రాములు ఆటోగ్రాఫ్ – 44 181

రాము చైర్‍లో కూర్చుంటూ టేబుల్ మీద ఉన్న యాష్ ట్రేలో మోర్ సిగిరెట్ చూస్తూ అలానే ఆలోచిస్తున్నాడు.
మోర్ సిగిరెట్ చూసున్న రాముకి ఇంతకు ముందు జిమ్ ట్రైనర్ అశోక్, మేకప్ మేన్ సుబాని కూడా ఇలాగే మోర్ సిగరెట్ తాగుతున్నట్టు గుర్తుకొచ్చింది.
దాంతో రాముకి ఏదో తేడా కొడుతున్నట్టు అనిపించి సతీష్ తో, “సతీష్ గారు…..” అన్నాడు.
సతీష్ వెంటనే రాము వైపు, “ఏంటి,” అన్నట్టు చూసాడు.
రాము అతని వైపు కొంచెం ఆందోళనగా చూస్తూ, “మీరు బాగానే ఉన్నారు కదా,” అనడిగాడు.
“ofcourse…..నేను బాగానే ఉన్నాను….మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది,” అంటూ సతీష్ తన రివాల్వింగ్ చైర్‍లో వెనక్కు వాలి రాము వైపు చూసి నవ్వుతూ, “మీకు ఏమయింది….మీరే ఏదో టెన్షన్‍గా ఉన్నట్టున్నారు,” అన్నాడు.
రాము అలా ఎందుకు అడిగాడో….అతని మొహంలో కంగారు చూసి ప్రసాద్ కూడా వాళ్ళిద్దరి వైపు అయోమయంగా చూస్తున్నాడు.
“చెప్పండి రాము గారు….ఇంతకు ముందు సెమినార్‍కి వచ్చారు కదా….ఎలా ఉన్నారు….హెల్త్ అంతా సెట్ అయిందా,” అంటూ సతీష్ టేబుల్ మీద మోర్ సిగరెట్ పాకెట్ తీసుకుని అందులొ నుండి ఒక సిగిరెట్ తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు.
అది చూసిన రాము, “సతీష్ గారు….మీరు ఎమీ అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా,” అన్నాడు.
“తప్పకుండా…ఏమడగబోతున్నారు,” అంటూ సతీష్ సిగిరెట్ వెలిగించుకోవడానికి లైటర్ తీసుకున్నాడు.
రాము అతని చేతిలో ఉన్న మోర్ సిగిరెట్ వైపు చూస్తూ, “మీరు ఇప్పుడే స్మోక్ చేస్తున్నారా….లేకపోతే ఎప్పటి నుండో మీకు ఈ అలవాటు ఉన్నదా….” అనడిగాడు.
రాము అలా అడగగానే సతీష్ ఒక్కసారి తన చేతిలో ఉన్న సిగరెట్ వైపు, రాము వైపు ఒకసారి చూసి, “ఇదివరకు ఉండేది…వదిలేసాను…మళ్ళీ ఇప్పుడే మొదలుపెట్టాను….” అంటూ తన చేతిలో ఉన్న సిగిరెట్, లైటర్‍ని తిరిగి టేబుల్ మీద పెట్టేసాడు.

“మీకు సైంటిస్ట్ నారాయణ తెలుసా….” అంటూ రాము పరిశీలనగా సతీష్ మొహంలోకి చూసాడు.

