జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 11 54

లోపలికి వెళ్ళి మెనూ కార్డ్ పిల్లలకు ఇచ్చి మనం ఇప్పుడు పిక్నిక్ కు వెళ్తున్నాము కావున మీకు ఏమేమి కావాలో ఆర్డర్ చెయ్యమని ఒక వెయిటర్ ను పిలిచి నోట్ చేసుకొమ్మని చెప్పగా , అవునా మామయ్య అని సంతోషంగా నవ్వుతూ వాళ్లకు ఇష్టమైన చాలా వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ వరుసగా చూస్తూ చెప్పగా వాళ్ళు చెప్పినవన్నీ 5 మందికి చల్లారకుండా హాట్ బాక్స్ లో మరియు ice cream , కూల్ డ్రింక్స్ , నీళ్ల బాటిల్ లను ice క్యూబ్స్ బాక్స్ లో ప్యాక్ చేసి ఒక సెట్ పేపర్ ప్లేట్స్ తో సహా పెట్టివ్వమనగా , సర్ దానికి extraa ఖర్చు అవుతుంది సర్ అని చెప్పగా, సరే అని చెప్పి ఏమనుకోకుండా కొద్దిగా త్వరగా చెయ్యండి అని చెప్పగా, అలాగే సర్ అని వెంటనే లోపలికి వెల్లసాగాడు.

ముగ్గురు పక్కనే ఉన్న సోఫాలో కూర్చోని అవి వచ్చేలోపు పిల్లలకు రెండు ice cream లు తెప్పించగా వాళ్ళు తింటూ నాకు కూడా తినిపిస్తూ తినసాగారు. ఇంకా ఒకటి తెప్పించబోగా, చాలు మామయ్య పిక్నిక్ లో తిందాము అని చెప్పగా ఒక నీళ్ల బాటిల్ తెప్పించి వాళ్లకు తాగమని ఇచ్చాను.

ఒక అర గంటలో మొత్తం శుభ్రన్గా గాలి దూరకుండా ప్యాక్ చేసి కౌంటర్ దగ్గరికి బిల్ తో పాటు తీసుకొని రాగా కార్డ్ తో స్వైప్ చేసేయ్యగా , ఓనర్ ఇద్దరిని పిలిచి ఎక్కడ పెట్టించమంటారు అని అడుగగా బయట కారుని చూపించగా వాళ్ళు ఎత్తుకొని తమ వెంటే రాగా కారు డిక్కీలో పెట్టించి వాళ్లకు థాంక్స్ చెప్పి ఇద్దరికి డబ్బు ఇవ్వగా థాంక్స్ సర్ అని చెప్పి వెళ్లిపోయారు.

1 Comment

Comments are closed.