టీచర్ కోసం 3 179

మేడం కాని సిద్దు గాడు కాని నన్ను చూడకుండా జాగ్రత్త పడుతూ వున్నా. క్లాస్ లో క్లాస్ లు అన్నీ బానే జరిగాయి. లాస్ట్ పీరియడ్ మేడం వచ్చింది క్లాస్ లోకి నేను వెంటనే బెంచ్ మీద అలాగే తల పెట్టి మేడం కు కనిపించకుండా పడుకున్నా. ఆ సిద్దు గాడు ముందర బెంచ్ లో కుర్చుని ఉన్నట్లు ఉన్నాడు. అందుకే నాకు కనిపించలేదు. నేను అలాగే మేడం ను తప్పించుకుని ఆరోజు కాలేజీ అయ్యాక వినయ్ గాడి బైక్ మీద అలా అలా బయట తిరిగి ఇంటికి వెళ్ళా. ఆ రోజు వినయ్ గాడితో మాటల్లో పడి, మేడం గురించి ఆలోచనే రాలేదు. ఇదే బాగుంది ళే అని వినయ్ గాడితో రేయ్ నేను ఇక్కడే ఉంటాను రా మీ పేరెంట్స్ తో మాట్లాడి రెంట్ ఏంతో చెప్పు అని అన్నా. దానికి వాడు ఏంట్రా అలా అడిగావు, నేను నీ ఫ్రెండ్ ని రా, ఐన నువ్వు రెంట్ కడతా అంటే మా ఇంట్లో నీకు స్థానం లేదు అని అన్నాడు. నేను, సారీ రా మామ ఏదో అలా ఊరికే అడిగా అని సర్ది చెప్పా.

అలా రోజు వాడితో కలిసి కాలేజీ కు వెళ్ళడం, రావడం మేడం కు సిద్దు గాడికి కనిపించకుండా ఉండడం దినచర్య అయ్యింది. నాకు తెలిసీ అప్పటికే నేను వినయ్ గాడి ఇంటికి వచ్చి ఐదు రోజులు అవుతుంది. నేను ఆరోజు కూడా వినయ్ గాడితో కలిసి, ఇంటికి వచ్చా, వాడు వాళ్ళింట్లో కి వెళ్లాడు. నేను పైన ఉన్న నా రూమ్ లోకి వెళ్తూ ఉంటే, అక్కడ నా రూమ్ డోర్ ఓపెన్ లో ఉంది. నెను ఎవరు ఓపెన్ చేశారా అని లోపలకు వెళ్ళా. లొపల ఉన్న మేడం ని చూసి షాక్ అయ్యా. మేడం అక్కడే ఓక చైర్ లో కూర్చుని వుంది. నేను రావడం గమనించి నా వంక చూసింది. నేను బయం తో అలాగె గుమ్మం దగ్గర నిలబడ్డ. మేడం నా వంక చూసి, రండి సర్ మీ కోసమే ఎదురు చూస్తున్నాం. రండి అని అంది. నాకు లొపల గుండె దడ పెరిగిపోతూ ఉంది. మెల్లిగ లోపలకు వెళ్ళా. మేడం నా వంక చూసి, ఆరెరె మీఱేంటి సర్ నిలబడ్డారు కూర్చోండి అని అక్కడే ఉన్న ఇంకొ చైర్ వంక చూపించింది. నేను సైలెంట్ గా వెల్లి కూర్చున్న. మేడం నా వంక సీరియస్ గా చూస్తుంది.
నేను తల దించుకుని ఉన్న. మేడం నా వంక చుస్తూ ఏంటి సర్ తల దించుకుని ఉన్నారు, తల ఎత్తి చుడండి. అని అంది. నేను మేడం వంక చూసా..మేడం నా వైపు చూసి, ఇంటికి ఎందుకు రాలేదు అని అంది. నేను సైలెంట్ గా ఉన్నా. దానికి మేడం చెప్పు ఏంటి మూగోఢీవా అని అంది. నేను భయపడుతూనే నాకు రావాలనిపింఛలేదు అని చెప్పా. మేడం అలాగే కోపంగా చుస్తూ ఎం ఎందుకు అనిపించలేదు అని అంది. నేను దానికి నేను రాను నా ఇష్టం అని అన్నా. అంతే ఒక్కసారిగా నా చెంప చెల్లు మని అంది. నేను నా చెంప మీద చెయ్యి పెట్టుకుని మేడం వంక కోపంగా చూసా, మేడం నా వంక చూసి ఏంట్రా అలా చూస్తున్నావ్ కొడతావా అని అంది. నేను తల దించుకున్నా.

3 Comments

  1. Continue bro Please

  2. Tondarga upload ceyandi bro

Comments are closed.