రాము అలా అడగ్గానే సతీష్ ఆలోచిస్తున్నట్టు కళ్ళు మూసుకుని మళ్ళి రాము వైపు చూస్తూ, “సైంటిస్ట్ అంటే….ఏ డిపార్ట్ మెంట్‍కి సైంటిస్ట్….అయినా ఈ పేరు ఎక్కడో విన్నట్టున్నదే,” అన్నాడు.
రాము : న్యూరాలజీలో టాప్ మోస్ట్ సైంటిస్ట్….మొదడు….దానికి సంబంధించిన ఫంక్షనింగ్‍లో బాగా ఫేమస్…..
సతీష్ : సారీ రామూ గారు….నాకు తెలియదు….
రాము : వాళ్ళింట్లో సైకాలజీ మీద మీరు రాసిన బుక్ ఒకటి దొరికింది….అందుకని మీకు ఏమైనా తెలుసేమో అని అడుగుతున్నాను…అందుకనే అతను ఇంతకు ముందు మీ సెమినార్ అటెండ్ అయ్యారా….లేక మీకు పరిచయం ఏమైనా ఉన్నదా…..
రాము అలా అడుగుతున్నప్పుడు సతీష్ తన టేబుల్ మీద ఉన్న టిష్యూ పేపర్ బంచ్ లోనుండి ఒకటి తీసుకుని దానితో గ్లాసు పట్టుకుని నీళ్ళు తాగుతున్నాడు.
రాము అలా సతీష్ ని అడుగుతూ టిష్యూ పేపర్‍తో గ్లాసు పట్టుకోవడం చూసి….ఇంతకు ముందు బార్‍లో మేకప్ మేన్ సుబాని కూడా సేమ్‍టుసేమ్ ఇలాగే టిష్యూ పేపర్‍తో మందు గ్లాసు పట్టుకోవడం గుర్తుకురావడంతో రాముకి ఇంకా అనుమానం బలపడసాగింది.
దాంతో రాము మనసులో ఏదో తెలియని కంగారు మొదలయింది….ఏం జరుగుతుందో అర్ధంకాకపోవడంతో మళ్ళీ ఆలోచనల్లో పడ్డాడు.
“అతను ఎవరో నాకు తెలియదు….” అంటూ సతీష్ వాటర్ తాగిన తరువాత గ్లాసు టేబుల్ మీద పెట్టి ఆలోచనల్లో ఉన్న రాము వైపు చూస్తూ, “రామూ గారు….మీరు బాగానే ఉన్నారు కదా,” అన్నాడు.
దానికి రాము ఏమీ సమాధానం చెప్పకుండా బయటకు వచ్చి నేరుగా రిసెప్షన్ దగ్గరకు వెళ్ళాడు.
రాము అలా ఎందుకు వెళ్ళిపోయాడో అర్ధం కాక ప్రసాద్ కూడా చైర్‍లో నుండి లేచి, “సరె….సార్….మేము వెళ్తాము,” అంటూ బయటకు వచ్చాడు.
బయటకు వచ్చిన రాము రిసెప్షన్ దగ్గరకు వచ్చి ఆమెతో…..
రాము : సతీష్ గారు ఎన్ని రోజులుగా స్మోక్ చేస్తున్నారు….ఇంతకు ముందు ఎప్పుడైనా స్మోక్ చేసారా….
రిసిప్షన్ : లేదు సార్….ఇంతకు ముందు ఎప్పుడూ ఆయన స్మోక్ చేయడం చూడలేదు….ఈ మధ్యే చేస్తున్నారు….
ఆ మాట విన్న రాముకి తన మనసులో అనుమానం ఇంకా బలపడిపోయింది.
కాని వీటన్నింటికీ లింక్ ఎక్కడ ఉన్నదో అర్ధం కాక ఆలోచిస్తూ అక్కడ నుండి బయటకు వచ్చేసాడు.
ప్రసాద్ కూడా రాము వెనకాలే బయటకు వచ్చి, “సార్…సార్….ఏమయింది…అలా మధ్యలో లేచి వచ్చేసారేంటి,” అనడిగాడు.
రాము ఏమీ మాట్లాడకుండా కారు దగ్గరకు వచ్చి డోర్ తీస్తు, “అదే….నీకు ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు,” అని అంటుండగా పక్క నుండి ఒక కుక్క అరుస్తున్న శబ్దం విని అటు వైపు చూసాడు.
అక్కడ ఒక చెట్టుకు ఇంతకు ముందు తాను సెమినార్ అటెండ్ అయినప్పుడు సతీష్తో పాటు ఉండటం చూసాడు.
దాంతో రాము చిన్నగా ఆ కుక్క దగ్గరకు వెళ్తుంటే అక్కడ నిలబడి ఉన్న సెక్యూరిటీ గార్డ్ పరిగెత్తుకుంటూ వచ్చి, “ఏయ్ నోర్ముయ్….ఎందుకలా అరుస్తావు,” అంటూ కుక్కని గదుముతున్నాడు.
