జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 6 89

మొత్తం అయినన్ని చీరలను బ్యాగ్ లో పెట్టి ఇవ్వగా ఫోన్ లో సమయం చూడగా 11 గంటలు అవుతుండగా బ్యాగును ఆటోలో పెడుతుండగా ఎదురుగా మొబైల్ షాప్ కనపడగా 5 నిమిషాలు అని చెప్పి లోపలికి వెళ్ళి శ్యాంసంగ్ 5 ఇంచెస్ స్మార్ట్ మొబైల్ మరియు సిమ్ కొనుక్కొని దానిలో వేసి మెకానిక్ దగ్గరికి వెళతాడు. షాప్ లోపలికి వెళ్ళడానికి మహేష్ చీరల బ్యాగు తీసుకోగా ఆటో డ్రైవర్ మిగిలిన సామానులను తన వెనుకే తీసుకుని వచ్చి లోపల పెట్టగా ఎంత అని అడిగి అతడు చెప్పిన డబ్బును ఇచ్చి పంపిస్తాడు.

మహేష్ ను చీఫ్ మెకానిక్ చూసి భయ్యా నీకే ఫోన్ చేద్దామనుకుంటుండగా నువ్వే వచ్చావు పదా చూద్దాము అని షెడ్ లోపలికి తీసుకుపోగా ఒక చివరగా రెడ్ కలర్ లో ఓమ్ని కంటే పెద్దగా ఒక వెహికల్ తను చేసిన వెంటనే అదే అయితే బాగుంటుంది అని మనసులో అనుకుంటుండగా ఆ వ్యక్తి సరాసరి అక్కడికే తీసుకు వెళ్లడంతో wow అని అంటూ ఆశ్చర్యపోతుండగా అతడు ముందు చెరొక వైపు ఉన్న డోర్ లు మరియు వెనుక వాహనం వెడల్పు పూర్తిగా తెరుచుకొనే డోర్ తెరిచి లోపల చూపించగా ముందు మాత్రం డ్రైవింగ్ సీట్ మరియు పక్క సీట్ వుండి వెనుక సీట్లన్నీ తీసివేసి 6 అడుగుల బెడ్ పరిచి వాహనం చుట్టూ మెత్తటి ఫోమ్ అతికించారు.

భయ్యా చితగ్గొట్టేశావు పో అని అతడి చేతులను పెట్టుకుంటుండగా చేతులకు డీజల్ అంటి ఉండటంతో వెనక్కు తీసుకోగా ఇంత అద్భుతంగా మార్చినందుకు అసలు నిన్ను కౌగిలించుకోవాలి అని కౌగిలించుకుంటాడు. మహేష్ చూపిస్తున్న కృతజ్ఞతా భావానికి అతడు సంతోషంలో మునిగి తెలుతాడు.

భయ్యా నాకు ఇంకొక చిన్న సహాయం కావాలి అని అడుగగా నిన్న చెప్పడం మరిచిపోయాను ఒక చిన్న చతురస్రాకార ట్రాలీ కావాలి అని అడుగగా షెడ్ పక్కనే ఉన్న ఖాళీ ప్రాంతానికి తీసుకు వెళ్లగా అక్కడ అలాంటివి రెండు ఉండగా అందులో మంచి కండిషన్ లో ఉన్న దానిని చూపించగా ములుగురు వచ్చి ఒకడు టైర్ లు మార్చగా మరొక వ్యక్తి పెయింట్ పనిని ఇంకొకడు రెండింటిని కలపడానికి లింకు వెల్డింగ్ చేస్తాడు.

1 Comment

Comments are closed.