యుద్ధ నీతి 211

ఒళ్ళంతా సుఖం తో మాన్విత పాణి ఒళ్ళో నుండి లేచి మంచి నీళ్ళు తాగడానికి బయటకొచ్చింది.అప్పుడే ఆదర బాదరగా హవ్యక్ కిందకు దిగి వస్తున్నాడు.
ఆమె కంగారుతో ఏమయ్యిందిరా అంటూ అడగబోయెంతలో వాడే అమ్మా ఇంటి చుట్టూ ఏదో జరుగుతోందే ఇందాక నేను చూసాను అంటూ ఇంకా ఏదో చెప్ప బోయేంతలో తుపాకీలు పేల్చిన శబ్దాలయ్యాయి. ఇద్దరూ చటుక్కున కిందకు కూచొని పెద్దగా అరుస్తోంటే ఈలోగా పాణి తన రైఫిల్ ను తీసుకొని ,సుకృతను ధీర్గత్ ను గట్టిగా హెచ్చరిస్తూ గాల్లోకి కాల్పులు జరుపుతూ వీరిద్దరినీ వెనుక వైపునుండి ఇంటి బయటకు పంపేసాడు.
ఆ గలాభాలో ఆలోచించడానికి సమయం లేకపోవడం తో అమ్మా కొడుకులిద్దరూ ఆ చీకటిలో ఇంటికి దూరంగా పారిపోయి అప్పుడే కదులుతున్న షిప్ లోనికి ఎక్కేసారు. అదృష్టానికి అది ఇండీయన్ షిప్, దాని క్యాప్టెన్ స్వీకృత్ దూరం నుండి అంతా చూసాడు కాబట్టి ఆయన వీరిని ఎవరూ ఇబ్బంది పెట్టకుండా తమతో పాటు తీసుకెళ్ళిపోయాడు.
మరునాడు ఉదయానికి దగ్గరలో ఉన్న మైక్రోనేషియా ఐల్యాండ్స్ లో ల్యాండ్ అయ్యిందా షిప్. క్యాప్టన్ స్వీకృత్ కు దాదాపుగా విషయం తెలుసు కాబట్టి తన పరపతితో ఫార్మాలిటీస్ పూర్తి చేసి వీరిని సాదరంగా తన ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడినుండి ఇండియన్ గవర్న్మెంట్ తో కాంటాక్ట్ చేసి విశయం తెలియజేసాడు.
అప్పటి ప్రభుత్వం పరిస్థితులు సర్దుకొనేంతవరకూ వారిని తన దగ్గరే ఉంచుకొమ్మని కల్నల్ పాణి దొరికిన తరువాత వారిని హ్యాండోవర్ చేయమని సూచనలిచ్చింది.
అదే విశయాన్ని మాన్విత కు చెప్పి ఆమెను ఊరడిల్ల జేసాడు.
మాన్వితకు ఎటూ పాలు పోకుండా ఉంది. తన భర్త మిగతా ఇద్దరు పిల్లల క్షేమ సమాచారాలు తెలిసేయంతవరకూ తనకు మనశ్శాంతి లేదు. అందుకే క్యాప్టన్ స్వీకృత్ ను ఏదో విధంగా వారి గురించి వివరాలు కనుక్కోమని ప్రాధేయపడింది.
ఆయన గంభీరంగా చూడండి మాన్విత గారూ వారి ప్రాణాలకు ఎటువంటి హానీ జరగదని మాత్రం నేను కరాఖండిగా చెప్పగలను.ఇండియాలో పోర్చుగీసు వారు తమకున్న కాలనీలను వదులు కోవడాని ఏమాత్రం ఇష్టం లేదు. వారు ఆ ప్రాంతాలను చాలా బాగా డెవలప్ చేసుకొని ఉన్నారు. బ్రిటీషర్స్ లాగా దోచుకోవడం కాకుండా వారు ఆ ప్రాంతాలను తమకు అనుగుణంగా తమ కల్చరును అక్కడ బాగా విస్తరింపజేసుకొని ఉన్నారు. అందువల్ల స్థానికుల నుండి వారికి మంచి సహకారం ఉంది. