రాములు ఆటోగ్రాఫ్ – 45 103

రాము : సతీష్….నువ్వు ఏం చేస్తుంటావు…..
సతీష్ : మార్కెటింగ్ జాబ్ సార్….
రాము : సరె….నీకు సుభద్ర ఎంత కాలం నుండి తెలుసు…..
సతీష్ : నాకు మంచి ఫ్రండ్ సార్….ఆమె నాకు డిగ్రీలో పరిచయం అయింది…..అప్పటి నుండీ తెలుసు….
రాము : కేవలం ప్రండ్సేనా….ఇంకేమైనా ఉన్నదా…..
సతీష్ : లేదు సార్….మంచి ఫ్రండ్….అంతే….
ప్రసాద్ : అలా అయితే రాత్రిళ్ళు ఒంటి గంట వరకు చాటింగ్ ఒక ఫ్రండ్‍తో చేస్తారా…..
సతీష్ : ఏంటి సార్ మీరు అనేది….నేను అంత సేపు ఎవరితో చాటింగ్ చేయలేదు…..
ప్రసాద్ : చూడు సతీష్….మేము మొత్తం నీ కాల్ డేటా….what’s up చాటింగ్ డిటైల్స్ మొత్తం వెరిఫై చేసుకుని నిన్ను ఇక్కడకు పిలిపించాము….కాబట్టి నిజం చెప్పు…..
ఆ మాట వినగానే సతీష్ తల వంచుకుని మెదలకుండా ఉన్నాడు.
రాము : మెదలకుండా ఉంటె పని జరగదు సతీష్….ఇక్కడ ఆమె భర్త మర్డర్ జరిగింది….ప్రతి ఒక్కరి మీద అనుమానం వస్తుంది….నువ్వు సమాధానం చెప్పకుండా మెదలకుండా ఉన్నావంటే ఆ మర్డర్ నువ్వే చేసావని అనుమానంతో నిన్ను లోపల వేయాల్సి ఉంటుంది…..
సతీష్ : సార్….సుభద్ర వాళ్ళాయన హత్యకు నాకూ ఎటువంటి సంబంధం లేదు….(అంటూ భయపడ్డాడు.)
ప్రసాద్ : మరి ఏం జరిగిందో నిజం చెప్పు సతీష్….లేకపోతే నీ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సి ఉంటుంది….
సతీష్ : చెబుతాను సార్….

(ఫ్లాష్ బ్యాక్ మొదలు)

సతీష ఒకరోజు ఆఫీస్ నుండి బయటకు వచ్చి టీ తాగుతుండగా ఎదురుగా సుభద్ర సూపర్ మార్కెట్‍లోకి వెళ్ళడం చూసాడు.
దాంతో సతీష గబగబ టీ తాగేసి డబ్బులు ఇచ్చి రోడ్ క్రాస్ చేసి సుభద్ర వెళ్ళిన సూపర్ మార్కెట్‍లోకి వెళ్ళాదు.
సతీష్ లోపలికి వెళ్ళిన తరువాత సుభద్ర ఎక్కడ ఉన్నదా అని వెతికాడు.
ఒక చోట సుభద్ర ట్రాలీ తోసుకుంటూ తనకు కావలసినవి అందులో వేసుకుండుండటం చూసాడు.
అది చూసిన సతీష్ గబగబ సుభద్రకు బాగా దగ్గరకు వెళ్ళి ఆమె చెవిలో, “హాయ్….” అన్నాడు.
సతీష్ ఒక్కసారిగా అలా అనే సరికి సుభద్ర ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసింది.
తన వెనకాల సతీష్ నవ్వుతూ ఉండటం చూసి సుభద్ర నవ్వుతూ, “నీకు ఇంకా చిన్న పిల్లల చేష్టలు పోలేదు,” అంటూ చేత్తో సతీష్ భుజం మీద మెల్లగా కొట్టి, “ఏంటి….షాపింగ్‍కి వచ్చావా,” అనడిగింది.
సతీష్ నవ్వుతూ, “లేదు…నువ్వు ఈ సూపర్ మార్కెట్‍లోకి రావడం చూసి నేను కూడా వచ్చాను,” అన్నాడు.
“అబ్బా….మరీ ఐస్ పెట్టకు….ఏం తీసుకుందామని వచ్చావు,” అనడిగింది సుభద్ర.
“నిజంగానే…నిన్ను చూసి లోపలికి వచ్చాను….” అన్నాడు సతీష్.

