టీచర్ కోసం 3 179

దానికి మేడం నా చెయ్ విడిపించుకుని క్షమించేంత చిన్న మాట కాదుగా నువ్వు అడిగింది అని మల్లి థన రూమ్ లోకి వెళ్ళిపోతూ ఉంది. నేను మల్లి మేడం ని ఆపి, అయితే ఏదో ఒకటి పనిష్మెంట్ వేయి, అంతే కాని ఇలా మాట్లాడక పోతే ఎలా అని అన్నా. దానికి మేడం పునిష్మెంట్ వేయడానికి నువ్వేమి చిన్న పిల్లాడివా అని అంది. నేను మేడం వంక చూసి మోకాళ్ళ మీద కుర్చుని ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ఏమైనా చెయ్ అంతే కాని మాట్లాడకుండా ఉండోద్ఢు అని అన్నా. మేడం కొద్దిసేపు నా వంక చూసి, సరే నువ్వు అన్న మాటకు పనిష్మెంట్ గా ఐదు వందల గుంజిళ్ళు తీయి అప్పుడు మాట్లాడతాను అని అంది. నేను అమ్మో అయిదు వందల గుంజిళ్ళు ఆ కష్టం అని అన్నా. మేడం కూడా అయితే నాకు కూడా నీతో మాట్లాడడం కష్టం అని అంటూ మల్లి బెడ్రూం వైపు వెళ్లింది. నేను మేడం ను ఆపి తీస్తా ఆగు అని అన్నా.
మేడం నిలబడి సరే తీయి అని అంది. నేను ఇక తప్పక మొదలుపెట్టా గుంజిళ్ళు (sit up’s) తీయడం.
మేడం తంపుగా వెల్లి సోఫా లో కుర్చుని కాలు మీద కాలు వేసుకుని సెల్ చూసుకుంటూ, నేను సిట్ అప్స్ చేయడం మద్య మద్యలో గమనిస్తూ ఉంది. నేను కష్టపడి వంద వరకు చేశా, ఆపైన నాకు మైకం వచ్చింది. ఐన తట్టుకుంటూ గుంజిళ్ళు తీస్తూ ఉన్నా. ఇంకా కష్టపడితే రెండు వందల వరకు వచ్చా. ఆపైన చేస్తూ ఉంటే నా తొడలు నొప్పి పెట్టి, సడెన్ గా స్లిప్ అయి కింద పడ్డా, అప్పుడే మేడం కూడా ఇక చాల్లే అంటూ లేచింది. నేను కింద పడడం చూసి, నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పైకి లేపింది. నేను సరిగా నిలబడ లేక పోయా. అలవాటు లేదు కదా, అన్నీ సార్లు సిట్ అప్స్ చేసే సరికి అలా అయ్యింది. మేడం నన్ను పైకి లేపింది. నేను ఎలాగోలా పైకి లేచి, నేను బాగానే ఉన్నాను అని చెప్పా, మేడం నా వైపు ఒకసారి మొత్తం పరికించి చూసి నేను బాగానే ఉన్నాను అని అర్ధం చేసుకుని సరే నిద్రపో రేపు మాట్లాడుకుందాం అని అంటూ థన రూమ్ లోకి వెళ్లిపోయింది. నాకు ఒక పక్క హాపీ గా ఉన్నా ఇంకొ పక్క తొడలు నొప్పిగా ఉన్నాయి. ఐన ఆ నొప్పి ఇప్పుడు అంతగా తెలియడం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మేడంకు నా మీద అలక పోయింది కాబట్టి.

ఆ ఆనందం లో మేడం ఉసులే తలుచుకుంటూ నా బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయ. ఇప్పుడు మనసు చాలా హాయిగా ఉంది. కాని తొడలే బీభత్సంగా నొప్పి పెడుతున్నాయి. అప్పుడు అనిపించింది, కత్తులు అవసరమ్ లేదు, గన్స్ అవసరం లేదు, బాంబులు అవసరం లేదు, పెద్ద పెద్ద ప్లన్స్ ఏమి అవసరం లేదు, జస్ట్ మౌనం చాలు ఆడవారికి. మగాడిని గింగిరాలు కొట్టించాలి అంటే అని అనుకున్నా.. ఆడాళ్ళందరికి నా జోహార్లు అని అనుకుంటూ నిద్రపొయ.
లేచి చూస్తే టైం పన్నెండు. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని గడ గడ నీళ్ళు తాగేశా. బెడ్ మీద పడి, కళ్ళు మూసుకున్నా. కాని నిద్ర రావడం లేదు. ఇంతసేపు వచ్చిన కలనే గుర్తు వస్తుంది. ఈ మద్య కలలు ఎక్కువ వస్తున్నాయ్. అది కూడా మేడం మీదనే వస్తున్నాయ్. నాకు వచ్చిన కలను నేనె నమ్మలేక పోతున్నా అందుకేనేమో అది కల అయ్యింది. ఏదైతే ఏమి, మంచి కల మల్లి వచ్చింది. థాంక్స్ గాడ్ అని మనసులో చెప్పుకుని కళ్ళు మూసుకున్నా. ఇప్పుడు నా కళ్ల ముందు ఇందాక వచ్చిన కల కనిపిస్తుంది. కల ఎక్కడ నుండి మొదలు అయ్యిందో తెలీదు కాని, నాకు గుర్తు వున్న దగ్గర నుండీ మొదలు పెడితే.
కల నాకే విచిత్రంగా అనిపించింది. మీకు అనిపించడం లో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకు విచిత్రంగా అనిపించిందో ముందు ముందు మీకే తెలుస్తుంది…

3 Comments

  1. Continue bro Please

  2. Tondarga upload ceyandi bro

Comments are closed.