జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 14 44

మేము భోజనం చేసి బస్ లో వస్తున్నాము అని చెప్పగా , సరే జాగ్రత్త అని కాల్ కట్ చేసి , వెంటనే సెక్యురిటి కి కాల్ చేసి , అన్నయ్య నేను మహేష్ మాట్లాడుతున్నాని , చిన్న రిక్వెస్ట్ అత్తయ్య వాళ్ళు వైజాగ్ వస్తున్నారు , ఒక లగ్జరీ కారును వెంటనే పిలుచుకొని వస్తారా అని అడుగగా , మహేష్ రిక్వెస్ట్ కాదు ఆర్డర్ వెయ్యి అని చెప్పి వెంటనే తన బైకులో ట్రావెల్స్ దగ్గరకు వెళ్లి అరా గంటలో లగ్జరీ AC కారును ఇంటి దగ్గరకు పిలుచుకొని రాగా , అప్పుడే బ్యాగు సర్దుకొని ఇంటికి తాళాలు వేసి బయటకు వస్తుండగా , కారు బయట తమ కోసమే వేచి చూస్తోందని , మహేష్ ఏర్పాటు చేశాడని సెక్యురిటి చెప్పగా , థాంక్స్ బావ అని మనసులో అనుకోని , చిన్నా డ్రైవర్ పక్కన కూర్చోగా అత్తాయ్య , మహి మరియు వర్షిని వెనుక కూర్చోగా కారు బయలుదేరుతుండగా , మహి నాకు ఫోన్ చేసి లవ్ యు బావ అని చిన్నగా ముద్దుపెట్టగా , ఆనందిస్తూ జాగ్రత్తగా రండి అని చెప్పి నాలో నేను నవ్వుకోసాగాను.

షోరూం కు చేరుకొని లోపలికి వెళ్లగా సగం సెలక్షన్ కూడా అవ్వకపోవడంతో కృష్ణతో పాటు బయటకు వెళ్లి పిజ్జా షాప్ కు చేరుకొని అందరికి వీలైనన్ని పిజ్జా లు మరియు కూల్ డ్రింక్స్ తీసుకొని షోరూం కు చేరుకొని కృష్ణతో కిషోర్ వాళ్లకు పిజ్జా లు ఇవ్వమని పంపించి , నేను చీరలు సెలెక్ట్ చేస్తున్న అమ్మ దగ్గరికి వెళ్లి తలపై ముద్దు పెడుతూ అమ్మకు ఒక పీస్ అందిస్తూ , మిగిలిన వారందరికీ అందివ్వగా , అందరూ నా వైపు ఆప్యాయంగా చూడసాగారు.

ఒక 40 నిమిషాల తరువాత మహి ఫోన్ చేసి బావ మేము వైజాగ్ ఎంటర్ అయ్యాము అని చెప్పగా , అయితే మేము షోరూం దగ్గర ఉన్నాము అడ్రస్ చెబుతాను డ్రైవర్ ను ఇక్కడికి కారుని తీసుకురమ్మని చెప్పి బయటకు వెళ్లి అత్తయ్య వాళ్ళ కోసం ఎదురుచూడసాగాను. సమయం 3 గంటలు అవుతుండగా , అత్తయ్య వాళ్ళ కారు షోరూం ముందు ఆగగా అందర్నీ సంతోషంగా పలకరించి , డ్రైవర్ కు డబ్బు ఇచ్చి పంపించివేసి , చిన్నాను ఎత్తుకొని అత్తయ్య అరచేతిని చూస్తూ ఇప్పుడెలా ఉంది అత్తాయ్య అని అడుగగా , బుజ్జి నొప్పి అస్సలు లేదు , త్వరగా మానిపోతోంది అని డాక్టర్ రోజు చెబుతున్నాడని చెప్పగా , సున్నితంగా కట్టుని తాకి లోపల అమ్మ వాళ్ళ దగ్గరికి పిలుచుకొనివేళ్ళాను.

2 Comments

    1. bro madhyalo part 10 to 13 parts leva bro

Comments are closed.