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో ఇండియన్ గవర్న్మెంట్ నాకు కాల్ చేసేంతవరకూ మనము ఇక్కడే ఉండాల్సి వస్తుంది. మీరేమీ ఇబ్బంది పడనవసరం లేదు. ఇక్కడ అన్ని సౌకర్యాలున్నాయి. పరిస్థితులు కాస్త చక్కబడేంతవరకూ మీరు కాస్త ధైర్యంగా ఉండండి.
మాన్వితా దాదాపుగా ఏడుస్తూ స్వీకృత్ గారూ మీరు నాకు తోడబుట్టిన అన్నయ్యలాంటి వారు . . .ఏదో విధంగా వారి క్షేమ సమాచారాలు కనుక్కోండి.
హవ్యక్ ఏమీ మాటాడకుండా కూచొని ఇద్దరి మాటలూ వింటున్నాడు.
స్వీకృ త్ కాసేపు ఆలోచించి ఈ దీవిలో నాకు తెలిసిన కొంత మంది మిత్రులు ఉన్నారు. వారు కూడా పోర్చుగీసు సైన్యంలో పని చేసిన వారే. . .వీలు చూసుకొని మిమ్మల్ని వారితో పరిచయం చేస్తాను. వారు ఏదైనా సహాయం చేస్తారేమో కనుక్కొందాం సరేనా మీరు కాస్త రెస్ట్ తీసుకోండి.
హలో హవ్యక్ ఈ ఐల్యాండ్ చాలా అందమైనది. ఇక్కడ నీవు బాగా ఎంజాయ్ చేయ వచ్చు గొ అహెడ్ అంటూ కన్ను గొట్టాడు.
హవ్యక్ పేలవంగా నవ్వి ఊరుకొన్నాడు.
స్వీకృత్ లోపలకెళ్ళి ఇద్దరికీ బట్టలిచ్చి ఒక రమ్ము బాటలును తీస్కొని వరండాలో కూచొంటూ వంటవాళ్ళకు ఫుడ్ ఆర్డర్ చేసాడు.
మాన్విత హవ్యక్ లిద్దరూ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టేబల్ పైన ఘుమ ఘుమలాడుతున్న వంటకాలు వీరిద్దరి కోసం ఎదురు చూస్తున్నాయి.
స్వీకృత్ ఇద్దరికీ చెరో పెగ్ ఆఫర్ చేసాడు.మాన్విత మొహ మాడుతోంటే ఏం పరవాలేదు. మీరు కూడా హై ర్యాంక్ అఫీషియల్సే కదా అలవాటు తప్పకుండా ఉంటుంది.కొద్దిగా తీసుకోండి కొద్దిగా రిలాక్స్ అవుతారు. హవ్యక్ కు మీ ముందర తీసుకోవడం మీకు అభ్యంతరం ఐతే అతనికి నేను ఆఫర్ చేయను అన్నాడు.
మాన్విత హవ్యక్ వైపు చూసింది. హవ్యక్ ఏం మాట్లాడకుండా గ్లాసును తీసుకొని చిన్నగా సిప్ చేసి ఫుడ్ తిన సాగాడు.
మాన్వితకు కొద్దిగా బెరుకు పోయింది. తనూ ఒక సిప్ తీసుకొని ఫుడ్ ను తీసుకొనసాగింది.

సుకృతకు ఆశ్చర్యంగా అనిపించింది. తాము స్పృహ లో లేనప్పుడు చేతులు కాళ్ళు కట్టేసి ఇప్పుడేమో తిండి బట్ట ఇస్తున్నారు.అదే మాట నాన్న తో అడిగింది.

1 Comment

  1. I am all ready read this story at 4 parts upload the remaing story

Comments are closed.