రాములు ఆటోగ్రాఫ్ – 44 181

సతీష్ : నేను తల్చుకుంటే ఏం చేయగలనో నీక్కూడా తెలియదు…నా లాయర్‍తో చెప్పి కేసు వేసానంటే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది…అనవసరంగా నన్ను డిస్ట్రబ్ చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో…..
రాము : నీకు అంత కొరికగా ఉంటే పెట్టి చూడు…నాకు ఈ కేసులు కొత్తేం కాదు…అయినా ఇక నీతో మాటలు అనవసరం అని తేలిపోయింది…నిన్ను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు….బెస్ట్ ఆఫ్ లక్….(అంటూ అక్కడ నుండి బయటకు వచ్చేసాడు.)
బయటకు వచ్చిన రాముని చూసి ప్రసాద్ కార్లో కూర్చుని స్టార్ట్ చేసి రాము కారు ఎక్కగానే పోనిస్తూ, “ఏమయింది సార్…మళ్ళీ లోపలికి వెళ్లారేంటి,” అనడిగాడు.
“ఏం లేదు ప్రసాద్….Too many co-incidents….ఈ సతీష్‍ని బాగా observe చేసి లాక్ చేయాలి….అన్నిటి కన్నా ముఖ్యమైనది ఏంటంటే…ఇంకో మర్డర్ జరగక ముందే వీడిని ప్రాణాలతో పట్టుకోవాలి…..” అన్నాడు రాము.
అప్పటి నుండి రాము చెప్పినట్టు కానిస్టేబుల్స్ ముగ్గురు మఫ్టీలో సతీష్‍ని ఫాలో చేస్తూ అతన్ని observe చేయడం మొదలుపెట్టారు.
అతని డైలీ యాక్టివిటీస్….మొత్తం రిపోర్ట్ ఏ రోజుకారోజు రాముకి రిపోర్ట్ చేయడం మొదలుపెట్టారు.
వారం రోజుల నుండీ సతీష్ ప్రవర్తనలొ పూర్తిగా మార్పు వచ్చిందని రాముకి అర్ధమైపోయింది.
ఒక రోజు రాత్రి సతీష్ మెడికల్ షాప్‍లో నుండి మెడిసిన్స్ తీసుకుని బయటకు వచ్చి కారు డోర్ తీయబోతుండగా ఆటోలో నుండి ఒకతను దిగి కత్తి తీసి సతీష్ని పొడవడానికి ట్రై చేసాడు.
సతీష్ వెంటనే తేరుకుని అతని కత్తి పోటు నుండి తప్పించుకున్నాడు.
అది చూసి అక్కడ టిఫిన్ బండి దగ్గర టిఫిన్ తింటున్న వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని ఆపడానికి ట్రై చేసారు.
కత్తి దాడి చేసిన అతను ఇంతకు ముందు సెమినార్‍లో తనను మోసం చేసాడంటూ సతీష్ మీద గొడవ పెట్టుకున్నవాడు.
“డబ్బులు అడిగితే ఇవ్వవా….ఇప్పుడు నీ ప్రాణం తీస్తా,” అంటూ అతను మళ్ళీ సతీష్ మీద దాడి చేసాడు.
కాని సతీష్ వెంటనే అతని చేతిని గట్టిగా పట్టుకుని మొహం మీద గుద్దాడు.
అతను వెంటనే పైకి లేచి సతీష్ చేతిలో ఉన్న మెడిసిన్ కవర్, దానితో పాటు కింద పడ్డ సతీష్ వాలెట్ తీసుకుని పరిగెత్తడం మొదలుపెట్టాడు.
దాంతో సతీష్ వెంటనే అతని వెనకాల పరిగెడుతూ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు.
అప్పుడే ఇంటికి వెళ్తున్న ప్రసాద్ వెంటనే కారు ఆపి అక్కడ నిల్చున్న వాళ్ళతో, “ఏమయింది….” ఆడిగాడు.
“కత్తి చూపించి….డబ్బులు అడుగుతున్నాడు సార్….” అన్నారు అక్కడ వాళ్ళు.
ప్రసాద్ వెంటనే ఫోన్ తీసి కంట్రోల్ రూమ్‍కి ఫోన్ చేసి విషయం చెప్పి అక్కడ స్పాట్‍లో ఉన్న వాళ్లను అలెర్ట్ చేసాడు.
సతీష్ అతని వెనకాలే పరిగెడుతూ, “ఏయ్…ఆగు….నా వాలెట్ ఇచ్చెయ్….” అంటూ అరుస్తున్నాడు.
కాని అతను మాత్రం పట్టించుకోకుండా అలాగే పరిగెడుతూ పాత గోడౌన్ లోకి పరిగెత్తాడు.

