జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 11 54

మహి అటు వైపుకు వెళ్ళగానే నా చేతితో కలిపి అత్తయ్యకు తినిపించి , నన్ను తినమనగా నోటిలో పెట్టుకొని తినగా అద్భుతంగా ఉండగా , చాలా రుచిగా ఉన్నాయి అని మహి వైపు కళ్ళు చూడగా వెంటనే వర్షిని వైపు తిరిగి అద్భుతంగా చేశారు వర్షిని అని పొగుడగా అంతా అక్కే చేసింది అక్కనే పొగడండి మామయ్య అని వొంగి తినసాగింది. మహి కళ్ళల్లోకి సూటిగా చూడలేక పోతుండటంతో మాట మార్చి అత్తయ్యకు తినిపిస్తూ , చిన్నా తింటూ ఏదో జోక్ చెప్పగా అందరూ పగలబడి నవ్వుతూ సంతోషంగా తినసాగాము.

అత్తయ్య కళ్ళల్లో సంతోషంతో ఆనంద భాస్ఫాలు కారగా మహి వచ్చి తన పైటతో తుడిచి ఎన్ని సంవత్సరాలు అయ్యిందమ్మా నువ్వు ఇలా సంతోషంగా నవ్వి అని తనలో తాను అనుకుంటూ ఆనందపడసాగింది కడుపు నిండా అంతకన్నా ఎక్కువే సంతోషంగా తినడంతో నడవడానికి కూడా వల్ల కాక సోఫాలో కూర్చుండిపోయాను , అత్తయ్య మరియు వర్షిని మహికి వడ్డించగా 2 గంటలకళ్ల అందరూ భోజనం చేసేయ్యగా , అత్తయ్య, మహి అన్ని లోపలకు తీసుకుని వెళ్లగా , వర్షిని తన చేతిలో ఒక బ్యాగును పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి నా పక్కనే సోఫా లో కూర్చొని తన ఫంక్షన్ ఫోటోల ఆల్బమ్ ను నాకు ఇచ్చి నా చెయ్యి చుట్టూ రెండు చేతులు వేసి , నా భుజం పై తల వాల్చగా , “ఎవరు తీసుకు వచ్చారు” అని అడుగగా “స్టూడియో వాళ్ళు నిన్ననే ఆల్బమ్ మరియు వీడియో సీడీ ఇచ్చి వెళ్లారు , మేమందరం చూసాము చాలా బాగున్నాయి , నా స్నేహితులందరూ నా ఫంక్షన్ ను చూసి అసూయ పడుతూ పొగుడుతుంటే నాకు చాలా సంతోషం వేసింది మామయ్య, నువ్వు లేకుంటే అసలు ఇంట్లో కూడ జరిగేది కాదు” అని కన్నీళ్లు కారుస్తూ “థాంక్స్ మామయ్య” అని నా చెంపపై ముద్దు పెట్టి ఆనందంగా చెప్పగా , ఆ ముద్దుతో ఆ రోజు పడిన కష్టమంతా తక్కువే అనిపించి, వర్షిణికే భాకి పడిపోయాను.

“నేనుండగా అసలు అలా జరగనివ్వను, మీరంటే ఈ మామయ్యకు ప్రాణం” అని తన కన్నీళ్లను తుడిచి , “నువ్వు నవ్వితే ఫోటోలు చూస్తాను” అని చెప్పగా అలాగే మామయ్య అని కళ్ళు తుడుచుకుంటూ నవ్వగా , ఒక్కొక్కటే తెరిచి చూస్తుండగా తను వాళ్ళు వీళ్ళు అని చెప్పసాగింది.

చిన్న పరిగెత్తుకుంటూ వచ్చి తన పుట్టినరోజు ఆల్బమ్ తెచ్చి నా తొడలపై కూర్చుంటూ “మామయ్య ముందు నా ఫంక్షన్ జరిగింది కాబట్టి నా ఫోటోలు చూడూ” అని మారాం చెయ్యగా , వర్షిని కి కన్ను కొట్టి చిన్న చేతిలో ఉన్న చిన్న ఆల్బమ్ తిరగేస్తూ చూస్తుండగా, అత్తయ్య నా కుడివైపుకు వచ్చి నా కుడిచేతి చుట్టూ తన ఎడమ చెయ్యి వేసి నా భుజం పై తల వాల్చి దగ్గరగా హత్తుకొని ఫోటోలు చూస్తుండగా కొన్ని ఫోటోలలో అత్తయ్య కోపంగా , కొన్ని ఫోటో లలో బుంగ మూతి పెట్టుకొని ఉండగా చిన్నా వాటిని చూపించి నవ్వగా , మేము ముగ్గురు పగలబడి నవ్వగా , అత్తయ్య కోపంతో బుంగ మూతి పెట్టుకోగా, పిల్లలిద్దరూ ఆల్బమ్ వైపు చూస్తుండగా , అత్తయ్య బుంగ మూతిపై ముద్దు పెట్టి తీసేయ్యగా ఆశ్చర్యంగా నా వైపు చూడగా “sorry అత్తాయ్య” అని రెండు చెవులపై చేతులు వేసి సైగలు చెయ్యగా కోపం మొత్తం పోయి పగలబడి నవ్వగా హమ్మయ్య అనుకోని అందరూ గట్టిగా నవ్వుతుండగా ఏమయిందో అని మహి పరిగెత్తుకుంటూ రాగా మా నవ్వు చూసి ఆనందపడసాగింది. నేను మాత్రం మౌనంగా ఉండిపోగా మహి లోపలికి వెళ్ళిపోయింది.

1 Comment

Comments are closed.