ఒక కధ లైన్ అనుకున్నాను. సెక్స్, కొంచెం హాస్యం, చివరిలో ట్విస్ట్. రాయడం మొదలుపెట్టాను. కొంత రాసాకా, అనుకున్నదానికి భిన్నంగా కధ ఎమోషనల్ అయింది. బానే వస్తోంది. కంటిన్యూ చేద్దాం అని ఉంది.
ముందు అనుకున్న సెక్స్, హాస్యం, ట్విస్ట్ కధ తరువాత రాయచ్చు అనిపించింది.
ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు రెండు కధలూ రాయాలని ఉంది. కాకపోతే రెండు కధలకీ నేపధ్యం ఒకటే. కానీ ఒకే విషయం పట్ల, పాత్రలు ప్రవర్తించే తీరు వేరు, ఆ తర్వాత జరిగేవి వేరుగా ఉంటాయి. దేనికదే బాగుండచ్చు.
ముందు ఎమోషనల్ కధ ఇస్తాను. మొదటి భాగం రాసాను, మీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం.
“కానివ్వండి కానివ్వండి ముహూర్తం వేళయింది” అరుస్తోంది ఒక ముసలావిడ.
“అబ్బా అమ్మా, ముహూర్తం ఎప్పుడో రాత్రికి. ముహుర్తానికి ఇంకా ఆరు గంటలు ఉంది. నువ్వు హైరానా పడి, మమ్మల్ని హైరానా పెట్టకు” వివరించింది ముసలావిడ కూతురు దమయంతి.
“నోరు మూసుకోవే, ఆరు గంటలంటే ఎక్కువేమీ కాదే. నీ బుద్ధే నీ కూతురికి కూడా వచ్చింది. పెళ్ళి పెట్టుకుని ఫోన్లో ఆ మంతనాలేంటే. ఒసేయ్ అమ్మాయ్, ఆ ఫోన్ పెట్టేసి రావే” కసురుకుంది ముసలావిడ.
“అబ్బా అమ్మమ్మా, ఆయన మాట్లాడుతున్నారు. లేకపోతే ఇప్పుడు ఫోన్లో ఎందుకు ఇంతసేపు మాట్లాడతాను” విషయం చెప్పింది పెళ్ళికూతురు.
“ఇంకా పెళ్లవ్వలేదు, అప్పుడే ఆయనా, మొగుడు అనకు” సణిగింది ముసలావిడ.
అతిధులు ఒక్కొక్కరు వస్తున్నారు. అబ్బాయి తరఫు వాళ్ళు ఒక వైపు, అమ్మాయి తరఫు వాళ్ళు ఇంకొక వైపు కూర్చున్నారు. ఆడ పెళ్ళివారు అందరికీ కాఫీ ఇస్తున్నారు.
“అమ్మాయ్ దమయంతీ, పైన అబ్బాయి తరఫు వాళ్ళెవరో ఇప్పుడే వచ్చారుట, కాఫీలు అందాయో లేదో కనుక్కోమంటున్నారు” లోపలి నించి కాఫీలు తెస్తూ చెప్పింది ముసలావిడ.
“నేను పైన స్టోర్ రూంకి ఎలాగు వెళ్ళాలమ్మా, ఏది ఆ కాఫీలు ఇటివ్వు, నేను తీసుకుళ్తాను” అంది దమయంతి.
కాఫీలు తీసుకుని పైకెళ్ళింది. అబ్బాయి తరఫు వాళ్ళకిచ్చి కిందికి దిగసాగింది.
ఇంతలో “దమయంతీ” అని పిలిచారు పై నించి ఎవరో.
వెనక్కి తిరిగి చూసింది.
దూరపు చుట్టం, వరసకు అన్నయ్య అయ్యే రాము కనిపించాడు.
“అరే అన్నయ్యా, ఎన్నాళయింది నిన్ను చూసి” అంటూ పలకరించింది.
“ఎన్నాళయినా, నీ కూతురి పెళ్ళి అని తెలిసి వచ్చానమ్మా” బదులిచ్చాడు రాము.
ఇంత వరకు వేరే website లో వుంది….నీకు సిగ్గు , దమ్ము వుంటే నెక్స్ట్ update ఇవ్వు…ఇలా already వున్నది పోస్ట్ చేసి ,స్టోరీ stop చెయ్యకు😏😏😏