సతీష్ ఇంకా స్పీడ్‍గా అతని వెనకాల పరిగెత్తి అతన్ని పట్టుకున్నాడు.

కాని అతను వెంటనే సతీష్ పట్టు నుండి విడిపించుకుని కిందకు తోసి పక్కనే ఉన్న ఒక బకెట్ తీసుకుని సతీష్ మిదకు విసిరేసాడు.
సతీష్ వెంటనే పక్కకు తప్పుకోవడంతో అది అతని మీద పడలేదు.
కాని అందులో ఉన్న మట్టి, మురికి నీళ్ళు మాత్రం సతీష్ మీద పడ్డాయి.
దాంతో సతీష్‍ చాలా ఇరిటేషన్ అయ్యి తన ఒంటి మీద దుమ్ముని దులుపుకుంటున్నాడు.
అంతలో సతీష్ మీద కత్తి దాడి చేసిన అతను కొంచెం దూరం పరిగెత్తి అక్కడ చాటుగా నిల్చున్న ప్రసాద్‍కి తన చేతిలో ఉన్న సతీష్ వాలెట్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
ప్రసాద్ వెంటనే ఆ వాలెట్‍ని ఒక పాలిథిన్ కవర్‍లో వేసి పాకెట్‍లో పెట్టుకున్నాడు.
అలా ఒంటి మీద దుమ్ము దులుపుకుంటూ లేచిన సతీష్ చుట్టూ చూసిన అతనికి తాను ఇంత చీప్ లొకాలిటీలో ఉన్నందుకు చాలా ఇరిటేషన్‍తొ చిరాగ్గా గట్టిగా అరిచాడు.
అసలే బాగా ఇరిటేషన్‍గా ఉన్న సతీష్‍కి కుక్క అరుస్తున్న సౌండ్ వినిపించి వెనక్కు తిరిగి చూసాడు.
కొద్దిదూరంలో తన పెంపుడు కుక్కని రాము పట్టుకుని నిల్చోవడం చూసి ఆశ్చర్యపోయి….ఇదంతా తనను పట్టుకోవడానికి అతను వేసిన ట్రాప్ అని అర్ధం చేసుకోవడానికి సతీష్‍కి ఎంతోసేపు పట్టలేదు.
రాము చిన్నగా సతీష్ వైపు నడుచుకుంటూ వస్తూ, “ఏంటి సతీష్ గారు….డ్రస్‍కి బాగా మురికి అంటుకున్నట్టున్నది…” అన్నాడు.
కాని రాము చేతిలో ఉన్న బెల్ట్ ని విడిపించుకుని సతీష్ మీదకు దూకుదామనట్టు కుక్క విపరీతంగా మొరుగుతున్నది.
సతీష్ కూడా ముందుకు వచ్చి దాని అరుపులు వినలేక ఇరిటేషన్‍లో అక్కడ ఉన్న రాడ్ తీసుకుని కుక్కని కొట్టి చంపేసాడు.
కుక్కను చంపిన తరువాత సతీష్ తన చేతిలో ఉన్న రాడ్‍తో రాము మీదకు వస్తుండే సరికి అప్పటి దాకా అక్కడే దాక్కున్న అతని టీం ప్రసాద్, పోలీసులు వచ్చి సతీష్‍ని గట్టిగా పట్టుకున్నారు.
సతీష్ గట్టిగా నవ్వుతూ రాము వైపు చూస్తున్నాడు.
ప్రసాద్ వెంటనే అతని చేతిలో ఉన్న రాడ్ తీసుకుని అతని చేతులకు సంకెళ్ళు వేసి తీసుకెళ్ళిపోయాడు.
తరువాత రోజు సెల్‍లో ఉన్న సతీష్ దగ్గరకు ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు.
ఒక కానిస్టేబుల్ చేత్తో హ్యాండ్‍కఫ్స్ పట్టుకుని సతీష్ దగ్గరకు వచ్చి అతని చేతులకు బేడీలు వేస్తున్నాడు.
సతీష్ అతని వైపు చూస్తూ, “నీకు కొత్తగా పెళ్ళి అయినట్టున్నది కదా,” అన్నాడు.
దాంతో అతను ఆశ్చర్యంగా సతీష్ వైపు చూసాడు.
అది గమనించిన ఇంకో కానిస్టేబుల్, “శ్రీను….వాడితో మాట్లాడకు….మెదలకుండా బేడీలు వేసి తీసుకురా,” అన్నాడు.
