రాములు ఆటోగ్రాఫ్ – 45 103

ప్రసాద్ : అమ్మో….మీరు మామూలు వాళ్ళు కాదు సార్….మీరు పేరుకు మాత్రమే రాము….లోపల అన్నీ కృష్ణుడి వేషాలే……
రాము : సరేలే…..మనిద్దరి మధ్య విషయాలు ఇంకొకరికి తెలియనివ్వకు….నువ్వు పరిచయం అయిన దగ్గర నుండీ నీ మీద నాకు ఎందుకో బాగా నమ్మకం కుదిరింది….అందుకే నా సీక్రెట్లు అన్నీ నీతో షేర్ చేసుకుంటున్నా…..
ప్రసాద్ : భలేవారు సార్….మీరు పరిచయం అయిన వెంటనే నాకు ప్రమోషన్ వచ్చింది….మీరు మా ఇంట్లో మనిషిలా కలిసిపోయారు…కేడర్‍లొ మీకంటే చిన్నవాడిని అయినా….వయసులో పెద్దవాడిని కాబట్టి…మిమ్మల్ని నా తమ్ముడిలా అనుకుంటున్నాను…..
అలా వాళ్ళు దాదాపు గంట సేపు మాట్లాడుకుంటున్నారు.
ఇంతలో కానిస్టేబుల్ వచ్చి సుభద్ర కాల్ డీటైల్స్, sms, what’s up డీటైల్స్ మొత్తం తీసుకొచ్చాడు.
సుభద్ర కాల్ డీటైల్స్ కానిస్టేబుల్‍కి ఇచ్చి మొత్తం చెక్ చేసి ఏమైనా సస్పెక్ట్‍గా ఉంటే తెలియచేయమన్నాడు.
కానిస్టేబుల్ ఆ లిస్ట్ తీసుకుని వెళ్ళిన తరువాత రాము తన చేతిలో ఉన్న sms లిస్ట్ ప్రసాద్‍కి ఇచ్చి చెక్ చేయమని…. తాను మాత్రం What’s up లిస్ట్ చెక్ చేస్తున్నాడు.
అలా ఇద్దరూ ఇంకో గంటన్నర సేపు ఆ లిస్ట్ చెక్ చేస్తుండగా రాము కళ్ళకు రెండు నెంబర్ల నుండి what’s up లో చాటింగ్ బాగా ఆకర్షించింది.
రాము వెంటనే ఇద్దరు కానిస్టేబుల్స్‍ని పిలిచి చెరొక నెంబర్ నోట్ చేసుకోమని చెప్పి, “వీళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో కనుక్కుని అరగంటలొ నా దగ్గరకు తీసుకుని రా,” అన్నాడు.
కానిస్టేబుల్స్ అలాగే అని వెళ్లబోతుండగా రాము వాళ్లను వెనక్కు పిలిచి, “వాళ్ళిద్దరూ దొరికిన వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్, లాప్‍టాప్ ఉంటే అది కూడా మీ ఇద్దరూ తీసుకుని ఇక్కడకు వచ్చేయండి…వాళ్ళ దగ్గర నుండి నువ్వు వెంటనే తీసేసుకో….అందులో డేటా మాత్రం బయటకు వెళ్ళకూడదు….జాగ్రత్త,” అన్నాడు.
కానిస్టేబుల్స్ తల ఊపి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
కానిస్టేబుల్స్ వెళ్ళిన వెంటనే ప్రసాద్, “ఏంటి సార్….ఏదైనా క్లూ దొరికిందా….” అనడిగాడు.
రాము : అవును ప్రసాద్…డౌట్ కొడుతున్నది…ఇప్పుడు ఈ నెంబర్ల తాలూకు వ్యక్తులు రాగానే మొత్తం బయటపడుతుంది…
ప్రసాద్ : ఆ నెంబర్స్ ఎవరివి అయి ఉంటాయి సార్….
రాము : సుభద్ర బోయ్‍ఫ్రండ్‍ది కావొచ్చు…..బాగా చాటింగ్ జరుగుతున్నది….
ప్రసాద్ : సుభద్ర గారి చెల్లెలు కాని….ఫ్రండ్స్ కాని అవొచ్చు కదా….సార్…..
రాము : (ప్రసాద్ అంత అమాయకంగా అడిగేసరికి తన చేతిలో ఉన్న పేపర్లు ప్రసాద్ ముందుకు తోసి) ఫ్రండ్‍తో, చెల్లెళ్ళతో ఎవరూ రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా మాట్లాడరు ప్రసాద్….(అంటూ నవ్వాడు.)
రాము అలా అనగానే ప్రసాద్ అతని వైపు మెచ్చుకున్నట్టు చూసాడు.
దాదాపు గంట తరువాత కానిస్టేబుల్ తన వెంట పాతికేళ్ళ కుర్రాడిని తీసుకొచ్చి రాము ముందు నిలబెట్టి, “సార్…ఇతనే సార్….మీరు చెప్పిన పోన్ నెంబర్ తాలూకు కుర్రాడు….” అంటూ తన చేతికి ఉన్న భ్యాగ్ లోనుండి లాప్‍టాప్, రెండు ఆండ్రాయిడ్ ఫోన్లు తీసి రాము ముందు ఉన్న టేబుల్ మీద పెట్టాడు.
రాము వాటిని తీసుకుని కానిస్టేబుల్‍ని వెళ్ళమన్నాడు.

కానిస్టేబుల్ వెంట వచ్చిన కుర్రాడు అక్కడే చేతులు కట్టుకుని భయంగా రాము, ప్రసాద్ వైపు చూస్తూ, “సార్…నన్నెందుకు తీసుకొచ్చారు సార్….నేను ఏ తప్పు చేయలేదు,” అన్నాడు.

