రాము మండపంలోకి, చంద్రం హోటల్కి వెళ్ళారు.
రెండు గంటలు పడుకుని, లేచి, టిఫిన్ తిని, రెడీ అయ్యి రాముకి ఫోన్ చేసాడు చంద్రం.
అందరూ దమయంతి వాళ్ళింట్లో ఉన్నారని చెప్పాడు రాము.
“ఒక్కడివే వెతుక్కుంటూ రాగలవా” అడిగాడు రాము.
“వస్తానురా. గుడి ఉంది కదా వీధి మొదట్లో” అడిగాడు చంద్రం.
“ఉంది. గుడి గుర్తుంది కదా, అయితే ఇబ్బంది లేదు, వచ్చెయ్” అంటూ ఫోన్ పెట్టాసాడు రాము.
ముప్పైఅయిదు ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ ప్రాంతం, దమయంతి వాళ్ళ ఇల్లు చూడబోతున్న ఆనందంతో బయటకి వచ్చాడు చంద్రం.
ఆటో ఎక్కి ఏరియా పేరు చెప్పి, గుడి దగ్గర ఆగాడు.
గుడి నించి నడుచుకుంటూ వస్తున్నాడు. మొత్తం మారిపోయింది. ఒక్క బిల్డింగ్ కూడా గుర్తు పట్టలేకపోయాడు. అన్నీ కొత్తగా కట్టినట్టు ఉన్నాయి. నడుస్తున్నాడు. పాత ఇళ్ళు మొదలయ్యాయి. దమయంతి వాళ్ళ ఇల్లు కనిపించింది. అతని మనసుకి చెప్పలేని ఆనందం కలిగింది.
లోపలికి వెళ్ళాడు చంద్రం. అప్పటిలానే ఉంది ఇల్లు. ఏదీ మారలేదు.
రాము కనిపించాడు. నవ్వాడు.
“ఏరా వచ్చావా, రా. ఎలా ఉంది ఇల్లు. అప్పటికీ, ఇప్పటికీ ఏమీ మారలేదు కదా” అన్నాడు రాము.
తలూపాడు చంద్రం.
“భోజనం వేళకొచ్చావు. అయిపోతోంది లోపల. కాసేపట్లో తినేద్దాం”
తలూపాడు చంద్రం.
“ఒకసారి లోపల చూస్తాను” అన్నాడు చంద్రం.
దమయంతిని చూడాలని అతని కోరిక.
“నువ్వెళ్ళరా, నేను ఒకటి ముట్టుసాను” అంటూ సిగరెట్ ముట్టించాడు రాము.
లోపలికెళ్ళాడు చంద్రం.
దమయంతి కనిపించింది. చంద్రాన్ని చూడగానే నవ్వింది.
లోపల ఎక్కువమంది లేరు. కార్యక్రమం కూడా అయిపోవచ్చింది.
“వచ్చారా. సంతోషం”
నవ్వాడు.
“మామిడి చెట్టుని చూసారా”
లేదన్నట్టు తలూపాడు.
“రండి” అంటూ ముందు నడిచింది.
ఇద్దరూ చెట్టు దగ్గరికెళ్ళారు.
అలానే ఉంది చెట్టు. అన్ని ఏళ్ళయినా అలానే ఉండటంతో ఆనందంతో చెట్టుని తాకాడు.
దమయంతి వైపు చూసాడు. దమయంతికి విషయం అర్ధమై నవ్వింది.
“ఆ రోజు కాయల కోసం నన్ను ఎత్తారు కదా. నాకు ఎగిరితే అందేవి. మీరు కావాలనే ఎత్తారు కదా” నవ్వుతూ అంది.
“ఔను. మరి నీకు అందుతాయి అనుకున్నప్పుడు ఆ మాట చెప్పచ్చు కదా” నవ్వుతూ అన్నాడు.
“మీరు ముట్టుకుంటే బాగుంటుందని” అతని చేతిని పట్టుకుంటూ అంది.
“నాకు ఇప్పుడు కూడా ఎత్తాలని ఉంది” ఆమె చేతిని నొక్కుతూ అన్నాడు.
నవ్వింది.
అంతే ఒక్కసారి దమయంతిని గట్టిగా పైకి ఎత్తి కిందికి దించాడు.
ఇంత వరకు వేరే website లో వుంది….నీకు సిగ్గు , దమ్ము వుంటే నెక్స్ట్ update ఇవ్వు…ఇలా already వున్నది పోస్ట్ చేసి ,స్టోరీ stop చెయ్యకు😏😏😏