జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 14 44

సర్ ఏమి కావాలి అని అడుగగా చైన్స్ , గాజులు , చెవిరింగులు ………అన్ని ఒక లిస్ట్ చెప్పి పెళ్లి కూతురికి ఏవేవి అవసరం అవుతాయో అన్ని కావాలి మరియు మా వాళ్లకు ఏవి నచ్చితే అవి అని వివరించగా ,అతని కళ్ళు సంతోషంతో జిగెలు మంటుండగా అక్కడ ఉన్న సేల్స్ గర్ల్స్ ను పిలిచి మీరు వీళ్ళ దగ్గరే ఉంది మన కొత్త డిసైన్ లు అన్ని చూపించండి అని చెబుతూ దగ్గరుండి అన్ని చూపించసాగాడు. దివ్యక్క వైపు చూస్తూ ఎంత లేట్ అయినా పర్లేేదు నీకు నచ్చినవి మోహమాటపడకుండా ఆనందంగా తీసుకోమని , అమ్మ చూసుకో అక్కను అని చెప్పి ఓనర్ తో పాటు ఒక పక్క కూర్చొని నా ప్రాణానికి ప్రాణమైన అందరి కళ్లల్లో సంతోషాన్ని చూస్తూ ఆనందంతో పులకరించిపోసాగాను. వెంటనే నిశ్చితార్థపు రింగులు గుర్తుకు రాగా బావకు ఫోన్ చెయ్యగా తమ తరుపున పెళ్లి కూతురికి తీసుకున్నామని చెప్పగా , అయితే మీకు తీసుకుంటామని చెప్పి ఫోన్ కట్ చేసి అమ్మకు చెప్పగా , ప్లాటినం డైమండ్ రింగ్ సెలెక్ట్ చెయ్యసాగారు.

కొద్దిసేపటి తరువాత ఓనర్ డ్రింక్స్ తెప్పించగా తాగసాగాము. మొదట దివ్యక్కకు అందరూ సెలెక్ట్ చేసి తరువాత అమ్మ , అత్తయ్య మరియు మహి తమకు నచ్చినవి ఒకరొకరికి చూపిస్తూ సెలెక్ట్ చేసుకోసాగారు.సమయం 9 గంటలు అవుతుండగా అంటీ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు , అందరూ మీకోసమే భోజనానికి ఎదురుచూస్తున్నారు అని చెప్పగా , వచ్చేస్తున్నాము అంటీ అని, పిల్లల గురించి అడుగగా , చిన్నాకు తినిపించగా పడుకున్నాడు , వర్షిని మీ తోనే కలిసి తింటానంటోంది అని చెప్పగా , ఇక్కడ సెలక్షన్ కూడా అవ్వడంతో , అన్ని ప్యాక్ చేసి కౌంటర్ వైపు తీసుకువెల్లగా , అందరూ హ్యపీ కదా అని అడుగగా , అందరూ హ్యపీగా నవ్వగా బిల్ స్వైప్ చేసి , షాప్ ఓనర్ ను నిశ్చితార్థం గురించి చెప్పి ఆహ్వానించి 20 నిమిషాలలో ఇంటికి చేరుకున్నాము.

అంటీ , కృష్ణ మరియు అంకుల్ బయట మాకోసమే ఎదురు చూస్తూ ఉండగా షాప్ లో కొన్నవన్ని తీసుకొని కారు దిగగా అంకుల్ నన్ను ఉద్వేగంతో గర్వాంగా హత్తుకొని అందర్నీ లోపలికి పిలుచుకొని వెళ్లి త్వరగా ఫ్రెష్ అవ్వమని చెప్పి వంట గదిలోకి వెళ్ళింది .దివ్య నాన్న దగ్గరికి వెళ్లి ఉదయం తనకు చీరాల కోసం ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేయ్యగా , అర్థం చేసుకొని , 15 నిమిషాలలో అందరూ రాగా అమ్మ , అంటీ మరియు మహి వంట గదిలో నుండి చేసినవాన్ని తీసుకొని హాల్ లోకి రాగా వర్షిని పరిగెత్తుకుంటూ వచ్చి నా పక్కనే కూర్చోగా, మహి మరియు వర్షిని అత్తయ్యకు తినిపించగా అది చూసి ఆనంద భాస్పాలు కారగా అందరూ కలిసి ఆనందంగా మాట్లాడుతూ నవ్వుకుంటూ భోజనం చేసాము.

2 Comments

    1. bro madhyalo part 10 to 13 parts leva bro

Comments are closed.