జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 14 44

అక్కడ 6 గంటల కల్లా అందరూ రెడి అయిపోయి , అంటీ , కృష్ణ గాడు మళ్ళీ నాకు కాల్స్ చేస్తూ , బంధువులు వేరే ఊర్లలో నుండి వస్తుండగా , వాళ్ళందరిని సంతోషంగా ఆహ్వానిస్తూ ఇల్లంతా సందడి సందడిగా మారిపోతూ హడావిడిగా ఉంది. అమ్మ , మహి అందరికి టీ, కాఫీ లు తయారు చేసి ఇస్తూ స్నానాలు చెయ్యడానికి ఒక్కొక్కరనే పంపుతున్నారు. అంకుల్ వస్తున్న బంధువులను దగ్గర ఉండి సాదరంగా ఆహ్వానిస్తున్నారు.

ఇక్కడ నలుగురు 7 గంటలకల్లా రెడి అయ్యి అమ్మ బట్టలు తీసుకొని బ్యాగులో పెట్టుకొని, మొబైల్ అందుకొని స్విచ్ on చేసి బయటకు అందరూ వచ్చి ఇంటికి తాళాలు వేస్తుండగా ,మెస్సగె వచ్చినట్లుగా సౌండ్ రావడంతో కారులో వెల్తూ చూద్దాములే అనుకోని పిల్లలను వెనుక ఎక్కించి , అత్తయ్య ముందు కూర్చోగా మెసేజ్ బీప్ శబ్దం 5 నిమిషాలవరకు వస్తూనే ఉండటంతో మొబైల్ అందుకొని చూడగా , కృష్ణ మరియు అంటీ నుండి missed కాల్ అలర్ట్స్ ఇంకా వస్తూనే ఉండటంతో వెళ్తున్మాది అక్కడికే కదా అని కారును స్టార్ట్ చేసి వెల్తూ , ముందుగా వంట వాళ్ళు వచ్చారో లేదో అని కాల్ చెయ్యగా , సర్ రెండు ఇళ్లకు దారిలో వెళ్తున్నాము అని చెప్పగా త్వరగా రండి అని చెప్పి కాల్ కట్ చేసి , కిషోర్ బావకు కాల్ చేసి వంట వాళ్ళు వస్తున్నారు వారికి ప్లేస్ చూపించు అన్నయ్య అని చెప్పగా , thank గాడ్ తమ్ముడు బంధువులు చాలా మంది వస్తున్నారు ఎలా అని అనుకుంటుండగా మంచి వార్త చెప్పావు అని చెప్పగా కాల్ కట్ చెయ్యగా ఇంకా మెసేజ్ లు వస్తూనే ఉన్నాయి.

15 నిమిషాలలో ఇంటికి చేరగా మాతో పాటు వంట వాళ్ళు మరియు , decoration వాళ్ళు రాగా , వంట వాళ్లకు ఒక మూలన ప్లేస్ చూపించి , ఇల్లు మొత్తం లైట్ లతో అలంకరించి ముందు అంతా షామియానా వేయమని చెబుతుండగా , దివ్యక్క కాల్ చేస్తుండటంతో కాల్ ఎత్తగా అన్నయ్య నా రూమ్ కి వెంటనే రమ్మనగా , లోపలికి వెళ్లగా అమ్మ , మహి వంట గదిలో ఉండగా అత్తయ్య వంట గదిలోకి వెళ్లి సహాయం చెయ్యగా, ముందుగా దివ్యక్క రూమ్ లోపలికి వెళ్లి ఏమిటక్కా అని అడుగుతుండగా, అంటీ నన్ను ముందు నుండి గట్టిగా కౌగిలించుకొని ఏమి మాట్లాడకుండా కృతజ్ఞతా భావంతో , ఉద్వేగంతో కన్నీళ్లు కారుస్తుండగా , అంటే ఏమయ్యింది అని అడుగుతున్నా కూడా వదలకుండా ఇంకా గట్టిగా కౌగిలించుకోగా , అక్క వైపు చూడగా , అమ్మకు తెలిసిపోయింది అని కళ్లతో చెబుతూ ముందుకు వచ్చి ఇద్దరిని కౌగిలించుకోగా , అంతేనా , నేనేమో అనుకుని భయపడ్డాను అని , అంటీ తలను రెండు చేతులతో ఎత్తి , బంధువులంతా వచ్చారు అందరూ సంతోషంగా ఉన్నారు , మనం తరువాత మాట్లాడదాము , ముందు మీరు నవ్వండి అని కన్నీళ్లను తుడుస్తూ , ఇంకా చాలా పనులున్నాయి అని సంతోషంగా నవ్వుతూ బయటకు పిలుచుకువచ్చి నవ్వమని స్మైల్ చూపించగా , నా తలపై ఆశీర్వదించి ఆనందంగా నవ్వగా , మా మంచి అంటీ అని అంటీ ని వంతగాధిలోకి పిలుచుకొని వెళ్లి , అమ్మను , మహిని పలకరించి అమ్మ తలపై ప్రేమగా ముద్దు పెట్టి , అమ్మ వంట వాళ్ళు వచ్చేసారు వాళ్ళు వంట పని చూసుకుంటారు , ఇక మిగితా పనులు చూసుకొండని చెప్పగా , హమ్మయ్య బంధువులంతా వచ్చారు మంచి పని చేసావు కన్నయ్య అని నా నుదుటిపై ముద్దు పెట్టగా నవ్వుతూ బయటకు వస్తుండగా , కృష్ణ బంధువుల చిన్న పిల్లలకు బయటే స్నానం చేయడానికి వేడి నీళ్లను బయటకు తోడేస్తూ లోపలికి వస్తుండగా నన్ను చూసి వేగంగా నా వైపు వచ్చి నన్ను క్షమించు రా మామా , నీకు చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశాను , అంత డబ్బు ఆడిగేసరికి నాకు కాళ్ళు చేతులు ఆడక మెదడు పని చేయకుండా పోయింది .

ఎప్పుడైతే ఆయన వచ్చారో అప్పుడేరా నా మనసు కుదుటపడింది. దయచేసి నన్ను క్షమించారా అని గట్టిగా కౌగిలించుకోగా , వాడిపై ఉన్న కోపం అంతా కరిగిపోయి గట్టిగా కౌగిలించుకొని నవ్వుతూ ఒరేయ్ మనం ఫ్రెండ్స్ రా , ఎంత కష్టం వచ్చినా ఇద్దరు పంచుకోవాలి సరేనా అని మరొకసారి చెబుతూ , పదరా ఇంకా చాలా పనులున్నాయని నవ్వుతూ బయటకు నడిచాము. అంతలో స్టూడియో నుండి ఫోటోగ్రాఫర్స్ , వీడియో కవరేజ్ తో సహా రాగా తమ పని వాళ్ళు చేసుకుపోయారు.

2 Comments

    1. bro madhyalo part 10 to 13 parts leva bro

Comments are closed.