయంగా అనిపించింది. అలాగే చూస్తూ చూస్తూ పూజా కూడా మెల్లిగా నిద్రపోయింది.
రన్వే మీదకు వచ్చి ఆగిన కార్ లో హార్ధిక్, టూటూ ఎక్కి కూర్చున్నారు.
కొంచెం సేపటికి కారు ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి అక్కడి నుంచి ఒక రహస్య ప్రదేశానికి చేరుకుంది.
అక్కడ హార్ధిక్ కారు దిగుతుండగా ఒక కెప్టెన్ కొంతమంది గార్డ్స్ తో కలిసి ఎదురొచ్చి పలకరించాడు.

“సో యూ ఆర్ హార్ధిక్ రైట్? నేను జనరల్ హెన్రీ” అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు.
“నేను హార్ధిక్. మా నాన్నగారు మీకు అన్నీ చెప్పారు అనుకుంటున్నా”
“యెస్ యెస్.. అన్నీ రెడీ చేసాను కూడా. రండి వెళ్దాం” అంటూ లోపలికి తీసుకెళ్ళాడు.
అక్కడ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తున్నట్టు అటూ ఇటూ వరుసగా బ్లాక్ సూట్స్ వేసుకుని చాలా మంది నిలబడి ఉన్నారు.
హెన్రీ వాళ్ళని పరిచయం చేయడం స్టార్ట్ చేసాడు. అందరి పేర్లు, వాళ్ళ శక్తి సామర్ధ్యాలను వివరించాక “వెల్ మిస్టర్ హార్ధిక్ వీళ్ళంతా రకరకాల దేశాల స్పెషల్ ఫోర్సెస్.. నీకు నచ్చిన వాళ్ళను సెలెక్ట్ చేసుకో. ఇవి వీళ్ళ ట్రాక్ రికార్డ్స్” అంటూ ఒక ట్యాబ్ చేతికిచ్చాడు.

హార్ధిక్ బాగా పరిశీలించి ఒక 27మందిని సెలెక్ట్ చేసాడు.
ప్రతి గ్రూప్ నుంచి ముగ్గురిని తీసుకున్నాడు.
ఎకో కోబ్రా, ఆస్ట్రియా
GIS , ఇటలీ
SAS, యునైటెడ్ కింగ్డమ్.

మాక్రోస్, ఇండియా.
నేవీ సీల్స్, అమెరికా.
GSG 9, జర్మనీ.
డెల్టా ఫోర్స్, యునైటెడ్ స్టేట్స్.
JW GROM, పోలాండ్.

GIGN, ఫ్రాన్స్.

వీళ్ళంతా ఆయా దేశాల్లో అద్భుతంగా ట్రైన్ చేయబడి తర్వాత వివిధ కారణాలతో మానేసి ఇప్పుడు డబ్బు కోసం ఇలా వచ్చారు. అసాల్ట్ చెయ్యడంలో వీళ్ళు నిపుణులు. క్లోజ్ కంబాట్ లో వీళ్ళ ముందు నిలవడం దాదాపు అసాధ్యమే.
హెన్రీతో వీళ్ళని ఇన్ చెయ్యమని చెప్పాడు హార్ధిక్.
“ఓకే డన్. నెక్స్ట్ ఏంటి?” అన్నాడు హెన్రీ.
“నాకు క్లోజ్ రేంజ్ వెపన్స్ వాడే మంచి ప్రొఫెషనల్ మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఫైటర్స్ కావాలి” అన్నాడు హార్ధిక్.

హెన్రీ పెదాల మీద ఒక చిరునవ్వు మెరిసి మాయమయ్యింది. కరాటే, కుంగ్ ఫు, తైక్వండో, కిక్ బాక్సింగ్, స్ట్రీట్ బాక్సింగ్, ముయాయ్ థాయ్, సమురాయ్, నింజా, అపాచీ, జుజిట్సు, బ్రెజిలియన్ జుజిట్సు, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మొదలైన మార్షల్ ఆర్ట్స్ లో నిపుణులైన వంద మందికి పైగా అక్కడ క్షణాల్లో ప్రత్యక్షమయ్యారు.
వాళ్ళలోంచి ఒక 20 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు హార్ధిక్.
“ఇంకేం కావాలి సర్” అన్నాడు హెన్రీ వినయంగా. వయసు చూసి చిన్న కస్టమర్ అనుకున్నాడు కానీ అమౌంట్ చాలా పెద్ద మొత్తంలో రాబోతుంది అని తెలియగానే అమౌంట్ కన్నా ముందు రెస్పెక్ట్ వచ్చేసింది.

“వీళ్ళకు కావలిసిన వెపన్స్ కూడా ఇచ్చేస్తే నేను చెకౌట్ చేసి బయలుదేరాలి ” అన్నాడు హార్ధిక్.