కానిస్టేబుల్స్ ఇద్దరూ సతీష్‍ని సెల్‍లో నుండి బయటకు తీసుకువచ్చి అతని హైట్, బర్త్ మార్క్స్, ఫింగర్ ప్రింట్లు తీసుకున్నారు.
అంతలో హెడ్ కానిస్టేబుల్ తన టేబుల్ మీద రిజిస్టర్ ఒకటి తీసుకుని సతీష్ ముందుకు తోస్తూ, “ఇక్కడ సంతకం పెట్టు,” అన్నాడు.
సతీష్ పెన్ను తీసుకుని సగం సంతకం చేస్తూ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా ఆ సంతకాన్ని కొట్టేసి ఇంకో సంతకం చేసాడు.
తరువాత కానిస్టేబుల్స్ సతీష్ ని మళ్ళి సెల్‍లో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయారు.
సతీష్ ఫోటోలను, ఫింగర్ ప్రింట్లని, బర్త్ మార్క్స్, సంతకం చేసిన వాటిని మొత్తం డిజిటలైజేషన్ చేసి రాముకి ఫోన్ చేసి చెప్పారు.
రాము తన కేబిన్‍లో లాప్‍టాప్ ఓపెన్ చేసి మహారాష్ట్ర పోలీస్ పోర్టల్ ఓపెన్ చేసి తన ఐడి, పాస్‍వర్డ్ కొట్టి ఎంటర్ అయ్యి సతీష్ డీటైల్స్ చూస్తున్నాడు.
పక్కనే ప్రసాద్ కూడా నిలబడి సతీష్ తాలుకు డీటైల్స్ చూస్తున్నాడు.
సతీష్ ఒక సంతకం చేస్తూ కొట్టేసి మళ్ళీ సంతకం చేసిన ఫోటోని ప్రసాద్‍కీ చూపిస్తూ, “ఇది సతీష్ సంతకం కొట్టేసి మళ్ళీ చేసాడు….ముందు పెట్టిన సంతకాన్ని మన ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్‍కి పంపంచండి….అది ఎవరిదో…ఏం పేరో తెలుస్తుంది,” అన్నాడు.
ప్రసాద్ సరె అని వెళ్ళి అరగంట తరువాత వచ్చి, “సార్….ముందు పెట్టి కొట్టేసిన సంతకం మన ఫోరెన్సిక్ రిపోర్ట్ ల ప్రకారం ఈ సంతకం వెంకట్ అనే పేరు మీద వస్తున్నది…ఒక వ్యక్తి మర్చిపోయి వేరే సంతకం ఎప్పుడు పెట్టగలడంటే…. ఒక కారణం అతను పేరు మార్చుకుని అయినా ఉండాలి….లేదా న్యూమరాలజీ ఫాలో అవుతుంటే సంతకం అయినా మార్చి ఉండాలి….కాని ఇక్కడ ఈ రెండూ సతీష్ చేసే చాన్స్ లేదు సార్,” అన్నాడు.
రాము : ప్రసాద్ చెప్పింది విన్న రాము తల ఊపుతూ, “సో…ఇప్పుడు మన ముందు ఉన్న కొశ్చన్ ఏంటంటే….ఇది ఎవరి పేరు…ఈ సంతకం సతీష్ ఎందుకు చేయాల్సి వచ్చింది….
ప్రసాద్ : ఇది మనల్ని డైవర్ట్ చేయడానికి సతీష్ ఆడుతున్న నాటకం అయినా అయిఉండొచ్చు కదా సార్….
రాము : లేదు ప్రసాద్….నేను మూడు నెలలుగా ఈ కేసు స్టడీ చేస్తున్నాను….ఇది డైవర్ట్ చేసే నాటకం కాదు…అలా ఆలోచిస్తే మళ్ళీ మనం మొదటికే వస్తాం….ఎటు వెళ్లాలో తెలియదు….కాబట్టి మనం ఈ రూట్‍లో వెళ్లడమే బెటర్….
ప్రసాద్ : కాని సార్….మనం ఎవరైన వ్యక్తి కోసం వెదకడం అంటే కుదురుతుంది…కాని ఒక సంతకాన్ని పట్టుకుని ఎలా వెదుకుతాం సార్….అంతా అయోమయంగా ఉన్నది….మొత్తం స్టేట్‍లో ఎంతమంది వెంకట్‍లు ఉంటారు… అసలు ఈ వెంకట్ అనే వాడు మన స్టేట్ వాడేనా….లేక వేరే స్టేట్ వాడో తెలియదు…అప్పుడు మనం దేశం మొత్తం వెదకాల్సి వస్తుంది….

1 Comment

Comments are closed.