రాములు ఆటోగ్రాఫ్ – Part 31 214

రాము వెళ్ళిపోయిన తరువాత అనిత మెయిన్ డోర్ గడి వేసి లోపలికి వచ్చి తన మొగుడి వైపు కూడా చూడకుండా తన బెడ్ రూంలోకి వెళ్ళిపోయింది.
తన భార్య చెవిలో రాము ఏదో చెప్పడం, దానికి అనిత సిగ్గు పడుతూ నవ్వడం భాస్కర్ కి కనిపిస్తునే ఉన్నది.
కాని వాళ్ళిద్దరికి తను అక్కడ ఉన్నానన్న సంగతి కూడా పట్టించుకోకుండా అలా నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుకోవడం భాస్కర్ కి నచ్చక అనితతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు.
అలా అనుకుని భాస్కర్ వాళ్ళ బెడ్ రూంలోకి వెళ్ళాడు.
లోపల అనిత వార్డ్ రోబ్ లోనుండి టవల్ తీసుకుంటున్నది.
తన మొగుడు బెడ్ రూంలోకి రావడం అనిత చూసింది….కాని భాస్కర్ తో మాట కూడా మాట్లాడలేదు.
ఇక చేసేది లేక భాస్కర్ అనిత వైపు చూసి, “అనిత నీతో కొంచెం మాట్లాడాలి,” అన్నాడు.
“ఇప్పుడు కాదు భాస్కర్…..స్నానం చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తరువాత మాట్లాడుకుందాం,” అన్నది అనిత.
“కాని అనిత….నేను…..,” అంటూ భాస్కర్ మాట పూర్తి చేసేలోపు అనిత భాస్కర్ వైపు కోపంగా చూసి, “నేను నీతో తరువాత మాట్లాడతాను అన్నా కదా…..ఇప్పుడు కాదు,” అని గట్టిగా అరిచింది.

అనిత కోపం చూసి భాస్కర్ కి భయం వేసి మాట్లాడకుండా నిల్చున్నాడు.
అనిత టవల్ తీసుకుని బాత్ రూంలోకి వెళ్ళింది.
భాస్కర్ తల వంచుకుని తన వీల్ చైర్ ని తిప్పుకుని బయటకు వెళ్తూ మంచం పక్కనే ఉన్న టేబుల్ మీద ఫోటో ఫ్రేమ్ చూసి ఒక్కసారిగా భాస్కర్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.
ఆ ఫోటో ఫ్రేమ్ చూడగానే భాస్కర్ గుండె మళ్ళీ వేగంగా కొట్టుకుంటున్నది.
ఆ ఫోటోలో రాము, అనిత ఒకరిని ఒకరు దాదాపుగా కౌగిలించుకున్నట్టు…..బార్య, భర్త ఫోటో దిగినట్టు దిగారు.
అందరు కలిసి హిల్ ఏరియా పిక్నిక్ కి వెళ్ళినప్పుడు వాళ్ళీద్దరు కలిసి దిగిన ఫోటో అది.
రాము ఒక చేతిని అనిత నడుం మీద, ఇంకో చేతిని అనిత భుజం మీద వేసి దగ్గరకు లాక్కుని దిగిన ఫోటొ.
ఆ ఫోటో చూసిన భాస్కర్ కి తన మనసు ఎవరో గట్టిగా పట్టుకుని పిండుతున్నట్టు అనిపించింది.
అతని కళ్ళ నుండి కన్నీరు బయటకు వచ్చింది.
అలాగే తల వంచుకుని భాస్కర్ ఆ బెడ్ రూంలో నుండి బయటకు వచ్చి బాల్కనీలోకి వచ్చి బయటకు చూస్తున్నాడు.
అతని మనసంతా ఇందాక రాము తనతో ప్రవర్తించిన పధ్ధతి, బెడ్ రూంలో వాళ్ళిద్దరి ఫోటో….ఇలా రకరకాల ఆలోచనలతో నిండిపోయింది.
అలా ఆలోచిస్తూ కూర్చున్న భాస్కర్ కి హాల్లో టీవి పెట్టిన శబ్దం వినిపించి వెనక్కి తిరిగి చూసాడు.
అప్పుడే అనిత హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని టీవి చూస్తున్నది.
భాస్కర్ బాల్కనీలో నుండి హాల్లోకి వచ్చి అనిత పక్కనే నిల్చుని ఆమెనే చూస్తున్నాడు.
దాంతో అనిత భాస్కర్ వైపు ఒకసారి చూసి ఏం మాట్లాడకుండా మళ్ళీ టీవి చూస్తున్నది.
భాస్కర్ తన వైపే కన్నార్పకుండా చూడటం గమనించి అనితకి చిరాకు వేసింది.
దాంతో అనిత భాస్కర్ వైపు చూసి, “ఏంటి విషయం….అలా కన్నార్పకుండా చూస్తున్నావెందుకు?” అని అడిగింది.

దాంతో భాస్కర్ వెంటనే అనిత దగ్గరకు జరిగి, “అనిత….నాకు ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు….కాని ఏదో తప్పు జరుగుతున్నది….నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావనిపిస్తున్నది….నీకు రాముకి మధ్య ఏదో తప్పు జరుగుతున్నట్టు అనిపిస్తున్నది,” అన్నాడు.

2 Comments

  1. Bro ee coment chaduvutaavo ledo telidhu kani,,,story bagundhi but bhasker character ala rayadam baledhu vadu kuda happy ga umdela story రయి

  2. Story bagundhi missing jareena nd shyamala.

Comments are closed.