యుద్ధ నీతి 211

ఆవేశం తగ్గేదాకా బుసలు కొడుతూ గమ్మున కూచొండిపోయింది హాల్దియా. తరువాత నెమ్మదిగా పాణి దగ్గరకొచ్చి చూడు పాణి, మీకూ మాకూ మధ్య వ్యక్తిగతంగాఎటువంటీ కంప్లైంట్ లేవని నీవే అన్నావు, అవునా?. . . అటువంటప్పుడు నీవు ఇలా ఆవేశపడి ప్రాణం మీదకు ఎందుకు తెచ్చుకొంటావు. ఆలోచించు. చిన్న పాటి ప్రేరేపణకే నీ పిల్లలిద్దరూ వావి వరుసలు ఎలా మరచిపోయారో చూస్తున్నావుకదా. . .ఇకపై వారికి కావాల్సింది. చిన్న ఏకాంతం మాత్రమే. . అలా అని వారిద్దరినీ కలపడం నా ఉద్ద్యేశ్యం ఎంత మాత్రం కాదు. నీవు మీ సైనిక రహస్యాలు చెప్పి నీ పిల్లల్తో నీ దారిన నువ్వు పోవచ్చు.
పాణి ఆవేశంతో గర్జిస్తూ ఒసేయ్ నీతి లేని కుక్కా. . . . . . …… . . ……… యుద్ధఖదీలుగా పట్టుకొన్న నన్ను ఏమీ చేయలేక, నా పిల్లలను ఇంత దాకా తీసుకొచ్చావు.నీకు మా సైనిక రహస్యాలను చెప్పినంత మాత్రాన వారిని క్షేమంగా వదులుతావని ఎలా అనుకోగలను. కేవలం నా ఇద్దరి పిల్లలను గురించి ఆలోచించి నా దేశం మొత్తం మీదున్న ఆడపిల్లల బ్రతుకులు నాశనం చేయలేను.మీ తెల్లోళ్ళ దురాశకు ఇప్పటికే నాదేశం యాభై ఏళ్ళు వెనుకబడి ఉంది. యువత బానిస మనస్థత్వం తో మగ్గిపోయింది.ఇప్పటికైనా నా లాంటి వాళ్ళు కళ్ళు తెరవకపోతే ముందు తరాలు అర్థం పర్థం లేని మూఢ నమ్మకాలతో కొరగవలసివస్తుంది. నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో…కాని నా చేతికి మాత్రం ఒంటరిగా దొరకవద్దు. ముక్కలుగా నరికేయగలను.
హాల్దియా: అహా అంత దూరం ఆలోచించావా …సరే నీ ఇష్టం….అంటూ ఏయ్ వీళ్ళను ఈ రోజుకు వదిలేయండి. ఇంత తిండీ బట్టా ఇచ్చి చెరో సోపు ముక్కలను పడేయంది. అని ఆర్డర్ చేసి వెళ్ళిపోయింది.
ఇద్దరాడవారూ ఇచ్చిన సబ్బు ముక్కలను బట్టలను తీసుకొని వెళ్ళి పాణి కట్లు విప్పి సపర్యలు చేయసాగారు ఇద్దరు పిల్లలూ .

ఆకాశం మబ్బులు పడుతూ భారీ వర్షానికి సిద్దపడుతోండగా స్వీకృత్ మాన్వితలిద్దరూ ఇంటికొస్తూ ఒకరినొకరు ఏమీ మాటాడుకోలేదు. మాటాడుకోవడానికి ఇద్దరికీ మొహం చెల్ల లేదు. ఇంటికొచ్చేసరికి హవ్యక్ ఆత్రంగా వీరికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడు బయట పడటం లేదు కాని చాలా కృంగిపోయి ఉన్నాడు.మౌనంగా జరిగే వాటిని చూస్తూ ఉన్నాడు. ఇంటి కొస్తూనే గబాగబా ఎదురొచ్చాడు.
అమ్మా, అంకల్ ఏమయ్యింది. నా వాళ్ల జాడ ఏమైన తెలిసిందా మేము ఇక్కడనుండి ఇండియా ఎప్పుడెళ్ళ వచ్చు.అంటూ ప్రశ్నలేసాడు.
వాడిని కన్నీళ్ళతో చూస్తూ రేపటివరకూ ఆగు నాన్నా అని ఆపై మాటాడలేక నోట్లో చెరుగును అడ్డం పెట్టుకొని లొపలకు వెళ్ళి పోయింది మాన్విత.
హవ్యక్ నీరుగారిపోయాడు.
స్వీకృత్ వాడి భుజం చేయినేసి తడుతూ, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము హవ్యక్. ఈ రోజు ఓ ఆఫీసరును ఇంటికి పిలిచాను. ఆయన ద్వారా వివరాలు కనుక్కోవాలి. ఆయన కూడా బుడతకీచులకు చెందిన వాడే అయినా మన పక్షాన ఉన్నాడు. కొద్దిగా డబ్బు ఆస చూపించాను. ఒప్పుకొన్నట్టుగానే ఉన్నాడు. ఎంతయినా అతను మన దేశీయుడు కాదు.అందువల్ల నీవు ఆయన కంటపడకుండా ఉండడమే మంచిది. నిన్ను ఈ రాత్రికి నా ఫ్రెండ్ ఇంటిలో దాచిపెడతాను. ఇబ్బందేమీ లేదుగా అన్నాడు.
హవ్యక్ పరవాలేదన్నట్టుగా తల ఊపి లోపలకెళ్ళి ఏడుస్తూ ఉన్న మాన్వితతో అమ్మా . . అన్నాడు.
వాడు అలా ఆర్ద్రంగా పిలిచిన పిలుపుకు మాన్విత ఉండబట్టుకోలేక పోయింది. భోరున ఏడ్చేసింది.
విశయం ఏమీ తెలియని హవ్యక్ అమ్మ అలా బరస్ట్ అయ్యేసరికి తనూ ఆమెను చుట్టుకొని ఏడ్చేసాడు.

1 Comment

  1. I am all ready read this story at 4 parts upload the remaing story

Comments are closed.