జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 6 89

జానకికి తన కొడుకు పరిస్థితి పూర్తిగా అర్థం అవుతుంది. మహేష్ కు చిన్నప్పటి నుండి తన తల్లి కంటే వాళ్ళ నాన్న అంటేనే చాలా ఇష్టం , కావున అతడు కట్టిన తాళిని చూసి ఆగిపోతున్నాడని అర్థమయ్యి త్వరగా భోజనం చెయ్యగా బయట నుండి బ్యాగు తెస్తూ అమ్మ బెడ్రూం లో పెడతాను అని చెప్పి , అక్కడ తమకు ఏవేవి ఉపయోగపడతాయో ఆలోచించి రెండు దిండ్లు , రగ్గులు , తన బట్టలు , towels అన్ని ఒక్కొక్కటిగా వాహనం వెనుకవైపు పెడతాడు.

అమ్మ అన్ని పెట్టీశాను ఇక నీ బట్టలు ఈ బ్యాగులో పెట్టీస్తే ఇక వెళ్లడమే అని చెప్పి స్నానం చేయడానికి వెళతాడు. జానకి తిన్న ప్లేట్ లను శుభ్రం చేసి వాటి స్థానాలలో పెట్టేసి బెడ్ రూమ్ లోకి వెళ్లి కొన్ని జతల బట్టలను బ్యాగులో పెట్టి , ఇంకా కొన్ని నగలను హాండ్ బ్యాగులో పెట్టి రెడి అయిపోతుంది.

మహేష్ స్నానం చేసి బట్టలు వేసుకొని తన అమ్మ బట్టలు ఉన్న బ్యాగును బయటకు తీసుకు వెళ్లగా లక్మయ్య గేట్ బయట దిక్కులు చూస్తుండగా అన్న అని పిలిచి తాము వచ్చేవరకు ఇల్లు జాగ్రత్త అని చెప్పి కొంత డబ్బు అతడికిచ్చి లోపలికి వెళ్లగా కన్నా నేను రెడి అని హాండ్ బ్యాగ్ భుజంపై వేసుకొని జానకి చెప్పగా బెడ్ రూమ్ కు తాళం వేసి బయటకు వచ్చి తలుపుకు తాళం వేసి , ఆతాళం లలో నుండి వాచ్ మాన్ రూమ్ మరియు బయట గేట్ తాళం వేరుచేసి అతడికి ఇస్తుండగా తన తల్లి ఆ వాహనాన్ని ఆశ్చర్యంగా చూస్తూ కన్నా అద్భుతంగా ఉంది అని చెప్పి లోపల ఎక్కి కూర్చొంటుంది.

మహేష్ నవ్వుతూ వాహనం ఎక్కి జేబులో ఉన్న మొబైల్ తీసి తన అమ్మకు ఇచ్చి అమ్మ నీ కోసం అనగా దానిని అందుకొని unlock చెయ్యగా లవ్ యు అమ్మ అని థీమ్ ఉండటంతో ఆ మొబైల్ ను గుండెలపై పెట్టుకొని తన కొడుకు వైపు ప్రేమగా చూస్తుండగా మహేష్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తాడు.

1 Comment

Comments are closed.