జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 11 54

ఆల్బమ్ లోని ఫోటోలను తిరగేస్తూ కామెంట్ లు చేసుకుంటూ , ఫన్నీ గా ఉన్న వాటిని చూస్తూ పగలబడి నవ్వుతూ , సంతోషంతో అందరి కళ్ళల్లో నీళ్ళు కారసాగాయి. ఎక్కువగా మాట్లాడుతూ , నవ్వుతూ మరియు కేకలు పెడుతూ అలసిపోయి ఒక్కొక్కరుగా నా ఒడిలో ముగ్గురు నిద్రపోసాగారు . ముగ్గురికి ప్రేమగా ముద్దు పెట్టి చిన్నా మరియు వర్శిని తలలపై చేతులు వేసి నిమురుతూ జో కొడుతూ ఎప్పుడు నిద్ర పొయ్యానో నాకే తెలియకుండా సోఫా పై వెనక్కు వాలి నిద్రపోయాను.

చాలసేపటి తరువాత ఎవరో ప్రేమగా నా నుదుటి నుండి వెనుక వరకు వెంట్రుకలను నిమురుతున్నట్లుగా మెలకువ వచ్చి వెనక్కు చూస్తే ఎవరు లేకపోవడంతో , కచ్చితంగా మహినే అయ్యి ఉంటుందని కదలగా అందరికి మెలకువ రాగా, కలలో ఎవరో చెప్పినట్లు కళ్ళు తెరిచి వెంటనే కళ్ళు చేతులతో తుడుచుకుంటూ “మామయ్య సినిమా కు పోదాం” అని గట్టిగా చెప్పగా ,సమయం చూడగా 4:30 గంటలు అవుతుండగా , వర్శినిని అడుగగా “పోదాం మావయ్య సినిమా కు వెళ్లి చాలా నెలల అయ్యింది” అని చెప్పగా , అత్తయ్య వైపు చూడగా సరే అన్నట్లు తల ఊపగా , త్వరగా రెడి అవ్వండి అని చెప్పి, వర్షిని మహి అక్కయ్యను కూడా రెడి అవ్వమని చెప్పగా , చిన్నా మేము సినిమాకి పోతాం , మేమందరు సినిమా కి పోతాం అని గట్టిగా అరుస్తూ తన రూం లోకి వెళ్లగా మిగిలిన ముగ్గురు నవ్వుకోసాగాము.అత్తయ్య రూమ్ కు వెళితే కంట్రోల్ తప్పి లేట్ అయిపోతుందని, నేను కూడా చిన్నా రూమ్ కు వెళ్లి ఫ్రెష్ అవ్వసాగాను.

నేను చిన్నా 15 నిమిషాలలో రెడి అయ్యి సోఫా లో కూర్చుని మిగిలిన వారందరి కోసం ఎదురు చూస్తూ ఉండగా అర గంట అయినా రాకపోవడంతో వర్షిని ఆల్బమ్ తీసుకొని తిరగేస్తూ చూడసాగాను. సరిగ్గా ఒక గంట తరువాత ముందుగా వర్షిని తరువాత మహి నేను తెచ్చిన డ్రెస్సులు వేసుకొని అందంగా రెడి అయ్యి వచ్చారు. వాళ్ళను చూడటానికి నా రెండు కళ్ళు సరిపోవట్లేదు. వెంటనే అత్తయ్య నేను , అమ్మ ఇష్ఠంగా సెలెక్ట్ చేసిన చీరను మొదటి సారిగా కట్టుకొని మెట్లు దిగి వస్తుండగా నేనే కాదు నాతో పాటు ముగ్గురు నోరెల్లపెట్టి చూస్తూ ఉండిపోయాము.

అత్తయ్య మాదగ్గరికి రాగా నలుగురం ఓకేసారిగా “బ్యూటిఫుల్” అని కోరస్ గా చెప్పగా, అందరూ ఒకరి ముఖాలు మరొకరు ఆశ్చర్యంగా చూసుకుంటూ నవ్వుకోసాగాము. అందరూ బయటకు నడువగా మహి ఇంటి తాళాలు వేస్తుండగా మేము కారు దగ్గరికి వెళ్లగా చిన్నా వెనుక సీట్లో అత్తయ్య దగ్గర కూర్చోగా , వర్షిని వెనుకకు వెళ్లి కూర్చుంటుండగా ముందుకు రమ్మని పిలువగా “థాంక్స్ మామయ్య” అని నవ్వుతూ వచ్చి ముందు సీట్లో కూర్చొనగా మహి వచ్చి నా పక్కన వర్శినిని చూసి బాధపడుతూ వెళ్లి వెనుక కూర్చోగా, బాధ వేసి మహితో మాట్లాడాలి అని సరైన సమయం కోసం ఎదురు చూడసాగాను.

1 Comment

Comments are closed.