సరె…సరె….నేను తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి….నన్ను డిస్ట్రబ్ చేయకు,” అంటూ సుభద్ర మళ్ళీ తన షాపింగ్ హడావిడిలో పడిపోయింది.

సతీష్ కూడా ఆమె పక్కనే నడుస్తూ సుభద్రకు కావలసినవి ఇస్తున్నాడు.
అంతలో సుభద్ర ఫోన్ మోగడంతో తన హ్యాండ్‍బ్యాగ్‍లో నుండి ఫోన్ బయటకు తీసి స్క్రీన్ మీద ఆదిత్య పేరు కనిపించగానే సుభద్ర పెదవుల మీద ఒక నవ్వు మెరిసి మాయమైంది.
ఆదిత్య పేరు చూడగానే సుభద్ర మొహంలో సంతోషం సతీష్ గమనించాడు.
దాంతో సతీష్‍కి ఆ ఆదిత్య ఎవరు అని ఆలోచిస్తూ సుభద్ర పక్కనే నడుస్తున్నాడు.
సుభద్ర అవతల మాట్లాడే మాటలు వింటున్నది.
కాని పక్కనే సతీష్ ఉండటంతో ఎక్కువ మాట్లాడకుండా, “ఊ….ఊహు,” అని మాత్రమే సమాధానం ఇస్తూ మధ్యమధ్యలో చిన్నగా నవ్వుతున్నది.
ఆదిత్య ఏం మాట్లాడుతున్నాడో సతీష్‍కి తెలియకపోయినా అతను మాట్లాడినప్పుడు సుభద్ర సిగ్గుతో నవ్వడం…ఆమె బుగ్గలు ఎరుపెక్కడం గమనించాడు.
దాంతో సతీష్‍కి అతను ఎవరో కనుక్కోవాలని అనిపించింది.
సుభద్ర ఐదు నిముషాలు మాట్లాడిన తరువాత ఫోన్ కట్ చేసి మళ్ళీ తన హ్యాండ్‍బ్యాగ్‍లో పెట్టేసుకున్నది.
సతీష్ : ఎవరు….మాట్లాడింది….
సుభద్ర : అ….అదీ…అదీ….ఫ్రండ్….(అంటూ సతీష్ అలా అడుగుతాడని ఊహించకపోయే సరికి సుభద్ర తడబడుతూ సమాధానం చెప్పింది.)
అది చూసి సతీష్ అనుమానం ఇంకా బలపడింది.
సతీష్ : (తన మనసులో) ఆదిత్య ఎవరు….సుభద్రని అడిగితే సరిగ్గా చెప్పడం లేదు…మొగుడు కాదు, కొడుకు కాదు… మరి ఎవరు….ఎలా తెలుసుకోవాలి…
అంటూ ఆలోచిస్తున్న అతనికి ఒక ఆలోచన వచ్చింది.
దాంతో సతీష్ వెంటనే సుభద్ర దగ్గరకు వచ్చి…
సతీష్ : సుభద్రా….
సుభద్ర : ఏంటి సతీష్….
సతీష్ : ఏం లేదు…ఆఫీస్‍కి అర్జంట్‍గా ఫోన్ చేయాలి….ఒక్కసారి నీ ఫోన్ ఇస్తావా….
సుభద్ర : నీ ఫోన్ ఏమయింది….(అంటూ హ్యాండ్‍బ్యాగ్‍లో నుండి ఫోన్ తీస్తున్నది.)
సతీష్ : నా ఫోన్ చార్జింగ్ అయిపోయి….ఆఫ్ అయిపోయింది….అందుకని….(అంటూ సుభద్ర చేతిలో ఫోన్ తీసుకున్నాడు.)
సుభద్ర మళ్ళీ షాపింగ్ హడావిడిలో పడిపోయింది.
సతీష్ ఫోన్ చేస్తున్నట్టు నటిస్తూ సుభద్ర షాపింగ్‍లో మునిగిపోవడం గమనించిన అతను వెంటనే ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా సుభద్ర ఫోన్‍లో కాల్ రికార్డ్స్ ఓపెన్ చేసాడు.
దానిలోకి వెళ్ళి ఆమె ఇందాక మాట్లాడిన కాల్ రికార్డ్ ని what’s up ద్వారా తన ఫోన్‍కి ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు.
అలాగే మధ్యమధ్యలో సతీష్ ఫోన్ మాట్లాడుతున్నట్టు నట్టిస్తూ మెల్లగా సుభద్రకు కొంచెం దూరంలోకి వచ్చి ఫోన్‍లో గ్యాలరీ ఓపెన చేసి చూసాడు.