రాములు ఆటోగ్రాఫ్ – 44 181

రాము అక్కడ నుండి లేచి అక్కడ రాయి మీద రెండు చేతి వేళ్ల ముద్రలు రక్తంతో ఉండటం చూసాడు.
అక్కడ ఉన్న అతను రాము వైపు చూసి, “సార్…హంతకుడు గ్లౌస్‍లు వేసుకున్నాడు….ఫింగర్ ప్రింట్లు ఏవీ దొరకలేదు,” అన్నాడు.
రాము అలాగే చూస్తూ ముందుకు వెళ్ళేసరికి ఒక చెప్పు కనిపించింది.
అది చనిపోయిన నారాయణది అని అర్ధం అయిన రాము ఎదురుగా చూసి అక్కడ ఉన్న చెత్త మధ్యలో ఒక లైన్‍లో పక్కకు తొలగినట్టు ఉండటంతో హంతకుడు చంపే ముందు నారాయణని ఈడ్చుకొచ్చాడని అర్ధమయింది.
దాంతో రాము ఆ చెత్తను చూస్తూ ముందుకు వెళ్లాడు.
అక్కడ ఉన్న ఒక పిల్లర్ మిద రక్తం మరకలు చూసి అర్ధమయినట్టు తల ఊపాడు.
అది చూసి ప్రసాద్, “సార్….ఏమైనా క్లూ దొరికిందా,” అన్నాడు.
రాము అవునన్నట్టు తల ఊపుతూ, “ఇక్కడ జరిగింది నాకు అర్ధమయింది చెబుతాను….పొద్దున్నే ఆ సైంటిస్ట్ నారాయణ గారు….వాకింగ్‍కి వచ్చి ఉండాలి…ఇక్కడకు రాగానే హంతకుడు అతన్ని పట్టుకుని ఈ పిల్లర్‍కి ఉన్న లైట్ కేసి కొట్టి….అలాగే ఈ పిల్లర్‍కి తల పట్టుకుని కొట్టిన తరువాత…ఆయన్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి అక్కడ గోడకు ఉన్న ఇనుపసువ్వని గొంతులో దిగబడేలా చేసి చంపేసాడు…కాకపోతే నారాయణని చంపే ముందు కొట్టాడు,” అంటూ ఇంతకు ముందు రక్తపుమరకలతో ఉన్న చేతి గుర్తులు ఉన్న రాయి దగ్గరకు వచ్చి, “ఇప్పటిదాకా జరిగిన హత్యలకు, ఇప్పుడు జరిగిన హత్యకు ఒక పెద్ద తేడా ఉన్నది…” అన్నాడు.
ప్రసాద్ : ఏంటి సార్ అది…..
రాము : మర్డర్ చేసి దొరికిపోగూడదని చేతికి గ్లౌసెస్ వేసుకున్నాడు….కాని హంతకుడు మాత్రం ఇపుడు జరిగిన ఈ హత్యకు….ఇంతకు ముందు జరిగిన రెండు హత్యలకు లింక్ ఉన్నది మనకి చెప్పాలని ట్రై చేస్తున్నాడు…..
ప్రసాద్ : నాకు మీరు చెప్పేది అర్ధం కావడం లేదు….వేరే వేరే వాళ్ళు హత్యలు చేస్తున్నారు…కాని హత్యలు మాత్రం ఒకే ప్యాట్రన్‍లో జరుగుతున్నాయి….చాలా కన్‍ఫ్యూషన్‍గా ఉన్నది….మర్డర్లన్నీ మళ్ళి ఒకేలా ఉంటున్నాయంటున్నారు….
రాము : నాకు అదే అర్ధం కావడం లేదు ప్రసాద్….ఇంతకు ముందు మనం చూసిన హత్యలు కోపంతోనో, కోరికతోనో చేసినవి…కాని ఈ హత్య మాత్రం క్లియర్‍గా ఒక మోటివ్ కనిపిస్తున్నది…(అంటూ అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఇద్దరూ అక్కడ నుండి బయలుదేరారు.)
అక్కడ నుండి బయలు దేరిన రాము, ప్రసాద్ తిన్నగా హత్య చేయబడిన నారాయణ వాళ్ళింటికి వచ్చారు.
అప్పటికే తన స్టాఫ్ నారాయణ భార్యతో మాట్లాడుతున్నారు.
మిగతా వాళ్ళు ఇంట్లో ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో అని వెదుకుతున్నారు.
