డస్టుబిన్ 639

కానీ చాల వరస్ట్ క్యారెక్టర్ కాబట్టి, “నా అస్సలు పెళ్ళాం పిల్లలతో బిజీ గా ఉన్నాలే కానీ, అది నా కూతురేనా లేక ఇంకెవడికో పుట్టిందా”, అని అనుమానంగా అడిగాడు మోహనరావు. “అలా అంటావేమి బాబు, పాపం నీ పెళ్ళాం స్వర్గానికి వెళ్ళిపోయింది, ఆమె పై అనుమాన పడకుడదు, ఇప్పుడు నీ కూతురు ఇక్కడే ఒక్కతే ఉంది. అచ్చం నీ పోలికే. పేరు శ్వేత”, అని అన్నాడు సర్పంచ్. “సరేగాని, నా ఫోన్ నెంబర్ నీకేలాగ దొరికింది?”, అని అడిగాడు మోహనరావు. “నీ అమ్మాయి శ్వేత ఫేస్బుక్ లో వెతికితే, నీ పేరు, ఊరు, వ్యాపారం, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని దొరికాయి. పాపం కన్నెపిల్ల మొన్నే పెద్దమనిషి అయింది. చూసుకోడానికి ఎవరు లేరు. నాన్నకోసం బాగా వెతికి నీ జాడ కనుకుంది, ఇదిగో పక్కకే ఉంది మాట్లాడు”, అంటూ ఫోన్ శ్వేతకి ఫోన్ ఇచ్చాడు సర్పంచ్.
ఫోన్ తీసుకున్న శ్వేత, “హలో డాడీ, బాగున్నారా?, నేను శ్వేతని, మీ కూతురిని డాడీ”, అంటూ మాట్లాడింది. కాస్త ఇబ్బంది పడ్డ మోహనరావు, “ఆ…, బాగున్నావా…”, అని అడిగాడు. ” లేదు డాడీ, అమ్మ ఇంక మనతో లేదు, నాకేమో ఎవరు లేరు. మిమ్మల్ని ఒక్క సారి చూడాలని ఉంది”, అని అడిగింది. వామ్మో మల్లి ఇప్పుడు ఒక్క కొత్త టెన్షన్ ఎందుకని భయపడ్డ మోహనరావు, అస్సలు మాట్లాడేది తన కూతురేనా లేక ఇంకెవరైనా?, అని అనుమానం వచ్చి, ” సరేలే చూదాం, ఫోన్ సర్పంచ్ గారికి ఇవ్వు..”, అని అన్నాడు.
ఫోన్ తీసుకున్న సర్పంచ్, “ఇదిగో మోహనరావు, ఉన్నట్టుండి పద్దెనిమిదేండ్ల అమ్మాయి ఫోన్ చేసి నాన్న అంటే ఎవరికైనా భయమవుతుంది, కానీ కనీసం ఒక్కసారి వచ్చి కలిసి, అమ్మాయికి అవసరమైన వసతులకు ఏర్పాటు చేసైనా వేళ్ళు. లేదంటే అస్సలే అందమైన కన్నెపిల్ల, రోజులు బాగాలేవు, ఈ సారి నువ్వు పట్టించుకోక పోతే ఏ పెద్దాపురంలోనో వెళ్లి పడుతుంది, అప్పుడు నువ్వే భాదపడతావు”, అని అనగానే,, “ఆ సరే సర్పంచ్ గారు, రేపే ఉరికి వచ్చి అమ్మాయికి కావలసిన డబ్బిచ్చి వెళ్తాలే”, అంటూ తనకి డబ్బుకోరవ లేదనట్టు విసుగ్గా చెప్పాడు మోహనరావు. “అన్నట్టు, అమ్మాయి ఇప్పుడు కాకినాడలో గోవేర్నమెంటు హాస్టల్లో ఉంటుంది. అక్కడే నువ్వు శ్వేత ని కలవచ్చు. మీ ఇద్దరిని కలిపి నేను చెయ్యాల్సిన పని చేసాను ఇక మిగితగా విషయాలు మీరే మాట్లాడుకుని మీరు ఎం చేసుకుంటారో చేసుకోండి”, అంటూ ఫోన్ పెట్టేసాడు సర్పంచ్.

