టైం మెషిన్ – Part 3 103

“కొన్ని అనుమానాస్పద వస్తువులు స్వాధీనం చేసుకున్నాం సర్.. బయట వాచ్మాన్ అయితే ఎవరూ రాలేదు అంటున్నాడు. అతని మాటలు కొంచెం అనుమానాస్పదంగా ఉండటంతో అతన్ని కస్టడీలోకి తీసుకున్నాం. ఒకటి రెండు రోజుల్లో దీని మీద ఒక స్పష్టత రావచ్చు సర్”
“ఏం దొరికాయి?”
” వాళ్ళ సెల్ ఫోన్, వాళ్ళ నెంబర్ రాసి ఉన్న ప్లకార్డు, ఇంకా వాళ్ళ బ్యాంక్ కార్డులు దొరికాయి. అక్కడ ఏమైనా వేలిముద్రలు దొరుకుతాయేమో అని మా క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీం, డాగ్ స్క్వాడ్ అక్కడే సెర్చ్ చేస్తున్నారు”
” ఓకే.. నాకు మీరు చిన్న హెల్ప్ చెయ్యాలి. ”
“చెప్పండి సర్”
“ఏం లేదు. అందులో లాస్ట్ కాల్ రికార్డ్ నాదే. వాళ్ళని రేపటికి బుక్ చేసుకున్నాను. కలవడానికి గేట్ వరకు వెళ్ళాను కానీ వాళ్ళు కిందకి రాలేదు. వాచ్మాన్ కి డబ్బులు ఇచ్చి వచ్చాను. కాబట్టి అందులో నా నంబర్ డిలీట్ చేసేయ్యండి. అలాగే ఆ వాచ్మాన్ ని వదిలెయ్యండి. ఆ ప్లకార్డు గురించి కూడా రిపోర్టులో మెన్షన్ చెయ్యొద్దు. సరేనా?”
“సర్ అది.. అది.” అంటూ నసుగుతున్నాడు.
“సరిపోతుందా” అన్న హార్ధిక్ మాటలకు తలెత్తి చూసిన SI కళ్ళ ముందు డబ్బు గుట్టగా పడి ఉంది.
“సర్” అని సెల్యూట్ చేసి ఆ డబ్బు బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళిపోయాడు.
బాగా పొద్దుపోవడంతో రేపు మల్హోత్రా సంగతి చూడాలి అనుకుంటూ మంచం మీద పడి అలాగే నిద్రపోయాడు హార్ధిక్.
హార్ధిక్ లేచేసరికి 10 అవుతుంది.
బద్ధకంగా లేచి ఒళ్ళు విరుచుకున్నాడు హార్ధిక్.
లాన్ లో చైర్ లో కూర్చుని సిగరెట్ తాగుతూ గాలిలో చూస్తున్నాడు. ఎందుకో టీ తాగాలి అనిపించింది.
నౌకారుని పిలిచి టీ తీసుకురమ్మన్నాడు.
రాత్రి తండ్రి చెప్పిన మాటలే మెదడులో తిరుగుతున్నాయి.
హాథీకి ఫోన్ చేసి రమ్మన్నాడు.
ఈ లోపు ఫ్రెష్ అయ్యి వచ్చాడు.
టిఫిన్ చేస్తుంటే హాథీ వచ్చాడు.
“ఛటర్జీ గురించి ఏమైనా తెలిసిందా?”
“వాడు వాడి ఫార్మ్ హౌస్ లో ఉన్నాడు.”
“నేను కలవాలి”
“ఎవరినీ కలవడం లేదు”
“కలవాలి అని చెప్పా కదా. మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే కలుస్తాను”
“ఓకే సర్ నేను ఎరేంజ్ చేస్తాను” అని చెప్పి హాథీ అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు.
హార్ధిక్ తన కార్ లో బయటకు వెళ్ళిపోయాడు.
కార్ హౌరా బ్రిడ్జి సమీపంలో ఉన్న ఒక మురికివాడలోకి వెళ్తుంది.
ఎటు చూసినా దుర్గంధం. అక్కడి మనుషులు చాలా క్రూరంగా ఉన్నారు.
కొంత ముందుకు వెళ్ళాక దారి ఆగిపోయింది.
అక్కడ ఒక కిళ్ళీ కొట్టు దగ్గరకి వెళ్ళి “గంగా దాస్ ఎక్కడ ఉంటాడు?” అని అడిగాడు.
ఎవరూ తమకి తెలియదని తల అడ్డంగా ఊపారు.
జేబులోంచి నోట్ల కట్ట ఒకటి బయటకి తీసి విసిరాడు.
కొట్టు యజమాని పక్కనే ఉన్న ఒక పిల్లవాడికి దారి చూపించమని పంపించాడు.
ఆ పిల్లవాడు అక్కడ ఉన్న చిన్న చిన్న సందుల్లో ఒక 10 మెలికలు తిప్పి తీసుకువెళ్ళాడు.
ఆ ఏరియాలో గంగా దాస్ మర్డర్ చెయ్యడానికి ఫేమస్.
ఇలాంటి ఏరియాలో ఉండటం వల్ల సెక్యూరిటీ ఆఫీసర్లు రావడానికి తాను పారిపోవడానికి దాదాపు అరగంట వ్యత్యాసం ఉంటుంది.

