భంగం 441

“కాకపోతే మీ అమెరికా లాగా సకల సౌకర్యాలు కావాలంటే కష్టంరా” నవ్వుతూ అన్నాడు రాము.

“రేయ్, ఇష్టమైన మనుషులతో గడుపుతున్నప్పుడు సౌకర్యాలు ఎవరికి కావాలి. నీకు గుర్తుందా, ఒకసారి మనం బీరు తాగి, ఇళ్ళకి వెళ్ళటానికి భయపడితే, దమయంతికి చెప్తే, వాళ్ళింటి మేడ మీద మనకి నిద్ర ఏర్పాట్లు చేసింది” దమయంతిని చూస్తూ అన్నాడు చంద్రం.

“ఏమోరా సరిగా గుర్తు లేదు” తల గోక్కుంటూ అన్నాడు రాము.

“నాకు గుర్తుంది. బీరుతో పాటు ఇంకేదో తాగారని చెప్పారు మీరు. బాగా మత్తులో ఉన్నారు అప్పుడు” చెప్పింది దమయంతి.

“ఏమోనే అంత ఇదిగా గుర్తు లేదు, పైన పడుకున్నాం అది గుర్తే” అన్నాడు రాము.

ఇంతలో “దమయంతీ” అంటూ ముసలావిడ పిలిచింది. దమయంతి వెళ్ళింది.

ముహూర్తం వేళయింది. అన్నీ ఒక్కొక్కటి జరగసాగాయి.

పెళ్ళి పూర్తయింది.

అందరూ భోజనాలకి కూర్చున్నారు. చంద్రం, దమయంతి ఎదురెదురుగా కూర్చున్నారు.

చంద్రం దమయంతినే చూడసాగాడు. ఇంతలో ఆవకాయ వేసారు. ఆవకాయ ముక్కని చేతిలోకి తీసుకుని నెమ్మదిగా కొరుకుతూ దమయంతిని చూడసాగాడు.

దమయంతి కూడా చంద్రం వంకే చూడసాగింది. అతను అలా కొరకడంలో అర్ధం బోధపడినట్టుగా, తలూపుతూ నవ్వింది.

చంద్రానికి మహదానందంగా ఉంది. ఇండియా వచ్చి మంచి పని చేసానని, గొప్ప నిర్ణయం తీసుకున్నాని అతనకి గర్వంగా అనిపించసాగింది.

భోజనాలు ముగించారు.

ఒక్కొక్కరు మండపం నించి వెళ్ళసాగారు. కొంతమంది కిందున్న పరుపుల మీద నడుం వాల్చి విశ్రమించారు. చంద్రం కూడా కునుకు తీద్దామని పడుకున్నాడు. నిద్ర పట్టేసింది.

దమయంతి కూడా పడుకుంది.

ఒకరి కలలోకి మరొకరు రాసాగారు.

“చంద్రం చంద్రం” ఎవరో పిలిస్తున్నట్టు అనిపించి కళ్ళు తెరిచాడు చంద్రం.

ఎదురుగా రాము.

“బాగా అలిసిపోయినట్టున్నావ్, ఎంత లేపినా లేవలేదు” నవ్వుతూ అన్నాడు రాము.

“ఔనురా, మంచి నిద్ర పట్టింది” బదులిస్తూ చుట్టూ చూసాడు చంద్రం.

నలుగురైదుగురు తప్ప ఎవరూ లేరు. పైనంతా ఖాళీ.

“ఏంటిరా రాము. అందరూ వెళ్ళిపోయారా ఏంటీ” అడిగాడు చంద్రం.

“ఔనురా. పెళ్ళి, భోజనాలు అయ్యాయి. లోకల్ వాళ్లందరూ వెళ్ళిపోయారు. పొద్దున్నే బస్, ట్రెయిన్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళారు. అందుకే ఖాళీ అయింది” చెప్పాడు రాము.

“అయితే నేను కూడా హోటల్ కెళ్తానురా”

“సరేరా. నీకు ఎప్పుడు కుదురుతుందో చెప్పు. అప్పుడు బయటకి వెళ్దాం”

ఇంతలో వచ్చింది దమయంతి.

“అన్నయ్యా ఎక్కడికి ఇప్పుడు ప్రయాణం” అడిగింది.

“మనింటికేనే. ఇక్కడంతా అయ్యాక ఇంటికెళ్దాం. చంద్రం హోటల్కి వెళ్తాడు. సాయంత్రమో, రేపో వస్తాడు మనింటికి” అని దమయంతితో అంటూ… “అంతేనా చంద్రం” అని చంద్రాన్ని అడిగాడు రాము.

“అంతేనా అంటే, ఇంకా వ్రతాలు, అవీ ఇవీ ఉంటాయి కదా. నాలుగు రోజులాగే వస్తానులే” అన్నాడు చంద్రం.

“ఊళ్ళో ఇల్లు పెట్టుకుని, స్నేహితుడివై ఉండి, నాలుగు రోజులాగి రావడమేమిటిరా. అయినా నువ్వు అబ్బాయి తరఫు కదా. ఎంత ముందైనా రావచ్చు. ఎన్ని రోజులయినా ఉండచ్చు” నవ్వుతూ అన్నాడు రాము.

“ఔను ఈ రోజే రండి” చంద్రాన్ని చూస్తూ నవ్వుతూ అంది దమయంతి.

ఇంతలో కుర్రాడొకడు వచ్చి, దమయంతిని పిలుచుకెళ్ళాడు.

“నీ ఇష్టంరా చంద్రం. వద్దాం అనుకుంటే రా, లేదు రెస్ట్ తీసుకుని నీకు ఎప్పుడు వీలయితే అప్పుడు రా” అన్నాడు రాము.

“వస్తానురా. నాకు పనులేమీ లేవులే. హోటల్ కెళ్ళి, రెడీ అయ్యి వస్తాను” అన్నాడు చంద్రం, ముందు వెళ్తున్న దమయంతిని చూస్తూ.

1 Comment

  1. ఇంత వరకు వేరే website లో వుంది….నీకు సిగ్గు , దమ్ము వుంటే నెక్స్ట్ update ఇవ్వు…ఇలా already వున్నది పోస్ట్ చేసి ,స్టోరీ stop చెయ్యకు???

Comments are closed.