ముందుగా ఈ నా కథ “అన్నయ్య” థీమ్ ఒక నెటిజన్ వ్రాసిన కథ Husband Became Sister-in-law ను ప్రాతిపదికగా తీసుకుని ఒక మంచి కథగా డెవలప్ చేసాను ….. మీకు నచ్చుతుందని నా ఆకాంక్ష …. ఇక కథ లోకి వెళ్తాను
భార్య చెప్పిన కథ:
నా పేరు సులోచన. నేను డిగ్రీ పూర్తి చేసాను. మధ్యతరగతి కుటుంబం. నాతో పాటు మా అన్నయ్య “సురేష్” తన పెళ్ళైన 4 సంవత్సరాలకే ప్రసవ సమయంలో కాన్పు కష్టమై భార్య ఒక మగబిడ్డని మిగిల్చి చనిపోయింది. తనకు సొంత వ్యాపారం ఉంది. మా వదిన చనిపోయి 1 సంవత్సరం అవుతోంది. నేను మా మేనత్త కొడుకుని ప్రేమించాను. కాని వాళ్ళు దిగువ మధ్య తరగతి స్థాయిలో ఉండటం తో ఆ ఇంటిలో నేను సుఖపడలేనని మా నాన్న ఒక సంబంధం చూశారు. కాదనలేని పరిస్థితి. మా నాన్న నాకోసం చూసిన అతని పేరు “కృష్ణ” తన పేరెంట్స్ చనిపోవడంతో కష్టపడి హాస్టల్ లో ఉంటూ చదువుకొని పైకి వచ్చాడు. తను ఒక సేల్స్ అకౌంట్స్ కన్సల్టెంట్. హైదరాబాద్ లో మంచి పరిచయాలు ఉన్నాయి. తనకు ఒక ఇల్లు, రెండు ఖాళీ స్థలాలు మరియు బ్యాంకు డిపాజిట్స్ ఉన్నాయి. నన్ను లేపుకుపోవడానికి బావకు ధైర్యం లేకపోవడంతో మా పెద్దవాళ్ళు చూసిన “కృష్ణ” నే పెళ్లి చేసుకోవలసి వచ్చింది. పెళ్ళైన పదిరోజులకే నేను విజయవాడ నుండి హైదరాబాద్ నా భర్త ఇంటికి వెళ్ళిపోయాను. నా భర్త కృష్ణ మంచి అందగాడు … చీర కడితే అచ్చం ఆడపిల్లలా ఉంటాడేమో? తెల్లగా ఉంటాడు … తను పేరెంట్స్ లేకుండా పెరిగాడేమో చాలా తక్కువగా మాట్లాడుతాడు…. కానీ నన్ను ఎంతో ప్రేమగా చూసేవాడు. నాకు ఏదీ తక్కువ కాకుండా చూసేవాడు. తిరగడానికి కారు, మంచి ఎయిర్ కండిషన్డ్ ఫ్లాట్, ఇంటి పని చేసిపెట్టడానికి పని మనిషి ఉండటం తో నేను కూడా పెళ్ళైన తరువాత మంచి నిగారింపు దేరాను. పెళ్లై రెండు సంవత్సరాలైనా పిల్లలు లేరనే ఒక కొరత నన్ను వేదించ సాగింది. డాక్టర్ దగ్గర చూపించుకుంటే నాలో లోపమేమీ లేదని తేలింది … ఇక కృష్ణ ను ఒక సారి తీసుకురమ్మన్నాడు డాక్టర్ గారు. తనలోనే లోపమని నాకు అర్ధమైపోయింది. తనను బాధపెట్టడం ఇష్టం లేకపోయింది. అట్లా అని పడక సుఖం లో నాకు ఏమీ తక్కువ చేసేవాడు కాదు కృష్ణ. అట్లాంటి సమయంలో నేను తీరికగా ఉండటం ఇష్టం లేక కృష్ణ తో నేనూ తనతో పాటు ఆఫీసు కి వస్తానని ఒకటే పోరు పెట్టడం తో నన్ను నిరాశ పరచడం ఇష్టం లేక ఒప్పుకున్నాడు.
Waiting for aunty and girls
Miru aunty ite naku reply ivvandi