రాములు ఆటోగ్రాఫ్ – 45 103

ప్రసాద్ కూడా రాము మొహంలో ఆనందాన్ని చూసి వెంటనే ఆ లెటర్ హెడ్ మీద ఉన్న వెంకట్ అడ్రస్ నోట్ చేసుకున్నాడు.

ప్రసాద్ : సార్…ఈ వెంకట్ ఇంకా ఈ అడ్రస్‍లోనే ఉన్నాడా…లేక…మారిపోయాడా….(అంటూ ఆఫీసర్ వైపు చూసాడు.)

ఆఫీసర్ : మీకు ఈ విషయం తెలియదా…..వెంకట్ ఈ మధ్యనే చనిపోయారు….

ఆ మాట వినగానే రాము, ప్రసాద్ మళ్ళీ కేసు మొదటికి వచ్చిందని అప్పటిదాకా పడ్డ ఆనందం అంతా నీరు కారిపోయింది.

రాము : ఎలా జరిగింది….అంటే ఎలా చనిపోయారు….

ఆఫీసర్ : నేచురల్ డెత్…..

రాము : సరె….ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా…..

ఆఫీసర్ : ఆయనకు పిల్లలు లేరు….భార్య మాత్రమే ఉన్నది….ఆమె కూడా ఇంట్లో మెట్లు దిగుతుండగా స్లిప్ అయి తలకు దెబ్బ తగలడంతో కొమాలో ఉన్నారు….

ఆఫీసర్ చెప్పే ఇచ్చే ఒక్కో ఇన్‍ఫర్‍మేషన్ కేసు చేజారిపోతుందని ప్రసాద్ చాలా దిగులుపడిపోతున్నాడు.

కాని రాము మాత్రం ఎక్కడో ఒక చోట లింక్ దొరుకుద్దనే ఆశతో…..

రాము : డాక్టర్ వెంకట్‍తో క్లోజ్‍గా మూవ్ అయ్యే ఫ్రండ్స్ కాని, కొలిగ్స్ కాని ఉన్నారా…..

ఆఫీసర్ : మనోజ్ అని ఒకాయన ఉన్నారు….ఆయన్ని కలవాలంటే ఫిఫ్త్ ఫ్లోర్‍లో ఉంటారు….నేను ఫోన్ చేస్తాను వెళ్ళి కలవండి….

రాము : థాంక్స్ ఆఫీసర్….(అంటూ అక్కడ నుండి బయటకు వచ్చి ఫిఫ్త్ ఫ్లోర్‍కి లిఫ్ట్ లో లాబ్‍లో కొంతమంది వైట్ కోట్ వేసుకుని రీసెర్చ్ లో చాలా బిజీగా ఉన్నారు.

వీళ్ళిద్దరూ లోపలికి రావడం చూసి ఒకాయన చెయ్యి పైకి ఎత్తి విష్ చేస్తూ బయటకు వస్తున్నాను అని సైగ చేసి అక్కడ వాళ్లకు ఏం చేయాలో చెప్పి బయటకు వచ్చాడు.

అంతకు ముందే ఆఫీసర్ ఫోన్ చేసి వివరాలు చెప్పడంతో మనోజ్ రాముకి షేక్ హ్యాండ్ ఇచ్చి, “హాయ్….నేనే మనోజ్…..ఏంటి చచ్చాక కూడా టెన్షన్ పెడుతున్నాడా….” అన్నాడు.

రాము : వెంకట్ మీకు ఎన్నాళ్ళుగా తెలుసు…..

మనోజ్ : నాకు జస్ట్ రెండేళ్ళు సీనియర్…..కాని చాలా జాదూగాడు…అలాగే చాలా తెలివైన వాడు కూడా….

ప్రసాద్ : సార్….వెంకట్….నారాయణ గారి అండర్‍లో పని చేస్తున్నారా….

మనోజ్ : అవును….అతనే కాదు….మేము అందరం కూడా నారాయణగారి కింద పనిచేస్తున్నాము….ఆయన ఈ రీసెర్చ్ సెంటర్‍కి డైరెక్టర్…..వెంకట్‍కి నారాయణకు అసలు పడదు….ఎందుకంటే వెంకట్ డైరక్టర్ ఆయ్యుండాల్సింది ….కాని నారాయణ తన పొలిటికల్ పలుకుబడి ఉపయోగించి డైరెక్టర్ అయ్యే సరికి వెంకట్‍కి చాలా కోపం వచ్చింది….

అంటూ వాళ్ళిద్దరినీ తన కేబిన్‍లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫ్రిజ్‍లో నుండి ఇద్దరికీ కూల్‍డ్రింక్ తీసి ఇచ్చాడు.

మనోజ్ తన చైర్‍లో కూర్చుంటూ, “వెంకట్‍కి నారాయణకు రిపోర్ట్ చేయడం అసలు ఇష్టం ఉండేది కాదు…” అన్నాడు.

ప్రసాద్ : మీరంటున్న ఈ వెంకట్….నారాయణకన్నా బాగా తెలివైన వాడా….