భంగం 511

“నేను మాత్రం ఏడవలేదా”

“ఒక్కసారి కూడా రాలేదు చూడటానికి”

“మా నాన్నగారు పంపలేదు. ఆ వయసులో ఆయనని ఎదిరించలేకపోయాను”

“ఇప్పుడు మాత్రం ఎందుకొచ్చినట్టు”

“నిన్ను చూడాలని. మా వాళ్ళ అబ్బాయి చేసుకుంటోంది మీ అమ్మాయినని తెలిసింది. అందుకే అమెరికా నించి ఈ పెళ్ళి కోసమనే వచ్చాను”

“మీ భార్యా, పిల్లలు?”

“అమెరికాలోనే ఉన్నారు. నేనొక్కడినే వచ్చాను. మీ వారు…?”

“రెండేళ్ళయింది”

“ఎలా?”

“గుండెపోటు”

“ఐ యాం సారీ దమయంతి”

తలూపింది.

“కష్టపడి అమ్మాయి పెళ్ళి చేస్తున్నావు. నిన్ను ఇలా చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది”

“నాకు కూడా. ఇన్నేళ్ళ తర్వాత చూస్తున్నా కదా. అప్పటి విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. నాకు ఆ వయసులో ఉన్నట్టే ఉంది మిమ్మల్ని చూస్తుంటే” ఆనందం పట్టలేక అంది.

“నాకు కూడా అలానే ఉంది. నువ్వు లంగా, ఓణిలో పరిగెత్తడం, నేను నీ వెనక రావడం. ఒకసారి నువ్వు మామిడిపళ్ళు కోసుకుంటావని నిన్ను పైకెత్తడం, మీ బామ్మ రావడం. మర్చిపోలేను ఇవ్వన్నీ” నవ్వుతూ అన్నాడు.

“అయితే మీకన్నీ గుర్తున్నాయి”

తలూపాడు.

“పెళ్ళి అయ్యాక కూడా ఉండండి. మిమ్మల్ని చూస్తుంటే, ఆ రోజులు తలుచుకుంటుంటే, కాలం నిజంగా వెనక్కి తిరిగినట్టుగా ఉంది. ఉండండి, మాట్లాడుకుందాం” అని చేతులు పట్టుకుని అడిగి, బదులు కోసం చూడకుండా కిందికి వెళ్ళింది దమయంతి.

చంద్రానికి చాలా సంతోషం వేసింది. దమయంతిని చూసినందుకు, దమయంతికి అప్పుడు జరిగినవన్నీ గుర్తున్నందుకు, దమయంతి ఉండమన్నందుకు చాలా సంతోషం వేసింది. ఇండియా వచ్చి మంచి పని చేసాను అనుకున్నాడు.

పైన తన వాళ్ళ దగ్గర ఉండకుండా, కిందికి వచ్చి కూర్చుని దమయంతి ఎప్పుడు కనిపిస్తుందా అని చూస్తూ ఉన్నాడు.

పెళ్ళి పనుల హడావిడిలో అటూ, ఇటూ తిరుగుతూ, మధ్యలో చంద్రం కనిపించినప్పుడు చూసి నవ్వుతూ ఉంది దమయంతి.

కొంత టైం గడిచింది.

ఒక కుర్రాడు చంద్రం దగ్గరికి వచ్చాడు.

“పెద్దమ్మ పిలుస్తోంది, అక్కవాళ్ళు ఆ గదిలో ఉన్నారు” అని చెప్పి వెళ్ళాడు.

దమయంతి పిలుస్తోందా అనుకుంటూ కుర్రాడు చెప్పిన గదిలోకి వెళ్ళాడు చంద్రం.

లోపల గదిలో దమయంతి, కూతురు ఉన్నారు.

1 Comment

  1. ఇంత వరకు వేరే website లో వుంది….నీకు సిగ్గు , దమ్ము వుంటే నెక్స్ట్ update ఇవ్వు…ఇలా already వున్నది పోస్ట్ చేసి ,స్టోరీ stop చెయ్యకు???

Comments are closed.