జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 14 44

అత్తయ్య లోపలికి వస్తుండగా , అమ్మ కుర్చీలో నుండి లేచి మా దగ్గరికి వస్తూ అత్తయ్యను సంతోషంగా కౌగిలించుకొని కట్టు ఉన్న చేతిని చూస్తూ బాధపడుతూ ఇప్పుడెలా ఉందని అడిగి , క్షేమసమాచారాలు తెలుసుకొని మహిని, పిల్లలను పలకరించి పిలుచుకొని వెళ్లగా , అత్తయ్య మరియు మహి దివ్యను సంతోషంగా కౌగిలించుకొని శుభాకాంక్షలు తెలిపి అందరూ చీరలను సెలెక్ట్ చెయ్యసాగగా , నేను , కృష్ణ మరియు చిన్నా ఒకసారి కిషోర్ బావను పలకరించి వెయిటింగ్ రూమ్ లో టీవీ చూస్తూ కాలం గడపసాగాము.

అంతా అయ్యేసరికి సాయంత్రం 5 గంటలు అవుతుండగా మొదట బావ మా షాపింగ్ అయిపోయిందని మా తోడుగా టీవీ చూస్తూ కూర్చున్నారు. సుమారు 7 గంటల సమయంలో మా వాళ్ళు మరియు కిషోర్ అక్క అయిపోయింది అని చెప్పగా ఆనందంతో ప్రాణం తిరిగి వచ్చింది. పెళ్ళికొడుకు , పెళ్లికూతురు బట్టలు తప్ప మిగతా బట్టలన్నింటికి వేరు వేరుగా బిల్ పే చేసేసి , పెళ్ళికూతురు బట్టలను వాళ్లకు ఇచ్చి రేపు వాళ్ళ ద్వారా అందుకొనేలా ఎక్స్చేంజి చేసుకొని బయటకు నడిచాము.

వర్షిని నా పక్కనే నడుస్తూ మామయ్య అత్తమ్మ మా అందరికి కూడా కొత్త బట్టలు తీసుకుంది అని చెబుతూ , మహి అక్క చీర సూపర్ గా ఉంది అని చెప్పగా , కిషోర్ వెళతాము అని చెప్పి దివ్యక్కను చూసి నవ్వుతూ పలకరించి వాళ్ళ కారులో అన్ని సర్దుకొని వెళ్లిపోయారు. మా బట్టలన్నీ మా వాహనం లో పెట్టి కృష్ణకు తాళాలు ఇచ్చి , కారు తాళాలు తీసుకొని పిల్లలను పిలుచుకుని నువ్వు ఇంటికి వేళ్ళు , కొద్దిగా పని ఉంది మేము కారులో వెళ్లి చూసుకొని అటు నుండి వచ్చేస్తాము అని చెప్పి పిల్లలకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే టీవీ చూస్తూ ఉండండి అని చెప్పి అరే మామా పిల్లలు జాగ్రత్త అని చిన్నాకు ముద్దు పెట్టి వాళ్ళు కనుచూపు మేర వెల్లేంతవరకు చూస్తూ , దివ్యక్క ఎక్కడికి అని అడుగగా, ఒక చిరునవ్వు నవ్వి కారు ఎక్కమని చెప్పగా , మహి నా పక్కన ముందు కూర్చోగా , మిగిలిన ముగ్గురు వెనుక కూర్చొనగా కారును ముందుకు పోనిచ్చి 15 నిమిషాలలో ఒక జ్యువెలరీ షాప్ ముందు ఆపగా అందరి ముఖాలు కాంతితో వెలిగిపోతుండగా అమ్మ వైపు తిరిగి , రేపు నిశ్చితార్థానికి దివ్యక్కకు ఏవేవి కావాలో , మరియు మీకు ఏవేవి నచ్చితే అవి తీసుకోండి అని పూర్తి స్వాతంత్య్రం ఇవ్వగా అందరి ముఖాలు నవ్వుల్లో వెల్లివిరువగా కదలకుండా ఆశ్చర్యంతో నా వైపు చూస్తుండగా కారు హార్న్ గట్టిగా కొట్టి పగలబడి నవ్వుతూ త్వరగా సమయం లేదు అని చెప్పగా , అందరూ వడివడిగా దిగి లోపలికి వెళ్తుండగా ,ఓనర్ నన్ను చూసి ఆత్రంగా డోర్ దగ్గరికి వచ్చి సంతోషంగా పలకరిస్తూ ఆహ్వానించసాగాడు.

2 Comments

    1. bro madhyalo part 10 to 13 parts leva bro

Comments are closed.