గంగాదాస్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కరుడుగట్టిన నేరస్తులు.
వాళ్ళకి జీవితం అంటే ఏంటో కూడా తెలీదు.
పీకల వరకు మందు
కడుపునిండా భోజనం
అమ్మాయితో పడక

ఇవి రోజూ అందించే గంగాదాస్ వాళ్లకు దేవుడు. అతను ఏం చేయమంటే అది చేసి వచ్చేయడం, దొరికితే నిజం చెప్పకపోవడం, చచ్చిపోతున్నా అది గంగాదాస్ కోసం చావడం వాళ్ళ అలవాటు.
అందుకే గంగాదాస్ అక్కడ లీడింగ్ క్రిమినల్ అయ్యాడు.
చిన్నప్పుడే అనాధ పిల్లల్ని కొనుక్కుంటాడు.
అబ్బాయిలకు దొంగతనాలు, అడుక్కోవడం, కొట్లాటలు, రాజకీయ పార్టీల సభల్లో అల్లకల్లోలం సృష్టించడం, కత్తి వాడకంలో శిక్షణ ఇచ్చి రాటు తెలుస్తాడు.
ఆపైన వారిని మద్యం, గంజాయి, అమ్మాయిలు మొదలైన వాటికి బానిసలుగా చేసి తన ఆధీనంలో పెట్టుకుంటాడు.

అమ్మాయిలైతే రకరకాల పనులకు వినియోగిస్తాడు. వంటలు, పాచిపని, ఒళ్ళు నొక్కడం, లేబర్ పనులకు వాడుతాడు.
పెద్దమనిషి అయ్యాక రుచి చూసి తన జనానికి విందుగా వదిలేస్తాడు.

ఆ ప్రాంతంలో గంగాదాస్ కి 3 వేశ్యావాటికలు ఉన్నాయి.

హార్ధిక్ ఆ ప్రాంతం మొత్తం నడుస్తూ వెళ్తున్నాడు. అక్కడ ఉన్న వేశ్యలు హార్ధిక్ ని రమ్మని పిలుస్తున్నారు. అలా వెళ్తూ ఆ సందు దాటగానే ఒక పెద్ద ఖాళీ స్థలం కనిపించింది. దాని చుట్టూ రేకు షెడ్లు వేసిన ఇళ్ళు ఉన్నాయి.
అక్కడ రకరకాల మనుషులు ఉన్నారు.
కొంతమంది ఆయుధాల ఖార్ఖానాలో పని చేస్తున్నారు. తాగే వాళ్ళు తాగుతున్నారు. కొంతమంది కసరత్తు చేస్తున్నారు. కొంతమంది భాతాఖాని వేసుకుంటున్నారు.
అక్కడి వరకు హార్ధిక్ ని తీసుకొచ్చిన పిల్లాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
“ఎవరు కావాలి?” వెనకనుంచి ఉరిమింది ఒక కంఠం.
“గంగాదాస్ ని కలవాలి” చెప్పాడు హార్ధిక్.
హార్ధిక్ ఆహార్యం, చేతిలో బ్రీఫ్ కేస్, గౌరవం లేకుండా హార్ధిక్ అడిగిన తీరు చూసి ఎవడో బలిసినోడు అనుకుని “రండి సాబ్ ఇలా కూర్చోండి. దాదాని పిలుచుకొస్తాను” అని అక్కడ్నుంచి లోపలికి వెళ్ళిపోయాడు.

రెండు నిమిషాలకి లోపలనుంచి నల్లటి కుర్తా, తెల్లటి ప్యాంటు, తోలు చెప్పులు, మెళ్ళో గొలుసు, నోట్లో కిళ్ళీ, ఎర్రటి బొట్టుతో ఒక 50 సంవత్సరాల గంగాదాస్ నడుచుకుంటూ వచ్చాడు.