జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 14 44

దారిలో ATM దగ్గర ఆగి కొంత డబ్బు డ్రా చేసుకున్నాను. నా కోసం కిషోర్ బయటే ఎదురు చూస్తుండగా , కారును సరాసరి లోపలికి తీసుకురమ్మని సైగ చెయ్యగా లోపలికి వెళ్ళి ఒక పక్కన ఆపి దిగగా లోపలికి పిలుచుకొని వెళ్లగా అందరూ నాకొసమే ఎదురుచూస్తుండగా వాళ్ళతో పాటు tiffen చేసి , కుటుంబ సభ్యులందరిని కొత్త బట్టలు కోసం షోరూం కు పంపించి , మామయ్య నిశ్చితార్థానికి బంధువులను , స్నేహితులను పిలవడానికి వెళ్తానని , తన అల్లుడిని నా వెంట పంపుతూ , అన్నయ్యకు డబ్బు కట్ట ఇస్తుండగా , మామయ్య నిశ్చితార్థం ఖర్చు మొత్తం ఆడపెళ్ళివారిదే అని చెబుతూ ముందుగా ఆయనకు తెలిసిన ఫంక్షన్ హాల్ గురించి చెప్పి నాకు నచ్చితే ok చేద్దాము అని చెప్పగా , మామయ్య మీకు నచ్చిందంటే నాకు నచ్చినట్లే అని చెప్పి , అన్నయ్యతో పాటు హాల్ కు చేరుకొని చూడగా చాలా గ్రాండ్ గా ఉండటంతో , అన్నయ్య సూపర్ , ఇంటికి దగ్గరగా కూడా ఉంది అని చెప్పగా , మా పెళ్లి కూడా ఇక్కడే జరిగింది మహేష్ , అందరికి సౌలభ్యంగా ఉంటుంది అని వివరించగా , రేపటి కోసం బుక్ చేసి , Decoration గురించి అడుగగా , ఒక వ్యక్తి లాప్టాప్ తెరిచి ఒక్కొక్క ఇమగె పక్కకు జరుపుతూ చూపించగా , ఏవి నాకు నచ్చకపోగా వాళ్ళను హాల్ లోనికి పిలుచుకొని వెళ్లి లాప్టాప్ లో ఉన్న ఒక్కొక్క ఫొటోలో ఉన్న అలంకరణ లలో ఆకర్షణీయమైన పార్ట్శ్ తీసుకొని ఎక్కేక్కడ ఎలా చేయాలో వివారిస్తుండగా అన్నయ్య మెచ్చుకుంటున్నట్లు నన్నే ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయాడు.

స్టేజి మీద మరియు మిగతా ముడువైపుల మొత్తం ఎలా అలంకరించాలో చెప్పి , కింద వేసిన మొత్తం ప్లాస్టిక్ కుర్చీలను తీసివేసి మొత్తం కొత్త సోఫాలను వేయాలని చెప్పి బయటకు పిలుచుకొని వెళ్లి గేట్ బరకు లైట్స్ తో అదిరిపోయేలా సెట్ చెయ్యాలని , ఏంట్రాన్క్ర్ లో welcome అని పెద్ద సెట్టు వేసి మధ్యలో పూలతో బోర్డ్ పై కిషోర్ , దివ్య ల నిశ్చితార్థం అని రాయాలని నిదానంగా అర్థమయ్యేలా వివరించి , ఏమాత్రం తేడా రాకూడదని , డబ్బు ఎంతైనా పర్లేదు అని చెప్పి సగం అడ్వాన్స్ ఇచ్చి , వంట వాళ్ళను పిలిపించమనగా ఒక నలుగురు రాగా , సాయంత్రం వచ్చే బంధువులకు సాఫ్ట్ డ్రింక్స్ తో పేస్టు రాత్రి ఫంక్షన్ తరువాత భోజనానికి ఏ ఏ వంటకాలు ఉండాలో నేను అన్నయ్య మాట్లాడుకుని ఒక పెద్ద ల్8స్ట్ ఇచ్చి రుచిలో , శుచిలో ఏమాత్రం రాజీపడకుండా వంటలు అధిరిపోవాలని , వచ్చిన బంద్Uవులు సంతృప్తితో వెళ్లాలని పదే పదే చెప్పి , అదే జరిగితే మీరు ఆడిగినదానికి రెట్టింపు ఇస్తానని చెప్పి ఆహార సామాగ్రి తెచ్చుకోవడానికిమరియు పనివాళ్లకు అడ్వాన్స్ గా డబ్బు ఇచ్చి , రేపు ఉదయాణికల్లా రెండు ఇళ్ల అడ్రస్ లు చెప్పి కొంత మందికి పంపించమని చెప్పి వచ్చిన బంధువులకు సాయంత్రం వరకు వంటలు చేస్తూనే ఉండాలని , అటు నుండి ఫోటో స్టూడియో కి వెళ్లి రేపు ఉదయం నుండి ఫంక్షన్ అయిపోయేంతవరకు రెండు ఇల్లాల్లో నలుగురు నలుగురు నిరంతరం వీడియో కవరేజ్ మరియు నలుగురు నలుగురు నాలుగు వైపులా ఫొటోస్ తీయాలని వివరించి అడ్వాన్స్ ఇచ్చి , కృష్ణకు ఫాంర్ చేసి ఎక్కడ ఉన్నారు అని అడుగగా అమ్మ , నాన్నలు బంధువులను పిలవడానికి వెళ్లారు , నేను దివ్యక్క , మీ అమ్మగారు బట్టల షోరూం కి వచ్చాము , మేము వెళ్లిన కొద్ది సేపటిికి దివ్యక్క, బావకు ఫోన్ చేసి అదే షోరూం కు రమ్మనగా వాళ్ళు , మేము కలిసి బట్టలు సెలెక్ట్ చేస్తున్నాము అని చెప్పగా , నేను అన్నయ్యకు విషయం చెప్పి ఇద్దరు అక్కడికే వెల్లసాగాము.

వాహనం లో వెళుతుండగా మహి నుండి కాల్ వస్తుండగా ముఖం పై చిరునవ్వుతో కాల్ ఎత్తగా , బావ ఎలా ఉన్నావు అని అడిగి , బావ అత్తయ్య మరియు అంటీ దివ్యను సంబంధం కుదిరిందని , రేపే నిశ్చితార్థం అని ఈ రోజే అందరూ రమ్మని చెప్పింది .

2 Comments

    1. bro madhyalo part 10 to 13 parts leva bro

Comments are closed.