రాము : ఇంతకు నీ పేరు ఏంటి……
కుర్రాడు : ఆదిత్య సార్…..
రాము : చూడు ఆదిత్యా….నువ్వు తప్పు చేసావని నేను చెప్పలేదే….లేక నువ్వు ఇంతలా కంగారుపడుతున్నావంటే ఇంతకు ముందు ఏమైనా తప్పు చేసి ఉండాలి….(అంటూ అతని మొహంలోకి చూసాడు.)
ఆదిత్య : (కంగారుగా….) నేను ఏ తప్పు చేయలేదు సార్…..
రాము : మరి అంత కంగారెందుకు పడుతున్నావు….
ఆదిత్య : పోలీసులంటే నాకు చిన్నప్పటి నుండీ భయం సార్….అందుకే కంగారుగా ఉన్నది…..
ప్రసాద్ : అవునా బాబూ….ఆ కంగారు వెనక ఉన్న రహస్యం మేము తెలుసుకుంటాం….ఒక్క విషయం అడుగుతాము నిజం చెబుతావా……
ఆదిత్య : ఏంటి సార్…..అడగండి సార్…..
రాము : (తన రివాల్వింగ్ చైర్‍లో వెనక్కు వాలుతూ) నీకు సుభద్ర అనే ఆవిడ తెలుసా…..
రాము నోటి వెంట సుభద్ర పేరు రాగానే ఆదిత్య మొహంలో రంగులు మారాయి.
అది గమనించిన ప్రసాద్ వెంటనే రాము వైపు సైగ చేసాడు.
రాము కూడా గమనిస్తున్నట్టు సైగ చేస్తూ ఆదిత్య వైపు కోపంగా చూసాడు.
ఆదిత్య : సుభద్ర….ఆవిడ ఎవరో నాకు తెలియదు సార్…..
ప్రసాద్ : చూడు ఆదిత్యా…ఒక్కసారి నువ్వు ఆలోచించుకుని నిజం చెప్పు…మేము ఎవరినీ ఊరకనే ఇక్కడకు తీసుకురాము….కాబట్టి ఇంకొక్కసారి ఆలోచించుకుని నిజం చెబితే నీకే మంచిది…..
అంతలో ఒకాయన డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు.
రాము అతని వైపు ఎవరు అన్నట్టు చూసాడు.
అతను : సార్….నేను ఆదిత్య ఫాదర్‍ని….
రాము : (అక్కడ చైర్ చూపించి) కూర్చోండి….మీ పేరు….
అతను : నా పేరు జనార్ధనరావు సార్…మా అబ్బాయిని ఎందుకు తీసుకొచ్చారు సార్…వాడు ఎలాంటి తప్పు చేయలేదు….
ప్రసాద్ : మీ అబ్బాయి తప్పు చేసాడని ఇక్కడకు తీసుకురాలేదు జానార్ధనరావు గారు…మాకు ఒక కేసు విషయంలో కాల్ లిస్ట్ వెదుకుతుంటే మీ అబ్బాయి నెంబర్ దొరికింది…అందుకుని ఒక్కసారి ఎంక్వైరీ కోసం ఇక్కడకు తీసుకొచ్చాము …అంతె…..
జనార్ధన రావు : ఏం కేసు సార్……
రాము : అన్నీ తెలుస్తాయి జనార్ధన్ గారు…మీ అబాయి నోరు తెరిస్తే…మాకు కావలసినంత ఇన్ఫర్‍మేషన్ వస్తుంది… (అంటూ ఆదిత్య వైపు తిరిగి) ఇప్పుడు చెప్పు ఆదిత్యా…సుభద్ర ఎవరో నీకు తెలుసా…..
జనార్ధనరావు : ఆవిడ ఎవరో మాకు తెలియదు సార్….మా బంధువుల్లో ఆ పేరు కలవాళ్ళు ఎవరూ లేరు…..
రాము : జనార్ధన్ గారూ…నేను మీకు తెలుసా అని అడగలేదు…మీ అబ్బాయికి తెలుసా అని అడిగాను…మీరెందుకు సమాధానం చెబుతున్నారు…..
రాము అలా అనగానే జనార్ధన రావు మెదలకుండా ఉన్నాడు.
కాని ఆదిత్య మాత్రం మాట్లాడకుండా తల వంచుకుని నిల్చున్నాడు.
ప్రసాద్ తన చైర్ లోనుండి లేచి ఆదిత్య దగ్గరకు వెళ్ళి భుజం మీద చెయ్యి వేసాడు.
ఆదిత్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
ప్రసాద్ : ఆదిత్యా…మేము నిన్ను కొట్టలేదు కదా…నువ్వు ఎందుకు భయపడుతున్నావు…మేము అడిగిన వాటికి వెంటనే సమాధానాలు చెప్పావనుకో ఐదు నిముషాల్లో మీ నాన్నగారితో పాటు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు…..
జనార్ధనరావు : చెప్పమ్మా ఆదిత్యా….సుభద్ర ఎవరూ…నీకు తెలుసా…..
ప్రసాద్ : నువ్వు చెప్పకుండా మొండికేసావనుకో మా పధ్ధతిలో మేము చెప్పించాల్సి వస్తుంది….ఆలోచించుకో….
జనార్ధన రావు : సార్….మీరు మా అబ్బాయిని బెదిరిస్తున్నారు…..అయినా ఏ ఆధారంతో మా అబ్బాయిని ఇలా తీసుకొచ్చారు….
రాము : మేము ఏ ఆధారాలు లేకుండా ఎవరినీ తీసుకురాము జనార్ధన్ గారు…ఒక్క విషయం అడుగుతాను చెప్పండి…