ఇద్దరు కానిస్టేబుల్స్ ఇంట్లో పని వాళ్లను ఎంక్వైరీ చేస్తున్నారు.
రాము ఇంట్లోకి వచ్చి మొత్తం చూస్తూ నారాయణ టేబుల్ దగ్గరకు వచ్చి టేబుల్ మీద ఉన్న వస్తువులను, పేపర్లను చూస్తూ సొరుగులు తీసి చూస్తుండగా రివాల్వర్ కనిపించడంతో దాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు.
రాము ఆ రివాల్వర్ తీసుకుని పక్కనే ఉన్న కానిస్టేబుల్‍కి ఇచ్చి, “దీని సీరియల్ నెంబర్ రికార్డ్ చేసి…వివరాలు కనుక్కో …ఎప్పుడు అప్లై చేసారు….ఈయన చేతికి ఎప్పుడు వచ్చింది….అన్నీ కనుక్కో….,” అన్నాడు.
కానిస్టేబుల్ సరె అని రివాల్వర్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
రాము అక్కడ ఉన్న పుస్తకాల్లో సైకలాజిస్ట్ సతీష్ రాసిన బుక్ కనిపించేసరికి దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తున్నాడు.
అంతలో నారాయణ కొడుకుని పిలిచి, “ఈ పుస్తకం బాగా చదువుతారా,” అనడిగాడు రాము.
“అవును సార్….మా నాన్నగారు….ఈ బుక్ గురించి నాతో ఒకసారి చెప్పారు….ఆయన పేరు కూడా సతీష్….మరి దీన్ని పూర్తిగా చదివారో లేదో నాకు తెలియదు సార్…..” అన్నాడు.
రాము : ఈయన సెమినార్స్ కండక్ట్ చేస్తుంటారు….ఎప్పుడైనా మీ నాన్నగారు వెళ్లారా….
అతను : నాకు తెలిసి వెళ్ళలేదనే అనుకుంటున్నా సార్…మా నాన్న గారు స్టాన్‍ఫోర్డ్‍లో సెమినార్లు ఇస్తుంటారు… అలాంటి ఆయన ఇలాంటి సెమినార్లకు వెళ్లరనే అనుకుంటున్నా….
రాము సరె అని తల ఊపుతూ అక్కడ నుండి ప్రసాద్‍ని తీసుకుని సతీష్ సెమినార్లు జరిగే హోటల్‍కి వెళ్ళాడు.
అక్కడ రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళి, “సతీష్ గారిని కలవాలి,” అనడిగాడు రాము.
రిసెప్షనిస్ట్ : సార్…ఇప్పుడు సెమినార్‍లో ఉన్నారు….కొద్దిసేపు కూర్చోండి సార్…..
దాంతో రాము, ప్రసాద్ అక్కడ ఉన్న సోఫాలో కూర్చుని సతీష్ కోసం ఎదురుచూస్తున్నారు.
అలా పావుగంట ఆగిన తరువాత సతీష్ తన సెమినార్ పూర్తి చేసుకుని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ బయటకు వచ్చాడు.
రిసిప్షన్ : excuse me sir…..(సతీష్ ఏంటి అన్నట్టు ఆమె వైపు చూడగానే….ఆమె రాము వాళ్ళ వైపు చూపిస్తూ…) మిమ్మల్ని కలవడానికి వచ్చారు…..
ఆమె అలా అనగానే సతీష్ తల తిప్పి అటు వైపు చూసాడు.
ప్రసాద్ సోఫాలో నుండి పైకి లేచి, “హలో సార్….ఎలా ఉన్నారు,” అంటూ విష్ చేసాడు.
కాని సతీష్ అతని మాటలకు సమాథానం ఇవ్వకుండా రాము వైపు చూస్తూ, “నాతో రండి,” అంటూ తన కేబిన్ లోకి వాళ్లను తీసుకెళ్ళాడు.
వాళ్ళు కేబిన్ లోకి వెళ్ళిన తరువాత సతీష్ తన చైర్‍లో కూర్చుంటూ, “కూర్చోండి…..” అంటూ చైర్స్ వైపు చూపించాడు.

1 Comment

Comments are closed.