జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 11 54

8 గంటలకు ఇద్దరు సంతోషంగా ఒకరి చేతిలో మరొకరు చేతిని వేసుకొని నవ్వుతూ కిందకు రాగా , మహి ఇద్దరు సంతోషంగా ఉండటాన్ని చూసి ఆనందిస్తూ బావ tiffen రెడీగా ఉంది వడ్డించినా అని అడుగగా ,పిల్లలు , నువ్వు తిన్నారా? అని అడుగగా , పిల్లలు ఇప్పుడే తిన్నారు , మీరు తిన్నాక నేను తింటాలే బావ అని చెప్పగా, ఆహ్ లవ్ యు మహి ఆకలి చంపేస్తుంది అని తన నుదుటి పై ముద్దు పెట్టి త్వరగా తీసుకుని రా అని చెప్పగా థాంక్స్ బావ అని పరిగెత్తుకుంటూ వంట గదిలోకి వెళ్లి వేడిగా ఉన్న పూరి కుర్మా తీసుకుని వచ్చి ప్లేట్ లోకి పెడుతుండగా ,తనని కూడా మాతోపాటు కూర్చోబెట్టుకొని కుర్మాను నేనే ఆత్రంగా వేసుకొని అత్తయ్యకు మరియు మహికి స్వయంగా నేనే తినిపిస్తూ నేను తినసాగాను.

మహి పూరీలు కుర్మా రెండు రుచితో పోటీపడుతున్నాయి అని లొట్టలేసుకుంటు తినసాగాము. ఇద్దరు నన్ను కళ్ళల్లో ఆనంద భాస్పాలు నింపుకొని ఆరాధనగా , ప్రేమగా చూడసాగారు. అర గంట వరకు నెమ్మదిగా తినేసి పైకి లేచి, చిన్నా ఎక్కడ అని సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న వర్శినిని అడుగగా పగలబడి నవ్వుతూ రా మామయ్య చూపిస్తాను అని బయట గేట్ వరకు నా చెయ్యి పట్టుకొని పిలుచుకొని వెళ్లి పక్కింటి పిల్లాడు పాత సైకిల్ ను తొక్కుతుండగా అన్నా ,అన్నా నాకు ఒక రౌండ్ ఇవ్వన్నా అని బతిమాలుతుండగా , వాడు రేయ్ చిన్నా నువ్వు సైకిల్ అంత లేవు నా సైకిల్ అడుగుతావా , నేను ఇవ్వను నువ్వు పడేస్తావు , కావాలంటే తొయ్యి నిన్ను ఎక్కించుకుంటాను అంతే అని వాడు చెప్పగా సరే అన్నా అని ఆ పాత సైకిల్ తొయ్యబోతుండగా , రోజు ఇంతే మామయ్య వాడు వాణ్ణి అడగడం , వాడు చెబుతాడు కానీ ఎక్కించుకొడు , చిన్నా కు సైకిల్ అంటే చాలా ఇష్టం అని చెప్పగా , చిన్నా అని పిలువగా మామయ్య అని పరిగెత్తుకుంటూ వచ్చి నా మీదకు ఎగురగా , వర్షిని అందరూ రెడి అవ్వండి అలా కారులో బయటకు వెళదాము అని చెప్పగా , సంతోషంతో గట్టిగా అరుస్తూ మహికి , అత్తయ్యకు చెప్పగా చిన్నా కూడా లోపలికి వెళ్ళి 9 గంటలకల్లా అందరూ కొత్త బట్టలు వేసుకొని రెడి అయిపోయారు.

సెక్యూరిటీని అడిగి డాక్టర్ అడ్రస్ తీసుకొని, లోపలికి వెళ్ళి ఒక పెద్ద బ్యాగు తీసుకొని ఉతికిన towels మరియు రెండు పెద్ద రగ్గులు అందులో పెట్టుకొని కారు డిక్కీలో పెట్టేసి, నిన్న నుండి అమ్మతో మాట్లాడలేదని కాల్ చేసి క్షేమ సమాచారాలు కనుక్కుని , అత్తయ్య చెయ్యి కాలిన విషయం తెలిసి ఇక్కడికి వచ్చాను అని , ఇప్పుడు బానే ఉంది అని చెప్పగా , అమ్మ ముందు భయపడగా తరువాత తెలుసుకొని నెమ్మదించగా , అత్తయ్య క్షమించి విషయాన్ని సంతోషంగా చెప్పగా అమ్మ కూడా చాలా చాలా ఆనందపడింది.

ఆ సంతోషాన్ని దగ్గరుండి పంచుకోలేక పోతున్నందుకు చాలా బాధపడసాగింది. ఎప్పుడు భయలుదేరుతారని అడగ్గా ఈ రోజు సాయంత్ర పెళ్లి రేపు ఉదయమే బయలుదేరి నా కన్నయ్యను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆరాట పడసాగగా , మిస్ యు అమ్మ , బస్ స్టాండ్ కు వచ్చి పిక్ చేసుకుంటాను అని చెబుతూ , అంటీ ఎలా ఉన్నారు అని అడుగగా చెప్పడం మరిచిపోయాను బస్ లో ఎలా బాధ పడుతుందో ఇక్కడ కూడా అదేవిధంగా మూడి గానే ఉంది , ఎన్ని సార్లు అడిగినా మాట మారుస్తూనే ఉంది అని చెప్పగా , ఇప్పుడే కృష్ణ కి ఫోన్ చేసి గట్టిగా అడుగుతాను , మీరు జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేశాను.

వెంటనే కృష్ణకు ఫోన్ చెయ్యగా ఎత్తకవడంతో, మళ్ళీ మళ్ళీ చెయ్యగా ఎత్తకపోవడంతో కోపం వచ్చి వెంటనే కాల్ చేయరా అని msg చేసాను. రేపు మొదట వైజాగ్ వెళ్లి గట్టిగా అడగాలి అని నిర్ణయించుకున్నాను. ఒక 10 నిమిషాలలో ఆ డాక్టర్ క్లినిక్ కు చేరుకొనగా అప్పుడే డాక్టర్ క్లినిక్ తెరుస్తుండగా మహి పిల్లల్ని చూస్తూ ఉండమని చెప్పి అత్తయ్యను లోపలికి పిలుచుకొని వెళ్లగా డాక్టర్ కట్టు విప్పి అంతా పరీక్షించి కొత్త కట్టు కట్టి సెప్టిక్ ఏమి కాలేదు అవే మందులు వాడమని చెప్పగా డాక్టర్ కు ఫీస్ ఇచ్చి థాంక్స్ చెప్పి , కారులో ఒక పెద్ద రెస్టౌరెంట్ దగ్గర కారుని ఆపి పిల్లలిద్దరిని లోపలికి పిలుచుకొనివేళ్ళాను.

1 Comment

Comments are closed.