భంగం 441

“మా అమ్మాయి, పెళ్ళికి ముందే ఆశీర్వదిస్తావని పిలిచాను” అంటూ అక్షింతలు ఇచ్చింది దమయంతి.

“అచ్చం మీ అమ్మ లాగా ఉన్నావమ్మా. దేవుడు చల్లగా చూడాలి.” అని అక్షింతలు వేసాడు చంద్రం.

అమ్మాయి బయటికెళ్ళింది.

“నీ కూతురిని చూస్తుంటే నాకు నిన్ను చూస్తున్నట్టే ఉంది దమయంతీ, అప్పటి నీ రూపమే నా కళ్ళ ముందు కదులుతోంది” అన్నాడు.

“నాకు కూడా. అప్పటి మీ రూపమే కనిపిస్తోంది. మీరు అప్పట్లో వేసుకున్న చెక్స్ షర్ట్స్ నాకు ఇంకా గుర్తు” అంది.

“ఔనా, అపట్టి చెక్స్ షర్ట్ కూడా గుర్తేనా నీకు” ఆశ్చర్యపోయాడు.

“ఔను, మీరు ఎక్కువ అవే వేసుకునేవాళ్ళు కదా, మా రామన్నయ్య కూడా. అప్పటి ఫ్యాషన్ అదే కదా. అలానే మిమ్మల్ని చివరిసారి చూసినప్పుడు, మనిద్దరం గదిలో ఉన్నప్పుడు, మీరు పారిపోయినప్పుడు వేసుకున్నది కూడా చెక్స్ షర్టే కదా”

“నిజమే దమయంతీ. ఆ రోజు ఇప్పటికీ కళ్ళ ముందు అలానే ఉంది”

“అందుకే పెళ్ళయ్యాక ఉండండి. అన్నీ నెమరేసుకుందాం. ఆ రోజుల్లోకి వెళ్ళొద్దాం” అంటూ అతని చేతిని నొక్కి బయటకి వెళ్ళింది.

ఏదో దమయంతిని చూద్దాం అన్న ఒక్క కారణంతో ఇండియా వచ్చిన చంద్రానికి, ఇదంతా కలలా అనిపించసాగింది.

పెళ్ళి కార్యక్రమం మొదలయింది. దమయంతి వచ్చి రాము పక్కన కూర్చుంది.

“అక్కడే ఉండవే” అన్నాడు రాము.

“కాసేపు కూర్చుని వెళ్తాను. కాళ్ళు నెప్పిగా ఉన్నాయి” బదులిచ్చింది దమయంతి.

“బామ్మ చేసిన ఆవకాయ కోసం వచ్చేవాళ్ళు కదా నీ ఫ్రెండ్స్” పాత రోజులు గుర్తు చేస్తూ, చంద్రాన్ని చూస్తూ, రాముతో అంది.

“ఔనే దమయంతీ, మా ఫ్రెండ్స్ అందరికీ బామ్మ చేతి ఆవకాయంటే ఇష్టం. చంద్రానికి కూడా. ఒక్కోసారి మేము బయట ఉన్నప్పుడు, భోజనం టైం అయిందని ఆవకాయ పచ్చడి కోసం తొందరగా ఇంటికి వెళ్దాం అనేవాడు చంద్రం. ఇప్పుడు అమెరికాలో రకరకాల క్యూసిన్లు అలవాటై ఉంటాయి, మన ఊరి రుచి మర్చిపోయింటాడు. ఏరా చంద్రం అంతేనా.” అన్నాడు రాము.

“మొదటిసారి పరిచయమైనవి ఎలా మర్చిపోతానురా. మీ ఇంట్లో పరిచయమైనవి ఏవైనా నాకు ఇప్పటికీ ఇష్టమే. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మీ ఇంటి ఆవకాయ నాకు ఇష్టమే. నేను వెళ్ళేప్పుడు ఇవ్వండి, ఇంటికి పట్టుకుపోతాను” అన్నాడు చంద్రం.

అందరూ నవ్వారు.

“ఆ మామిడి చెట్టు ఇంకా ఉందా రాము?” అడిగాడు చంద్రం.

“నిక్షేపంగా ఉంది. ఇంకా కాయలనిస్తోంది” బదులిచ్చాడు రాము.

“అయితే వీలయితే ఒకసారి చూస్తాను రాము. ఆ ఇల్లు, ఆ చెట్టు, ఆ జ్ఞాపకాలు చాలా ఉన్నాయిరా, మర్చిపోలేను ఆ రోజుల్ని” దమయంతిని చూస్తూ అన్నాడు చంద్రం.

“దానికేం భాగ్యం. పెళ్ళయ్యాక చూద్దాం. నువ్వేమీ రేపొద్దున్నే వెళ్లవు కదా. వారం, పది రోజులు ఉంటావు కదా?” అడిగాడు రాము.

“ఇన్ని రోజులు ఉండాలి అనుకొని రాలేదు. ఇప్పుడైతే కొన్ని రోజులు ఉందామనే ఉంది”… ఏమంటావు అన్నట్టు దమయంతిని చూస్తూ అన్నాడు చంద్రం.

“దమయంతి వాళ్ళ ఇల్లు అలానే ఉంది. పెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయాక అంతా ఖాళీ. రెండు రోజులు అక్కడే ఉందాం. ఆ మామిడి చెట్టు, మన కాలేజ్, వాగు, అన్నీ చూద్దాం” చెప్పాడు రాము.

“ఉండండి, ఇక్కడ ఎవరు ఎవరికి కొత్త” రమ్మన్నట్టు తల ఊపుతూ అంది దమయంతి.

1 Comment

  1. ఇంత వరకు వేరే website లో వుంది….నీకు సిగ్గు , దమ్ము వుంటే నెక్స్ట్ update ఇవ్వు…ఇలా already వున్నది పోస్ట్ చేసి ,స్టోరీ stop చెయ్యకు???

Comments are closed.