రాము అక్కడకు వచ్చి సెక్యూరిటీ అతని వైపు చూసి, “ఇది సతీష్ గారి పెంపుడు కుక్క కదా,” అనడిగాడు.
సెక్యూరిటీ గార్డ్ : అవును సార్….ఆయనదే….
రాము : సెమినార్‍లో ఉన్నంతసేపు ఇది ఆయనతోనే ఉండేది కదా….సెమినార్‍లో ఎప్పుడూ సైలెంట్‍గా ఉంటుంది…. ఇప్పుడేంటి ఇలా అరుస్తుంది…..
సెక్యూరిటీ గార్డ్ : ఏం జరిగిందో తెలియదు సార్….విపరీతంగా మొరుగుతున్నది….నాలుగురోజులుగా సార్‍ని చూసి కూడా అరుస్తున్నది….మొన్న కరడానికి కూడా ట్రై చేసింది…అందుకే సతీష్ సార్ దీన్ని బయట కట్టేయమన్నారు….
అతని మాటలు విన్న రాము ఒక్కసారి వెనక్కు తిరిగి బిల్డింగ్ పైన ఉన్న సతీష్ బొమ్మ ఉన్న బ్యానర్‍ని, మళ్ళి కుక్కని చూసి ఏదో ఆలోచన వచ్చిన వాడిలా మళ్ళీ లోపలికి వెళ్ళి సతీష్‍ని కలిసాడు.
సతీష్ : ఏంటి మళ్ళీ వచ్చారు….ఏమయింది…మీరు ఏదో టెన్షన్‍లో ఉన్నారు….
రాము : సార్…నేను చెప్పేది ప్రశాంతంగా వినండి….కోప్పడకుండా వినండి…
సతీష్ సిగిరెట్ తాగుతూ చెప్పండి అన్నట్టు రాము వైపు చూసాడు.
రాము : సతీష్ గారూ….మీరు కొద్దిరోజులు పోలిస్ కస్టడీలో ఉంటే బెటర్….ఇది మీ మంచి కోసమే చెబుతున్నా….
సతీష్ : (చిన్నగా నవ్వుతూ…) ఏం మాట్లాడుతున్నారు రామూ…నేను పోలిస్ కస్టడీలొ ఉండటం ఏంటి….మీరు ఏం మాట్లాడుతున్నారో అర్ధమవుతున్నదా….
రాము : లేదు సతీష్ గారు….మీకు ప్రమాదం జరగొచ్చు….లేక మీ వలన ఇంకొకరికి ప్రమాదం జరగొచ్చు….ప్లీజ్ సతీష్ గారు…నేను ఇలా చెప్పడానికి ఒక రీజన్ ఉన్నది…అది మీకు చెబితే అర్ధం కాదు….మీకు జరిగినట్టే ఇంతకు ముందు ఇద్దరికి జరిగింది…వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రాణాలతో లేరు…ఈ మర్డర్స్ వెనకాల ఎవరున్నారో…ఏం చేస్తున్నారో….అసలు మోటివ్ ఏంటో….ఏమీ అర్ధం కావడం లేదు…..(అని ఇంకా చెబుతుండగా సతీష్ మధ్యలోనే అతన్ని ఆపుతూ)
సతీష్ : ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి….Get out….
సతీష్ అలా అనగానే రాము మనసులో అనుమానం కాస్తా నిజమే అని తేలిపోయింది.
దాంతో రాము వెనక్కు చైర్‍లో ఆనుకుని సతీష్ వైపు చూస్తూ…..
రాము : ఎవరిని బయటకు వెళ్ళమంటున్నావో నీకు అర్ధమవుతున్నదా….నీముందు కూర్చున్నది మామూలు SI అనుకుంటున్నావా…..Deputy Commissioner Of Police…ఇందాకటి నుండి మర్యాదగా చెబుతుంటే అర్ధం కావడం లేదా…..క్రైమ్ డిపార్ట్ మెంట్ హెడ్‍ని….నేను తలుచుకుంటే ఏమీ చేయగలనో నీకు తెలియదు….అయినా మర్యాదగా అడిగాను…
కాని సతీష్ మాత్రం రాము మాటలను ఏమాత్రం లెక్కచేయకుండా సిగిరెట్ పొగ నోట్లొ నుండి వదులుతూ ముందుకు ఒంగి టేబుల్ మీద మోచేతులు ఆనించి రాము వైపు చూస్తూ…..

1 Comment

Comments are closed.