శ్వేత ఉండే హాస్టల్ నుండే మోహన్రావుకి ఫోన్ చేసాడు సర్పంచ్. మోహన్రావుకి తన కూతురు శ్వేత ఫోన్ నెంబర్ ఇచ్చి, కాల్ పెట్టేసాక, “హమ్మయ్య, మొత్తానికి మీ ఇద్దరు కలిశారు, ఇప్పుడు సంతోషమేగా”, అని శ్వేతని అడిగాడు సర్పంచ్. “చాలా థాంక్స్ సర్పంచ్ గారు, కానీ అనవసరంగా పెదపురం అని నాన్నని బయపెట్టినట్టున్నారు”, అని కాస్త దిగులుగా చెప్పింది శ్వేత. “నీకు తెలీదు లే కానీ, అలా చెప్పక పోతే మీ నాన్న నిన్ను కలవడానికి ఒప్పుకునే వాడే కాదు. అది కాకుండా, ఈ చుట్టూ పక్కల ఊర్లల్లో అనాధ బాలికలు అందరూ గతిలేక పోయి పెదపురం లో సెటిల్ అవుతారు. అట్లాంటి అమ్మాయిలని వెతకడానికి మరి ప్రత్యేకంగా సాని కొంపలు నడిపే వారు బృందాలు గా విడిపోయి అన్ని ఊర్లు వెతుకుతుంటారు. మొదట్లో డబ్బుకోసం, ఆ తరువాత దిక్కులేక వాళ్ళ వలలో పడి, ఎందరో అమ్మాయిలు అక్కడికి వెళ్లి వొళ్ళు అమ్ముకుని ఉండిపోతారు. నువ్వు అలంటి దానివేమీ కాదు అని నాకు తెలుసు, మంచి బట్టల షాపులో గర్వంగా పని చేస్తూ నీ కాళ్ళ పై నువ్వే నిలదొక్కుకున్నావు, ఇంత అందం పెట్టుకుని ఏ సినిమా హీరోయిన్ కావాల్సిన దానివి, కానీ నీ లాంటి అందమైన అమ్మాయిలే కావాలి పెదపురం కొంపల్లో, అందుకే పెద్దమనిషి గా చెబుతున్న, ఎవరు ఎన్ని మాటలు చెప్పిన, ఎన్ని కట్టుకథలు చెప్పిన, ఎంత డబ్బు ఎర చూపిన, పాడు పనులు చేయడానికి అస్సలు ఒప్పుకోకు, మీ నాన్న తొందరగా రావడానికి ఊరికే పెదపురం పేరు చెప్పి భయపెట్టడానికి అలా చెప్పనమ్మా”, అని అన్నాడు సర్పంచ్.
“మీరు ఏది చేసిన నా మంచి కోరే చేస్తారు అని నాకు తెల్సు సర్పంచ్ గారు, బట్టల షాప్ అంటే గుర్తొచ్చింది, నేను బట్టల షాపుకి వెళ్లే టైం అవుతుంది, మరి మీరు కాకినాడలో ఎక్కడ బస చేస్తున్నారు?”, అని అడిగింది. “నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు చాలానేఉన్నారు…. ఇక వెళ్లి నేను నా పనులు చూసుకుంటా. రేపు మీ నాన్నని కలిసాక ఏమ్మన్నాడో మల్లి నాకు ఫోన్ చేసి చెప్పు. సరే నా? ఇక నేను వెళ్ళొస్తా”, అంటూ సర్పంచ్ వెళ్ళిపోయాడు.