జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 11 54

నువ్వు నా హీరో వి బావ, నువ్వు ఏది చేసినా మా గురించి బాగా ఆలోచించే చేస్తావు , నువ్వు ఏది చేసినా నేను ఆనందంగా స్వీకరిస్తాను. నాకు నువ్వంటే పిచ్చి , ప్రేమ. కానీ అది తెలిసి నేను బాధపడతాను అని మధ్యాహ్నం నుండి నన్ను నీ నుండి దూరంగా పెట్టడం వల్ల ప్రతి క్షణం నా ప్రాణాలు పోతున్నట్లుగా అనిపించాయి బావ, నువ్వు కరెక్ట్ చేసిన , తప్పు చేసినా నేను జీవితాంతం సంతోషంగా నీతోనే ఉండిపోతాను” అని కన్నీళ్లు కారుస్తూ చెప్పగా, ఆ కన్నీళ్లను చూసి నా కళ్లల్లో నీళ్లు కారగా, ఒక చేతిని తన తలపై వేసి నా గుండెలపైకి లాక్కొని రెండు చేతులను మహి చుట్టూ వేసి గట్టిగా కౌగిలించుకొని ” i ‘m really really sorry mahi.

నన్ను క్షమించు, నీ గురించి తెలిసీ కూడా అలా చేసాను , నువ్వంటే నాకు ప్రాణం. అందుకే నన్ను నీకు చూపించలేకపోయాను తప్ప నిన్ను నా నుండి ఏది దూరం చెయ్యదు , చెయ్యలేదు. నీ బావను క్షమిస్తావు కదూ.” అని వీపుపై ప్రేమగా నిమురుతూ అడుగగా, నా కళ్ళల్లోకి చూస్తూ ఉద్వేగంతో “బావ నువ్వు తప్పు చేశావని ఎవరైనా అంటే వాళ్ళను ఊరికే వదలను. నన్ను తిట్టు ,కొట్టు కానీ ఆ మాట మాత్రం అనొద్దు” అని నా కన్నీళ్లను తుడవగా , తన కన్నీళ్లను నా రెండు చేతులతో తుడుస్తూ “నా కోసమే దేవుడు నిన్ను పుట్టించాడు మహి” అని ప్రేమగా నుదుటిపై ఘాడంగా ముద్దుపెట్టసాగాను.

నా పెదవులు తనను తాకగానే వొళ్ళంతా మైమరిచిపోతూ “థాంక్స్ బావ” అని నా గుండెలపై ముద్దు పెట్టి తన రెండు చేతులు నా చుట్టూ వేసి గట్టిగా కౌగిలించుకుంది. నా రెండు చేతులు తన చుట్టూ వేసి గట్టిగా హత్తుకొని తలపై ముద్దులు పెట్టసాగాను. కొద్దిసేపటి తరువాత “బావ నువ్వు వెళ్లి టీవీ చూస్తూ ఉండు నేను ఇక్కడ అన్ని సర్దాలి” అని చెప్పగా తనని విడవలేక వదిలి హాల్ లోకి వెళ్లగా, చిన్నా తన ఒడిలో పడుకోగా సంతోషంగా జో కొడుతూ చిన్నగా నవ్వుతూ టీవీ చూస్తున్న అత్తయ్యను చూడగానే ఇంకా ఎక్కువగా ప్రేమ , అభిమానం రాగా ఈ క్షణం నుండి తనకు ఏ కష్టం రాకుండా జీవితాంతం సంతోషంగా చూసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను.

1 Comment

Comments are closed.