భంగం 511

“మనవాళ్ళ దగ్గర లేకుండా ఇక్కడున్నావేంటి” ప్రశ్నించింది.

“అబ్బాయి చుట్టం ఒకతను పాత స్నేహితుడే. అతనితో మాట్లాడుతూ ఇక్కడున్నాను. నువ్వు గుర్తుపడతావేమో చూద్దాం” అని దమయంతితో అంటూ… “చంద్రం” అంటూ కేక వేసాడు రాము.

ఒక్కసారిగా షాక్ అయింది దమయంతి. చంద్రం అంటే ముప్పైఅయిదు ఏళ్ళ నాడు డిగ్రీ చదువుతున్నప్పుడు, తమతో కలిసి ఆరు నెలలు చదువుకున్నవాడు, తమతో కలిసి తిరిగినవాడు, తాను ఇష్టపడ్డవాడు, తనని మొదటిసారి తాకినవాడు, మొదటిసారి…, ఆ చంద్రమేనా… ముప్పైఅయిదు ఏళ్ళు వెనక్కి వెళ్ళింది దమయంతి.

ఆ చంద్రమే. స్థాయి ఉట్టిపడుతూ, లాల్చీ, పైజమాలో వచ్చాడు.

వస్తూనే దమయంతిని చూసి గుర్తుపట్టినట్టుగా అయ్యి, అంతలోనే మామూలుగా అయ్యాడు.

“చంద్రం, మా పిన్ని కూతురు దమయంతి. కాలేజ్లో మన జూనియర్, గుర్తుందా. కలిసి కొన్ని రోజులు రిక్షాలో వెళ్ళాం. మా పిన్ని వాళ్ళింట్లో మామిడి చెట్టు కింద అన్నం తిన్నాం” ఒక్కొక్కటి చెప్తున్నాడు రాము.

గుర్తొస్తున్నట్టుగా తల ఊపాడు చంద్రం.

“చంద్రం చాలా గొప్పవాడయ్యాడే దమయంతీ. NRI వీడు. మనకి అందనంత ఎత్తులో అమెరికాలో ఉంటున్నాడు” పొగిడాడు రాము.

“హఠాత్తుగా ఏమైపోయారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మిమ్మల్ని చివరిసారి చూసింది” అడిగింది దమయంతి.

“మా బామ్మ పోవడంతో, మా నాన్నగారు ట్రాన్స్ఫర్ పెట్టుకుని మమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్ళారు. అంతా హడావిడిగా జరిగింది. మళ్ళీ మీ అందరినీ కలిసే అవకాశం దొరకలేదు” సమధానమిచ్చాడు చంద్రం.

“గొప్పవాళ్ళు అంతేనే. వాళ్ల పరిచయం కలగడమే మనకి గొప్ప” నవ్వుతూ అన్నాడు రాము.

“ఆపరా ఇక. నా లాగా లక్షల మంది ఉన్నారు అమెరికాలో” మామూలుగా అన్నాడు చంద్రం.

“మన జనరేషన్లో ముప్పై ఏళ్ళ నాడే అమెరికాలో సెటిలయింది నువ్వే కదా. మాకు గొప్పే. అంతే కదా దమయంతీ” అన్నాడు రాము.

అంతే అన్నట్టుగా తల ఊపింది దమయంతి.

ఇంతలో ఫోన్ మోగడంతో పక్కకెళ్లాడు రాము.

చుట్టూ చూసింది, ఎవరూ లేరు.

“గుర్తొచ్చానా” అడిగింది.

తలూపాడు చంద్రం.

“అప్పటి విషయాలేవీ గుర్తులేవా”

“అన్నీ గుర్తులేవు, కొన్ని ఎప్పటికీ మర్చిపోలేను”

“ఆ రోజు మా ఇంట్లో, మామిడి కాయల కోసం వచ్చి, నాతో…”

“నిన్నే జరిగినట్టుగా ఉంది అదంతా, ముప్పైఅయిదు ఏళ్ళ క్రితంలా లేదు”

“మీరు వెళ్ళిపోయారు అని తెలిసాక ఎంత ఏడ్చానో తెలుసా”

1 Comment

  1. ఇంత వరకు వేరే website లో వుంది….నీకు సిగ్గు , దమ్ము వుంటే నెక్స్ట్ update ఇవ్వు…ఇలా already వున్నది పోస్ట్ చేసి ,స్టోరీ stop చెయ్యకు???

Comments are closed.